Site icon NTV Telugu

Jupally Krishna Rao : అనంతగిరి రిసార్ట్స్‌కి కొత్త రూపు.. మంత్రి జూపల్లి ప్రత్యేక ప్లాన్ ఏంటి.?

Jupally Krishna Rao

Jupally Krishna Rao

Jupally Krishna Rao : వికారాబాద్ జిల్లా అనంతగిరి పర్యాటక అభివృద్ధి దిశగా పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పలు చర్యలు చేపట్టారు. వికారాబాద్ కేంద్రంలో ఆయన అనంతగిరి హరిత రిసార్ట్స్, అనంతగిరి వ్యూ టవర్ ప్రాంతాలను ప్రత్యేకంగా పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, హరిత రిసార్ట్స్‌ను పైలట్ ప్రాజెక్ట్‌గా జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ పర్యవేక్షణలో అప్పగించినట్లు తెలిపారు. ప్రైవేట్ రిసార్ట్స్ అందించే సౌకర్యాలకు ఏమాత్రం తీసిపోకుండా ఆధునిక సదుపాయాలతో హరిత రిసార్ట్స్‌ను అభివృద్ధి చేయాలని ఆయన స్పష్టం చేశారు.

Visakhapatnam : విశాఖ భీమిలిలో మైనర్ పై ఆటో డ్రైవర్ అత్యాచారం

ఈ ప్రాజెక్టు ద్వారా వికారాబాద్‌తో పాటు పరిసర ప్రాంతాల యువతకు ఉపాధి అవకాశాలు పెరిగి, ప్రభుత్వానికి ఆదాయ వనరులు విస్తరించి, రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి తోడ్పడతాయని మంత్రి నమ్మకం వ్యక్తం చేశారు. కలెక్టర్ తక్షణమే చర్యలు తీసుకుని అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. వికారాబాద్ పర్యాటక దృష్టిలో ప్రత్యేకత కలిగిన ప్రదేశమని, అనంతగిరి పర్వతాల అందాలు, హరిత రిసార్ట్స్ సదుపాయాలు, వ్యూ టవర్ ఆకర్షణలు మరింత మంది సందర్శకులను ఆకట్టుకుంటాయని జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు.

ఫ్యాషన్ క్వీన్‌గా మారిన పాయల్ రాజ్‌పుత్ సోషల్ మీడియా హీట్ పెంచింది

Exit mobile version