NTV Telugu Site icon

Jaya Jaya Telangana: తెలంగాణ గీతం ఆవిష్కరణ.. భావోద్వేగానికి గురైన అందెశ్రీ

Andesri

Andesri

Jaya Jaya Telangana: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర గీతం ‘జయ జయహే తెలంగాణ’ ప్రజల ముందుకు వచ్చింది. పరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన దశాబ్ది వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి ఈ గీతాన్ని ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్ర గీతం ‘జయజయహే తెలంగాణ’ పాటను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. పరేడ్ గ్రౌండ్స్ లో తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆయన పాటను విడుదల చేశారు. రాష్ట్ర గీతాన్ని జాతికి అంకితం చేశారు. ఈ పాటను అందెశ్రీ రచించగా.. కీరవాణి సంగీతం అందించారు. పాట విడుదల సందర్భంగా రచయిత అందెశ్రీ భావోద్వేగానికి గురయ్యారు. సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలని అంటూ వస్తున్నా జై తెలంగాణ పాట వింటూ అందెశ్రీ కంట కన్నీటితో ఆ పాటను ఆలకిస్తూ భావోద్వేవం చెందారు.

Read also: CM Revanth Redddy: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం.. సీఎం రేవంత్ ప్రసంగం హైలెట్స్..

పాట వింటున్నంత సేపు ఆయన కళ్లలో కన్నీరు ఆగలేదు. తెగింపు, త్యాగాల చరిత్ర కలిగిన ఈ పాటతో ఫరేడ్ గ్రౌండ్ లో అంతా సాగింది. కాగా.. అనంతరం కీరవాణి ని మాట్లాడమన్నారు. పరేడ్ గ్రౌండ్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు. అనంరతం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఒకనాడు పొట్ట చేత పట్టి పట్నంకు వచ్చిన యువత… రేపటి నాడు ప్రపంచానికి మన సత్తా చాటే శక్తిగా మారాలి. తెలంగాణ ఇతర రాష్ట్రాలతో కాదు ప్రపంచంతో పోటీ పడుతుందని నిరూపించాలి. మనకు శక్తి ఉంది, సత్తువుంది… తెలివి ఉంది, తెగింపు ఉంది, త్యాగాల చరిత్ర ఉంది. ఏం తక్కువ తెలంగాణకు అన్నారు.
Telangana Decade Celebrations LIVE: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు లైవ్‌ అప్‌డేట్స్