Site icon NTV Telugu

KCR: కేసీఆర్‌ త్వరలోనే కోలుకుంటారు.. పీఎం మోడీ, ఎమ్మెల్సీ కవిత ట్వీట్‌

Kcr Modi

Kcr Modi

KCR: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు మోడీ తెలిపారు. కాగా, ప్రధాని మోడీ ట్విట్టర్‌లో మాట్లాడుతూ.. ‘తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ గాయపడ్డారని తెలిసి చాలా బాధపడ్డానని అన్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని, మంచి ఆరోగ్యంతో ఉండాలని ప్రార్థిస్తున్నానని తెలిపారు.

మరోవైపు ఎమ్మెల్సీ కవిత కూడా స్పందించారు. ట్విటర్‌లో కవిత..’బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ స్వల్ప గాయాలతో ప్రస్తుతం ఆసుపత్రిలో స్పెషలిస్టుల సంరక్షణలో ఉన్నారు. నాన్న త్వరలో పూర్తిగా కోలుకుంటారని, అందరి ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు’ అని కవిత వ్యాఖ్యానించారు. కేసీఆర్‌పై ప్రజల ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు తెలిపారు.

Read also: Rajasthan: రాజస్థాన్‌ ముఖ్యమంత్రి పదవి ఎవరిని వరించనుంది..? రిసార్ట్‌లో బందీగా ఎమ్మెల్యే కుమారుడు

కాగా, నిన్న(గురువారం) అర్ధరాత్రి మాజీ సీఎం కేసీఆర్ తన ఫామ్‌హౌస్‌లోని బాత్‌రూమ్‌లో జారి పడిపోయారు. ఈసందర్భంగా వైద్యులు మాట్లాడుతూ ఎడమ కాలుకు రెండు చోట్ల తుంటి గాయమైందన్నారు. దీంతో సోమాజిగూడలోని యశోదకు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. తుంటికి ఇవాళ సర్జరీకి వైద్యులు ఏర్పాట్లు చేయనున్నారు.


CM Praja Darbar: ప్రజాభవన్ కు చేరుకున్న సీఎం రేవంత్.. క్యూ కట్టిన ప్రజలు

Exit mobile version