Puvvada Ajay Kumar: తెలంగాణ రాష్ట్రంలో ఒక్క నీటి సమస్యే కాదు కరెంట్ సమస్య కూడా నడుస్తుందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ అన్నారు. ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. కేసిఆర్ అంటేనే కాలువలు, చెరువులు నదులు ఆయన లేకపోతే నీటి ఎద్దడి వస్తుందని కేవలం 4 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం నిరూపించిందన్నారు. ప్రభుత్వ చేతగాని తనం వల్ల వచ్చిన కరువుగా దీనిని గుర్తించాలన్నారు. మన చేతుల్లో ఉన్న వ్యవస్థలను మనం 10 యేళ్లు కాపడుకున్నామన్నారు. నాగార్జున సాగర్ లో ఉన్న నీళ్లను తాగునీటిగా తీసుకోలేని పరిస్థితి అన్నారు. రాష్ట్రంలో పంటలు ఎండి పోవడమే కాదు, తాగునీటికి కూడా సమస్యలు వచ్చాయన్నారు.
Read also: Top Headlines @1PM: టాప్ న్యూస్!
మార్చి లోనే ఈ సమస్య ఉంటే ఏప్రిల్, మే లో ఎంత నీటి ఎద్దడి ఉంటుందో అర్థం చేసుకోవాలన్నారు. ఒక్క నీటి సమస్యే కాదు కరెంట్ సమస్య కూడా రాష్ట్రంలో నడుస్తుందన్నారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి కి వచ్చి 4 నెలలు అవుతున్న ఇంతవరకు రైతులకు రైతు బంధు పడలేదన్నారు. రైతులకు ఎకరానికి నష్టం కింద 30 వేలు ఇవ్వాలన్నారు. ఖమ్మం నగర ప్రజలు ఎన్నో కుటుంబాలు మిషన్ భగీరథ మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నారని తెలిపారు. కేవలం సగం టీఎంసీ మాత్రమే ఉంది నీళ్ళు కేవలం వారం రోజులు మాత్రమే వస్తాయి ఆ తర్వాత జిల్లా ప్రజల పరిస్థితి ఏంటి? అని ప్రశ్నించారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రేపటి నుండి బీఆర్ఎస్ అభ్యర్థి నామనాగేశ్వర రావు ప్రచారం నిర్వహిస్తారన్నారు. నామా నాగేశ్వరరావును అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.
Krishna Express: విరిగిన రైలుపట్టాలు.. ఆలేరు వద్ద కృష్ణ ఎక్స్ ప్రెస్ కు తప్పిన ప్రమాదం..