Online games: ఆన్ లైన్ గేమ్ లకు బానిస అయి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి శివ ఆత్మహత్య చేసుకున్న ఘటన సంచలనంగా మారింది. NFC లో టెక్నికల్ విభాగం లో పనిచేసే వరదా శివ ఆన్లైన్ గేమ్ లకు అలవాటు పడ్డారు. పూర్తీగా గేమ్స్ లకు బానిస అయ్యాడు. డబ్బులు పెడుతూ గేమ్స్ ఆడటం మొదలు పెట్టాడు. ఒక ప్రభుత్వ ఉద్యోగి అయిన తను తనకు వచ్చిన సాలరీ డబ్బును మొత్తం ఆన్‌లైన్ గేమ్ లపై పెట్టడం స్టార్ట్ చేశాడు. వేలు, లక్షల్లో పెట్టడం మొదలై చివరకు ఆ డబ్బు సుమారు 15 లక్షలకు వరకు గేమ్స్ ఆడగటానికి పెట్టాడు. దీంతో నష్టపోయానని భావించిన శివ. మానసికంగా కుంగిపోయాడు. అంత డబ్బు ఎలా గేమ్ లకు ఉపయోగించుకున్నా ఇంట్లో ఏమని సమాధానం చెప్పాలని అనుకున్నాడు. తీవ్ర మనస్తాపానికి లోనయ్యాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో శివ బలవన్మరణానికి పాల్పడ్డాడు.
Read also: Agent: గన్ను పట్టుకోని గన్నులా ఉన్నాడు…
శివ సూసైడ్ నోట్ లో నిర్ఘాంతపోయే విషయాలు బయటకు వచ్చాయి. శివ సూసైడ్ నోట్ లో రెండు సంవత్సరాల బాబు వేదాన్ష్ పేరు ప్రస్తావించడం పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వెదాన్ష్ నీకు న్యాయం చేయలేక పోతున్న అంటూ మృతుడు శివ రాసిన సూసైడ్ నోట్ లో వేదాన్ష్ పేరు ఎందు ప్రస్తావించాడు. అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దేవాన్ష్ గేమ్ ఆడటానికి ప్రోత్సహించాడా? ఆ చిన్నపిల్లాడి మాటలకు పట్టుదలగా తీసుకుని శివ గేమ్స్ ఆడటం మొదలు పెట్టాడా? శివ ఆల్ గేమ్స్ ద్వారా వచ్చే డబ్బులతో దేవాన్ష్ జీవితంలో స్థిరపరిచేందుకు ప్లాన్ వేసి 15లక్షలు పోగొట్టు కోవడంతో న్యాయం చేయలేక పోతున్నా అంటూ నోట్ రాసాడా? అను అనుమానాలతో కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇంత కాలంగా ఆన్లైన్ గేమ్స్ ఆడుతున్నాడు.. ఏ ఏ యాప్ ల ద్వారా నష్ట పోయాడో.. కుషాయిగూడ పోలీస్ లు విచారణ జరుపుతున్నారు. ఆన్లైన్ గేమ్ కు బానిస అయ్యే శివ ఆత్మహత్య చేసుకున్నాడని, ఆఫీస్ లో అందరితో సరదాగా వుండే వాడని NFC ఉద్యోగి కోటిబాబు అన్నారు. చెడు వ్యసనాలకు బానిస అయిన వారికి.. కంపెనీ లో మేము కౌన్సిలింగ్ కూడా ఇప్పిస్తుంటామని తెలిపారు. శివ ఆన్లైన్ గేమ్ కు బానిస అయ్యాడని.. సూసైడ్ చేసుకునే వరకూ.. మాకు తెలియదని అన్నారు. ఆత్మహత్య తరువాత మాకు ఈ విషయం తెలిసింది. NFC ఉద్యోగి కొటిబాబు తెలిపారు.