NTV Telugu Site icon

Whatsapp Ban Indian Accounts: వాట్సప్ యూజర్స్‌కి షాక్.. 85 లక్షల ఖాతాలు బ్లాక్

Whatsapp Status

Whatsapp Status

సెప్టెంబర్‌లో పాలసీని ఉల్లంఘించిన 85 లక్షలకు పైగా భారతీయ వాట్సాప్ ఖాతాలను వాట్సాప్ నిషేధించింది. కంపెనీ తన నెలవారీ నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది. వినియోగదారుల భద్రతను పెంచడానికి, ప్లాట్‌ఫారమ్‌ను దుర్వినియోగం చేయకుండా నిరోధించడానికి కంపెనీ ఈ చర్య తీసుకుంది. అంతకుముందు ఆగస్టులో భారతదేశంలో 84 లక్షల ఖాతాలు నిషేధించబడ్డాయి.

READ MORE: Uttarakhand: 36కు చేరిన అల్మోరా ప్రమాద ఘటన మృతుల సంఖ్య.. పీఎం, సీఎం సంతాపం

వాట్సాప్ నివేదిక ప్రకారం.. సెప్టెంబర్ 1- 30 వ తేదీ మధ్య వాట్సప్ 85,84,000 ఖాతాలను నిషేధించింది. వాటిలో 16,58,000 ఖాతాలు వినియోగదారుల నుంచి ఎటువంటి నివేదికలు అందుకోకముందే మూతపడ్డాయి. 600 మిలియన్లకు పైగా వినియోగదారులను కలిగి ఉన్న వాట్సాప్‌కు సెప్టెంబర్ నెలలో 8,161 ఫిర్యాదులు అందాయి. వాటిలో 97 ఫిర్యాదులపై చర్యలు తీసుకున్నారు.

READ MORE:CM Chandrababu: రాష్ట్రంలో నూతన క్రీడా విధానంపై సీఎం చంద్రబాబు సమీక్ష

ఖాతాల నిషేధానికి సంబంధించి కంపెనీ స్పందిస్తూ.. తాము బ్లా్క్ చేసి నివేదించే సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు తెలిపింది. ఖాతాలపై ఫిర్యాదు చేసే రైట్‌ను మరో సారి గుర్తుచేసింది. తమ పనిలో పారదర్శకతను నిర్వహిస్తామని చెప్పింది. భవిష్యత్ లో కూడా బ్లాక్ చేసిన అకౌంట్ల నివేదికలను వెల్లడిస్తామని స్పష్టం చేసింది. వినియోగదారుల ఫీడ్‌బ్యాక్‌పై చాలా శ్రద్ధ వహిస్తామని.. తప్పుడు సమాచారాన్ని నిరోధించడంలో, సైబర్ భద్రతను ప్రోత్సహించడంలో, ఎన్నికల సమగ్రతను కాపాడుకోవడంలో నిపుణులతో కలిసి పనిచేస్తున్నట్లు తెలిపింది.

Show comments