Site icon NTV Telugu

MP Santhosh Kumar: గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కు మరో వినూత్న అవార్డు

Mp Santhosh

Mp Santhosh

MP Santhosh Kumar: గ్రీన్ ఇండియా ఛాలెంజ్ తో దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు అందుకున్నారు టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్. అయితే.. పర్యావరణ రక్షణకు పాటుపడినందుకు అవార్డు అందించిన ప్రముఖ మీడియా సంస్థ నెట్ వర్క్ 18 గ్రూప్ పచ్చని పర్యావరణం కోసం అలుపెరగని కృషి చేస్తూ, దేశ వ్యాప్తంగా పచ్చదనం పెంపుపై అవగాహన కల్పిస్తున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మరో అవార్డును సొంతం చేసుకుంది. గ్రీన్ ఛాలెంజ్ ఆద్యులు, రాజ్యసభ ఎం.పీ జోగినపల్లి సంతోష్ కుమార్ ను గ్రీన్ రిబ్బన్ ఛాంపియన్ గా గుర్తిస్తూ ప్రముఖ జాతీయ మిడియా సంస్థ నెట్ వర్క్ 18 గ్రూప్ అవార్డును అందించింది. గతవారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో అనివార్య కారణాల వల్ల ఎం.పీ హాజరు కాలేక పోయారు. దీంతో ఇవాళ నెట్ వర్క్ 18 గ్రూప్ ప్రతినిధి ఎం.పీ సంతోష్ కుమార్ ను హైదరాబాద్ లో కలిసి అవార్డును అందించారు. పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపు, సామాజిక స్ప్రహ, అన్ని వర్గాల ప్రాతినిధ్యానికి కృషి, దేశ వ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను గ్రీన్ అంబాసిడర్లుగా ప్రమోట్ చేస్తున్నందుకు సంతోష్ కుమార్ గ్రీన్ రిబ్బన్ ఛాంపియన్ గా ఎంపికైనట్లు నెట్ వర్క్ 18 గ్రూప్ తెలిపింది. పర్యావరణ మార్పుల వల్ల మానవాళికి పొంచిఉన్న పెను ముప్పుపై అవగాహన కల్పించేందుకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చేస్తున్న కృషి అమోఘమని సంస్థ ప్రతినిధులు అన్నారు.

Read also: AP Cabinet Expansion: ఎమ్మెల్సీ ఫలితాలు.. మంత్రివర్గ విస్తరణకు సంబంధం ఏంటి..?

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో చురుగ్గా వ్యవహరిస్తున్న టీఆర్ఎస్ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్‌కు ప్రతిష్టాత్మక వృక్ష మిత్ర సమ్మాన్ ఏప్రిల్ 2, 2022 అవార్డు లభించిన విషయం తెలిసిందే. కానీ అనివార్య కారణాల వల్ల అతనికి అవార్డు రాలేదు. ఆయన తరపున గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కు చెందిన రాఘవ, మార్డి కరుణాకర్ రెడ్డి ఐక్యరాజ్యసమితి పర్యావరణ విభాగం మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎరిక్ సోలిమ్ మరియు ట్రీమ్యాన్ ఆఫ్ ఇండియా విష్ణు లాంబా చేతుల మీదుగా వృక్షమిత్ర అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ మాట్లాడుతూ అవార్డుకు ఎంపిక చేసినందుకు జ్యూరీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ అవార్డు తన ఒక్కరిదే కాదని.. తన పిలుపుతో కోట్లాది మొక్కలు నాటిన తెలంగాణ బిడ్డలందరికీ దక్కుతుందని అన్నారు. అలాగే రేపటి సమాజం కోసం గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా విదేశాల్లో మొక్కలు నాటిన తన మొక్కల ప్రేమికులందరికీ తెలిపారు.
Telangana: హజ్ కు 3690 మంది యాత్రికులు ఎంపిక

Exit mobile version