NTV Telugu Site icon

Munugode By Elections: పోటీ నుంచి తప్పుకున్న 10 మంది అభ్యర్థులు

Munugode By Elections

Munugode By Elections

10 Independent Members Withdrawn From Munugode By Elections: మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నికల పోటీ నుంచి 10 మంది ఇండిపెండెంట్ అభ్యర్థులు తప్పుకున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఈ అభ్యర్థులతో తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చర్చలు జరిపారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్న ఆయన.. వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అలాగే.. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లతో మాట్లాడి పార్టీ పరంగా తగిన గుర్తింపు, గౌరవం దక్కేలా చూస్తామని మాటిచ్చారు. దీంతో.. ఆ 10 మంది అభ్యర్థులు ఎన్నికల బరి నుంచి తప్పుకున్నారు. అలాగే.. ఈ ఎన్నికల్లో పోటీ చేస్తోన్న టీఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి విజయం కోసం తమవంతు కృషి చేస్తామని ప్రకటించారు.

పోటీ నుంచి తప్పుకున్న 10 అభ్యర్థుల వివరాలు:
1. కేయూ జేఏసీ అధ్యక్షుడు ఆంగోత్ వినోద్ కుమార్
2. వార్డ్ మెంబర్ భూక్య సారయ్య
3. నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాలోత్ వెంకన్న
4. ఎల్‌హెచ్‌పీఎస్ రాష్ట్ర కార్యదర్శి తేజావత్ రవీందర్
5. గిరిజన రిజర్వేషన్ సాధన సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు మాలోత్ నరేందర్
6. నిరుద్యోగ జేఏసీ కేయూ ఇన్‌ఛార్జి భూక్య బాలాజీ
7. ప్రజాసేన పార్టీ అధ్యక్షుడు బానోతు ప్రేమ్ లాల్
8. కాకతీయ యూనివర్సిటీ తెలంగాణ ఉద్యమకారుడు జన్ను భరత్
9. కాకతీయ యూనివర్సిటీ తెలంగాణ ఉద్యమకారుడు జన్ను తిరుపతి
10. విద్యార్థి నాయకుడు చందర్