NTV Telugu Site icon

Car Accident: దుండిగల్ లో కారు బీభత్సం.. ఒకరు మృతి.. ముగ్గురికి తీవ్ర గాయాలు

Dundigal Car Accident

Dundigal Car Accident

Car Accident: మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా దుండిగల్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.దుండిగల్ పియస్ ఓఆర్ఆర్ సమీపంలో కారు భీభత్సం సృష్టించింది. అతి వేగంతో రోడ్డు పక్కనున్న జ్యోతిరావ్ పూలే విగ్రహాన్ని డీ కొట్టింది.. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఓ విద్యార్థి మరణించగా మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. నిస్సాన్ కారు (TS 11 EK 9744)లో ప్రయాణిస్తున్న వారు మహేంద్ర యూనివర్శిటీ విద్యార్థులుగా గుర్తించారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. మృతిచెందిన విద్యార్థి.. వరంగల్ కు చెందిన అన్నమనేని మేఘాంశ్ , 2వ సంవత్సరం బి,టెక్ చదువుతున్నట్లు గురించారు. మరో ముగ్గురు సాయి మానస్, శ్రీ చరణ్ రెడ్డి, అర్నవ్ విద్యార్థులకు తీవ్రంగా గాయాలు అయ్యాయి.

Read also: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే?

తీవ్ర గాయాలైన ముగ్గురిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. కారులో మద్యం బాటిల్స్ గుర్తించారు పోలీసులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వీరందరూ నిన్న ఆదివారం కావడంతో పార్టీ చేసుకుని వస్తున్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే వీరు నలుగురు పార్టీ ఎక్కడ చేసుకున్నారనేది పోలీసులకు ఆరా తీస్తున్నారు. అయితే వారిని అడిగితే గానీ ఈ ఘటపై ఇంకా క్లారిటీ రాదని స్పష్టం చేశారు. ఈ ఘటనపై వారి తల్లిదండ్రులకు సమాచారం ఇస్తామని పోలీసులు తెలిపారు. డ్రైవింగ్‌ చేసిన వ్యక్తి మద్యంలో ఉండటం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని దానికి నిదర్శనమే కారులో మద్యం బాటిళ్లు దొరకడమని అన్నారు. త్వరలోనే ఈ ప్రమాదానికి క్లారిటీ ఇస్తామని పోలీసులు అన్నారు.
MLC Kavitha: నేటితో ముగిసిన కవిత సీబీఐ కస్టడీ.. నేడు ప్రత్యేక కోర్టు ముందుకు