NTV Telugu Site icon

Alwal Crime: అల్వాల్‌లో సాప్ట్‌వేర్ ఉద్యోగిని హల్ చల్‌.. కొత్తకారుతో భీభత్సం

Alwal News

Alwal News

Alwal News: సికింద్రాబాద్‌లోని అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువతి తన కారుతో బీభత్సం సృష్టించింది. అతి వేగంగా డ్రైవింగ్ చేసి ఒకరి ప్రాణాలను బలిగొంది. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో రోడ్డు పక్కన ఉన్న చెరుకు రసం బండి, టిఫిన్ సెంటర్ బండి, బైక్ పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ ఘటన అల్వాల్‌లోని సుభాష్‌నగర్‌లోని మిలటరీ డెయిరీ ఫామ్‌లో చోటుచేసుకుంది.

ఏం జరిగింది?…

కానాజిగూడకు చెందిన శివాని అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తోంది. నిన్న రాత్రి కొత్త కియా కారుతో బయటకు వెళ్లిన శివాని తిరుమలగిరి నుంచి మిలటరీ డెయిరీ ఫారం వైపు వెళుతోంది. ఈ క్రమంలో ఆమె నడుపుతున్న కారుకు ఓ వ్యక్తి ఎదురుగా వచ్చాడు. ఆందోళన చెందిన శివాని బ్రేక్‌కి బదులు, ఎక్సిలేటర్‌పై కాలు పెట్టింది. దీంతో కారు అదుపు తప్పి రోడ్డు పక్కకు వేగంగా దూసుకెళ్లింది. అయితే అక్కడే వున్న ఓ వ్యక్తిని ఢీకొట్టిన శివాని, ఆ తర్వాత రోడ్డు పక్కన ఉన్న చెరుకు మిషన్ బండి, టిఫిన్ సెంటర్‌కు కరెంట్ స్తంభం తగిలింది. పిల్లర్‌ పక్కనే బైక్‌పై నిలబడి ఉన్న స్విగ్గీ డెలివరీ బాయ్‌ను ఢీకొట్టింది. అయితే స్విగ్గీ డెలవరీ బాయ్‌ తో సహా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే అతడిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ స్విగ్గీ బాయ్ చనిపోయాడు. మరో ఇద్దరికి చికిత్స జరుగుతుంది. అయితే చనిపోయిన స్విగ్గీ డెలివరీ బాయ్‌ గురించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అయితే శివానీ మాట్లాడుతూ.. తాను కారు నడుపుతుండగా ఎదురుగా ఓ వ్యక్తి వచ్చాడని, ఆ సమయంలో బీపీ తగ్గిందని కారు నడుపుతున్న శివాని వెల్లడించింది. ఆ తర్వాత తాను ప్రేమించడం లేదని, ఏం జరిగిందో తనకు తెలియదని చెప్పింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న అల్వాల్‌ పోలీసులు శివానిని అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు.

అయితే ఇది ఇలా ఉండగా కారు నడుపుతున్న సాఫ్ట్‌ వేర్‌ మహిళలను కేసునుండి తప్పించాలని, పోలీసులు చూస్తున్నారని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. మహిళకు పొలిటికల్ సపోర్ట్ ఉందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ముగ్గరిపై కారు నడిపి గాయాలు పాలు చేయడమే కాకుండా ఒకరి ప్రాణం తీసిన వ్యక్తిని ఎలా కాపాడుతారుని ప్రశ్నిస్తున్నారు. చనిపోయిన, గాయాలైన వ్యక్తులకు నష్టపరిహారం ఇవ్వాలని కోరారు. ఈఘటనకు కారుకులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. ఇలా వేగంగా కారును నడిపి స్థానికంగా కలకలం రేపిన వ్యక్తులపై సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షిస్తే మరొకరు ఇలాంటి తప్పులు చేయడానికి భయపడతారని తెలిపారు.
Cyber Crime: మహిళలే టార్గెట్‌.. రోజుకు రూ.5 కోట్ల పైనే దోచేశాడు..!

Show comments