NTV Telugu Site icon

Uppal Crime: 16 ఏళ్ల బాలికపై 60 ఏళ్ల వృద్ధుడి అత్యాచారం.. లిప్ట్ ఇస్తానని ఘాతుకం

Uppal Crime

Uppal Crime

Uppal Crime: నేటి సమాజంలో మహిళలు, బాలికలకు రక్షణ లేకుండా పోతోంది. ఎక్కడ చూసినా ఆడ పిల్లలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయి. చిన్నా పెద్ద అనే తేడా లేకుండా మహిళలపై కొందరు కామాంధులు రెచ్చిపోతున్నారు. మనవరాళి వయస్సున్న బాలికపై ఓ వృద్ధుడు అత్యాచారం చేసిన ఘనం నగరంలో సంచలనంగా మారింది. లిప్ట్ పేరుతో ఆ బాలికను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లి తన పై అత్యాచారం చేశాడు. ఏమీ తెలియని ఆ బాలిక వద్దని ఏడుస్తున్న కామాంతో కన్నుమూసుకుపోయిన ఆ వృద్దుడు తనపై కామవాంఛ తీర్చకున్నాడు ఆలస్యంగా వెలుగు చూసిన ఈ గటన హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో చోటుచేసుకుంది.

Read also: Budget 2024 : తుది దశకు చేరుకున్న బడ్జెట్ సన్నాహాలు..

ఉప్పల్‌కు చెందిన బాలిక(16) స్థానిక పాఠశాలలో 7వ తరగతి చదువుతోంది. పాతబస్తీకి చెందిన షేక్ సడక్ (60) ఉప్పల్ బస్టాండు ప్రాంతంలో కట్టెల మిషన్‌లో పనిచేస్తున్నాడు. బాలిక ఈ నెల 3న ఉప్పల్ బస్టాప్‌లో బస్సు ఎక్కేందుకు వేచి ఉంది. అయితే ఏదో తనకు తెలిసిన వ్యక్తిలాగానే సాదక్‌ అని ఆ బాలికను పిలిచాడు.
ఆబాలిక అమ్మనాన్నలు తనకు తెలుసంటూ నమ్మించాడు. ఎంత సేపు నిలబడతావు ఇంటికి వెళ్దామంటూ బస్టాప్‌ నుంచి బయటకు తీసుకెళ్లాడు. ఇక అక్కడి నుంచి కొద్ది దూరంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి బాలికపై అత్యాచారం చేసి.. అనంతరం బాలికను అక్కడే వదిలి పారిపోయాడు. బాలిక ఇంటికి ఆలస్యంగా రావడంతో కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది. బాలికను గట్టిగా తల్లిదండ్రులు నిలదీయడంతో జరిగిన విషయం తల్లికి చెప్పింది. దీంతో షాక్ తిన్న తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరాల ఆధారంగా అత్యాచారానికి పాల్పడిన వృద్ధుడిని గుర్తించి అరెస్ట్ చేశారు. పాఠశాలలకు వెళ్లే బాలికలు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు చెబుతున్నారు. తెలియని వ్యక్తులను లిప్ట్ ఇస్తానంటే వారిని నమ్మి వెంట వెళ్లకూడదని సూచించారు. అనుమానం ఉంటే వెంటనే తల్లిదండ్రులకు తెలియజేయాలని లేదా 100కు ఫోన్ చేయాలని పోలీసులు సూచిస్తున్నారు.
Praja Palana: ఇల్లు, గ్యాస్ వచ్చింది.. OTP చెప్పండంటూ ఫోన్.. చెప్పారో ఖాతా ఖాళీ..!