NTV Telugu Site icon

Air Ambulance: తెలంగాణలో ఎయిర్ అంబులెన్స్‌లు.. ఆపద సమయంలో అత్యవసర సేవలు..

Air Ambulance

Air Ambulance

Air Ambulance: తెలంగాణ ప్రభుత్వం వైద్య రంగానికి పెద్దపీట వేస్తోంది. కొత్త వైద్య కళాశాలలు, ఆసుపత్రుల నిర్మాణం, ఆధునీకరణ పనులు ఇప్పటికే చేపట్టారు. ఉచిత డయాలసిస్ సేవలు, వైద్య పరీక్షలు కూడా నిర్వహిస్తున్నారు. తగా.. తెలంగాణ పేద రోగులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. త్వరలో రాష్ట్రంలో ఎయిర్ అంబులెన్స్‌లను ప్రారంభిస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు. సోమవారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో రాష్ట్ర వైద్యారోగ్యశాఖ పదేళ్ల ప్రగతి నివేదికను మంత్రి విడుదల చేశారు. అనంతరం సమావేశంలో మాట్లాడిన మంత్రి హరీశ్.. రాష్ట్రంలోని మారుమూల పేద ప్రజలకు కీలకమైన అత్యవసర వైద్య సేవలు అందించేందుకు నిమ్స్‌ కేంద్రంలో త్వరలో ఎయిర్‌ అంబులెన్స్‌ సేవలను అందుబాటులోకి తెస్తామని ప్రకటించారు. ములుగు వంటి మారుమూల ప్రాంతంలో అత్యవసరమైతే రోగిని హెలికాప్టర్‌లో హైదరాబాద్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఎయిర్ అంబులెన్స్‌లు అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణ సమయాన్ని తగ్గించడం ద్వారా రోగుల ప్రాణాలను కాపాడతాయి. సీఎం కేసీఆర్ పాలనలో వైద్య, ఆరోగ్యశాఖ సరికొత్త చరిత్ర సృష్టిస్తోందన్నారు. తెలంగాణలో ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరు చాలా మెరుగుపడింది. నీతి ఆయోగ్ ఆరోగ్య సూచీలో రాష్ట్రం 11 నుంచి మూడో స్థానానికి చేరుకోగా.. మొదటి స్థానానికి చేరుకోవడమే వైద్య, ఆరోగ్య శాఖ లక్ష్యం.

Read also: Train Accident: ఇదేందయ్యా ఇది… ప్లాట్‌ఫాంపైకి దూసుకొచ్చిన రైలు

వరంగల్ హెల్త్ సిటీ ద్వారా 50 వేల పడకలు, 10 వేల సూపర్ స్పెషాలిటీ పడకల లక్ష్యంతో పని చేస్తున్నామని, హైదరాబాద్‌లో నాలుగు వైపులా నాలుగు టిమ్స్‌ ఆసుపత్రుల్లో గ్రామ దవాఖానాలు, బస్తీ దవాఖానాలు, మండలానికో పిహెచ్‌సి, నియోజకవర్గానికి 100 పడకల ఆసుపత్రి, జిల్లా వైద్య కళాశాల, నర్సింగ్ కళాశాల, పారా మెడికల్ కళాశాల. అవయవ మార్పిడిలో తెలంగాణ దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందన్నారు. గాంధీలో అవయవ మార్పిడి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. నిమ్స్ లో పేదలకు ఆరు నెలల్లో 100 కిడ్నీ మార్పిడిని ఉచితంగా పూర్తి చేశామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 82 డయాలసిస్‌ కేంద్రాలు ఉన్నాయి. తొమ్మిదేళ్లలో వైద్య, ఆరోగ్య శాఖలో 22,600 పోస్టులను భర్తీ చేశారు. త్వరలో మరో 7291 పోస్టులను భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు. బ్రిటన్ కు చెందిన ప్రముఖ డాక్టర్ అరుణ్ నేతృత్వంలో నిమ్స్ లో వారం రోజుల పాటు చిన్న పిల్లలకు ఉచితంగా గుండె ఆపరేషన్లు చేస్తున్నామని మంత్రి హరీశ్ తెలిపారు. ఈ సందర్భంగా పోటీ పరీక్షల్లో ఎంపికైన 310 మంది ఫార్మాసిస్టులకు మంత్రి నియామక పత్రాలను అందజేశారు. ఫార్మాసిస్ట్‌లు ఓపికతో ప్రజలకు సేవ చేయాలని, ఎంత ఓపికగా ఉంటే అంత ఎక్కువగా ప్రజలకు సేవ చేయాలని సూచించారు.
Warangal: వరంగల్ లో నేడు, రేపు ట్రాఫిక్‌ ఆంక్షలు.. కారణం ఇదీ..