Site icon NTV Telugu

Xiaomi 18 Concept Design: నాలుగు 50MP కెమెరాస్, 6600mAh బ్యాటరీ.. హై-ఎండ్ ఫీచర్లతో వస్తున్న షావోమీ 18!

Xiaomi 18 Concept Design

Xiaomi 18 Concept Design

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ‘షావోమీ’ తాజాగా షావోమీ 18 (Xiaomi 18) కాన్సెప్ట్ డిజైన్‌ను ప్రదర్శించింది. ఈ ఫోన్ హై-ఎండ్ ఫీచర్లతో యూజర్స్‌కి ప్రీమియం అనుభవాన్ని అందించడానికి రూపొందించబడింది. డిజైన్, కెమెరా, ప్రాసెసింగ్ సామర్థ్యం, బ్యాటరీ సపోర్ట్ లలో షావోమీ 18 కొత్త మైలురాయి సాధించనుంది. ఈఫోన్ ఫుల్ డీటెయిల్స్ ఏంటో తెలుసుకుందాం.

షావోమీ 18లో 6.3 అంగుళాల 2K LTPO OLED డిస్‌ప్లే ఉంది. ఇది 144Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ డిస్‌ప్లే ఎలివేటెడ్ కలర్ అక్యూరసీ, స్పష్టమైన బ్రైట్‌నెస్ అండ్ స్మూత్ స్క్రోలింగ్‌ను హ్యాండ్‌లింగ్ చేస్తుంది. IP69K రేటింగ్‌తో నీరు, దుమ్ము మరియు ఇతర రిస్క్‌ల నుంచి ఫోన్ పూర్తి రక్షణ పొందుతుంది. ఫోన్‌లో Snapdragon 8 Elite Gen 6 చిప్‌సెట్ ఉంటుంది. ఇది గ్రాఫిక్స్-ఇంటెన్సివ్ గేమ్స్, మల్టీటాస్కింగ్ పనులలో హై-ఎఫీషియన్సీ ఇస్తుంది. RAM 12GB LPDDR5X, UFS 4.2 ULTRA స్టోరేజ్ కలిగి ఉంది. దాంతో యాప్‌లు వేగంగా ఓపెన్ కావడం, డేటా ట్రాన్స్‌ఫర్-గేమ్ లోడింగ్ టైమ్‌లు తగ్గుతాయి.

షావోమీ 18లో కెమెరా సెక్షన్ కూడా ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. వెనుక భాగంలో 50MP మెయిన్, 50MP అల్ట్రా వైడ్, 50MP 3.7x టెలిఫోటో, 12MP సూపర్ డెప్త్ సెన్సార్ ఉంటుంది. ముందు భాగంలో 50MP సెల్ఫీ కెమెరా ఉంది. 8K@60fps వీడియో రికార్డింగ్ సపోర్ట్‌తో ఫోటోగ్రఫీ, వీడియో కంటెంట్ క్రియేషన్‌కు ఇది అద్భుతమైన ఫీచర్. ఈ ఫోన్ 6600mAh భారీ బ్యాటరీతో వస్తుంది. 25W వైర్‌లెస్ QI అండ్ 67W వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్‌తో ఫోన్ తక్కువ సమయంలో ఫుల్ ఛార్జ్ అవుతుంది.

Also Read: T20 World Cup 2026: ఈసారి టీ20 వరల్డ్ కప్ మాదే.. పాకిస్థాన్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!

షావోమీ18 HyperOS 4.0తో లాంచ్ అవుతుంది. ఇది యూజర్ ఇంటర్ఫేస్ అండ్ స్మూత్ ఆపరేషన్‌ను హ్యాండ్‌లింగ్ చేస్తుంది. 12GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.69,999గా కంపెనీ ప్రకటించింది. మొత్తానికి షావోమీ 18 కాన్సెప్ట్ డిజైన్ ప్రీమియం హార్డ్‌వేర్, అధిక కెమెరా సామర్థ్యం, భారీ బ్యాటరీ సహా హై-ఎండ్ సాఫ్ట్‌వేర్ ఫీచర్లతో హై వోల్టేజ్ ఎంట్రీ ఇస్తోంది. ఈ ఫోన్ షావోమీ ఫ్యాన్స్ కోసం ఆకర్షణీయమైన ఎంపికగా నిలవనుంది.

 

Exit mobile version