Adilabad Crime: ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వెనుక నుంచి వస్తున్న లారీ ముందు వెళుతున్న కారును ఢీ కొట్టింది. దీంతో.. ముందువెళుతున్న ట్రాక్కును కారు వేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా ఒకరికి తీవ్రంగా గాయాలయ్యాయి. హైదరాబాద్ వెళ్లొస్తుండగా హైవేపై ఘటన చోటుచేసుకుంది. సంషు అనే డ్రైవర్, సయ్యద్ రఫుతుల్లా , వజహతుల్లా, సబియా అనే నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనకు సంబంధించి స్థానిక సమాచారంతో.. పోలీసులు ఘటనస్థలికి చేరుకున్నారు.
Read also: Vishal-Abhinaya: విశాల్‌తో ప్రేమాయణం.. క్లారిటీ ఇచ్చిన అభినయ
ఈ ప్రమాదంలో జుబియా అనే వైద్యురాలు ఇర్కుపోయింది అయితే అధికారులు ఆమెను చికిత్సకోసం ఆసుపత్రికి తరలించారు. జుబియాకు డిసంబర్ లో వివాహం అనంతరం దాని సంబంధించిన పనుల నిమిత్తం హైదరాబాద్ వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని సమాచారం. TS07FU3897 అనే నెంబర్ కారు ఈ ప్రమాదానికి గురైంది. పెళ్లి పనుల నిమిత్తం హైదరాబాద్ వచ్చి, పెళ్లికి కావాల్సిన సమాన్లు కొనుగోలు చేసి, తిరుగు ప్రయాణంలో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. ఆనందంగా తిరిగి వెళుతున్న వారికి మృత్యువు కాటేసిందని తెలిపారు. దీనికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి వుంది.
Rajagopal Reddy: రాజగోపాల్ రెడ్డికి ఈసీ నోటీసులు.. సాయంత్రం వరకు గడువు