Site icon NTV Telugu

Anesthetic Injection: నా ట్రీట్మెంట్ మీద నమ్మకం ఉంది.. ఎన్టీవీతో డాక్టర్ శశిబాల

Anesthetic Injection Doctor

Anesthetic Injection Doctor

ఖమ్మం జిల్లా కేంద్రంలో ప్రైవేటు ఆసుపత్రిలో తన భార్య కు మత్తుమందు ఇచ్చి హత్య చేసిన ఘటనపై డాక్టర్ శశిబాల స్పందించారు. ఆమె ఎన్టీవీతో మాట్లాడారు.. తాను వైద్యం చేసిన సునిత మొదటి నుంచి మంచి బలంగా ఉందని, ఆమెకి ట్యుబెడ్తమి ఆపరేషన్ కూడా చేశానని అందువల్ల ఆమె మృతిపై నాకు అనుమానాలు ఉన్నాయని శశిబాల తెలిపారు. అందువలన తాను పోలీసులకు ఫిర్యాదు చేశానని డాక్టర్ శశిబాల చెప్పింది. మత్తుమందుల విషయంలో అజాగ్రత్తగా ఉండరాదని తెలిపారు.

ఖమ్మంలో తాజాగా ఇంజక్షన్‌ ఇచ్చి బైక్‌ తో పరాయ్యాడు నిందితుడు. అయితే దీనిపై సమగ్ర విచారణ జరిపిన పోలీసులు భార్యే పక్కడ్బందీగా భర్త పై హత్య చేయించిందని నిర్ధారణకు వచ్చారు. దీనికి గల కారణ వేరొకరితో వివాహేతర సంబంధమే అని పోలీసులు తేర్చారు. ఈ ఘటన మరువకముందే మరో మత్తు ఇంజక్షన్‌ ఘటన వెలుగుచూసింది. అతనికి ఇద్దరు భార్యలు. వాళ్ళిద్దరి మధ్య తరుచూ గొడవలు. ఇద్దరిలో ఒకరిని చంపేస్తే తప్ప తనకు మనశ్శాంతి లేదు అనుకున్నాడు. ఈనేపథ్యంలో.. చిన్న భార్యకు మత్తుమందు ఇచ్చి చంపేశాడు. ఖమ్మం జిల్లాలో 50 రోజుల క్రితం జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఖమ్మం రూరల్ మండలం పెద్దతండాకు చెందిన భిక్షం నగరంలోని ఓ ఆస్పత్రిలో ల్యాబ్ టెక్నీషియన్ గా, అనస్థీషియా వైద్యుడి వద్ద సహాయకుడిగా పనిచేస్తున్నాడు. అతనికి మొదట తన మేనకోడలితో వివాహం అయ్యింది వీరికి పిల్లలు పుట్టలేదు. అయితే.. పిల్లలు కావాలని తనకంటే ఇరవై ఏళ్ల చిన్నది అయిన నవీనను రెండో పెళ్లి చేసుకున్నాడు. కాగా.. కొద్దిరోజులు ముగ్గురూ అన్యోన్యంగానే ఉన్నారు. అయితే.. నవీనకి పాప పుట్టింది. దీంతో.. ఇద్దరు భార్యల మధ్యగొడవలు మొదలయ్యాయి. ఈక్రమంలోనే నవీన రెండోసారి గర్భం దాల్చింది. రోజూ గొడవలతో విసిగిపోయిన భిక్షం భార్య నవీనను హతమార్చాలని పథకం వేశాడు.

భార్య ప్రసవంకోసం జూలై 30న ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించాడు. ఆమెకు ఆడ శిశువు పుట్టింది, మరుసటి రోజు తెల్లవారేసరికి నవీన ఆస్పత్రిలోనే మృతిచెందింది. అయితే.. సరిగ్గా వైద్యం చేయకపోవడం వల్లే తన భార్య చనిపోయిందంటూ తన బంధువులతో ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగాడు భిక్షం.  దీంతో.. నవీన హఠాత్తుగా ఎందుకు చనిపోయింది అర్థం కాని వైద్యులు, ఆస్పత్రి సిబ్బంది తీవ్ర ఆందోళన చెందారు. ఇక చేసేదేమి లేక బిక్షం కూతుర్లు ఇద్దరికీ ఆర్థిక సాయం చేస్తామని సదరు ఆస్పత్రి యాజమాన్యం హామీ ఇచ్చింది. అయితే.. ఆందోళన విరమించిన భిక్షం నవీన మృతదేహాన్ని ఊరికి తీసుకు వెళ్ళకుండా ఖమ్మంలోనే స్మశాన వాటికలో అంత్యక్రియలు పూర్తి చేశాడు. దీంతో.. నవీన అంత్యక్రియలను ఖమ్మంలో నిర్వహించడంతో ఆసుపత్రి సిబ్బందిలో అనుమానం మొదలైంది. ఇక హాస్పిటల్ లోని సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించారు. అయితే.. ప్రసవం జరిగిన రోజు అర్ధరాత్రి రెండు గంటల సమయంలో బిక్షం తన భార్యకు ఇంజక్షన్ ఇవ్వడం.. ఆమె చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత బయటకు వెళ్లి హడావిడి చేయడం కనిపించాయి. దీంతో.. నిర్ఘాంతపోయిన ఆస్పత్రి యాజమాన్యం ఖమ్మం టూ టౌన్ పోలీస్ లను సంప్రదించింది. అయితే.. స్వాతంత్ర వజ్రోత్సవాలు, వినాయక చవితి నేపథ్యంలో ఈ విషయాన్ని పోలీసులు లైట్ తీసుకున్నారు. అయితే.. ఇటీవల భిక్షంను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది. తన రెండో భార్య నవీనకు ఇంజక్షన్ ద్వారా అధిక మోతాదులో మత్తుమందు ఇచ్చి చంపినట్లు ఒప్పుకున్నాడు. అయితే.. జమాల్ సాహెబ్ ఘటనతో ఇది కూడా వెలుగులోకి వచ్చింది.
Yanamala Ramakrishnudu: అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు.. నియంత పోకడలు

Exit mobile version