Site icon NTV Telugu

Alai balai: అలయ్​ బలయ్ వేడుకలో మెగాస్టార్.. డోలు వాయిస్తూ డ్యాన్స్‌ చేసిన చిరు

Alai Balai

Alai Balai

Alai balai: హైదరాబాద్‌ నాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానంలో అలయ్‌ బలయ్‌ వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. హర్యాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మీ ఆధ్వర్యంలో అలయ్‌బలయ్‌ దసరా సమ్మేళనం 2022 నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ కార్యక్రమానికి హాజరైన మెగాస్టార్‌ చిరంజీవి డబ్బు వాయిస్తూ సందడి చేసారు. మెడలో డోలు వేసుకుని ఉత్సాహంగా డబ్బు వాయించారు. చేతులెత్తి స్టేప్పులు వేశారు. పక్కనే వున్న గవర్నర్‌ బండారు దత్తాత్రేయ కూడా మెడలో డోలు వేసుకుని చిరుతో పాటు డోలు వాయించారు. చిరు డోలు వాయిస్తూ డాన్సు చేస్తే అక్కడున్న వారందరిని ఉత్సాహపరిచారు. దీంతో అక్కడ సందడి వాతావరణం కనిపించింది. చిరుతో పాటు అందరూ ఆనందంగా మెగాస్టార్‌ వాయిస్తున్న డోలుకు ఆనందంగా డ్యాన్సులు చేశారు.

Read also: Tragedy in Rajendranagar: దుర్గాదేవి నిమజ్జనంలో అపశృతి యువకునిపై పడ్డ విగ్రహం..

అయితే.. బండారు దత్తాత్రేయతో పాటు మహారాష్ట్ర మాజీ గవర్నర్‌ విద్యాసాగర్‌రావు, మెగాస్టార్ చిరంజీవి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి.హనుమంతరావు, మాజీ ఎమ్మెల్సీ రామచందర్‌రావు, గరికపాటి నరసింహారావు, భాజపా నేతలు వివేక్, కొండా విశ్వేశ్వర రెడ్డి, సినీ నటుడు బాబూమోహన్, ఎమ్మెల్యే రఘునందనరావు, సంగీత దర్శకురాలు శ్రీలేఖ కార్యక్రమానికి హాజరయ్యారు. కాగా..ఈ కార్యక్రమంలో చిరంజీవి కళాకారులతో కలిసి డప్పు వాయించి అందరిని ఉత్సాహపరిచారు. కాగా.. అంతకు ముందు హాజరైన వీహెచ్‌ కూడా కళాకారులతో కలిసి డోలు వాయించారు. ఈకార్యక్రమానికి తెలంగాణ, ఏపీ, కేరళ గవర్నర్లు డాక్టర్ తమిళసై సౌందర రాజన్, విశ్వభూషణ్ హరిచందన, ఆరిఫ్ ఖాన్​, హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, హాజరుకానున్న కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, భూపేంద్ర యాదవ్, కిషన్ రెడ్డి, భగవంత్ ఖుభా కూడా హాజరు కానున్నారు.

Exit mobile version