Vivo Y32 5G Launched: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ Vivo మరో కొత్త 5G స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. Vivo Y32 5G పేరుతో ఈ కొత్త ఫోన్‌ను పరిచయం చేసింది. భారీ బ్యాటరీ, శక్తివంతమైన ప్రాసెసర్‌తో పాటు బలమైన బిల్డ్ క్వాలిటీ ఈ ఫోన్ ప్రత్యేకతలుగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా ఇందులో ఏకంగా 8,000mAh బ్యాటరీ, Qualcomm Snapdragon 4 Gen 2 ప్రాసెసర్ అందించారు. అంతేకాకుండా IP68, IP69 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ రేటింగ్‌లు కూడా ఉన్నాయి. ఇటీవల విడుదలైన Vivo Y32 4G మోడల్‌తో పోలిస్తే ఈ కొత్త 5G వెర్షన్లో ప్రాసెసర్ సహా కొన్ని కీలకమైన మార్పులు ఉన్నాయి. 4G మోడల్లో Unisoc చిప్సెట్ ఉండగా, కొత్త Vivo Y32 5Gలో Qualcomm Snapdragon చిప్‌సెట్‌ను అందించారు. మరి ఈ ఫోన్ పూర్తి ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఏమిటో తెలుసుకుందాం.
Vivo Y32 5G డిస్ప్లే, ప్రాసెసర్
Vivo Y32 5G స్మార్ట్‌ఫోన్‌లో 6.87 ఇంచుల LCD డిస్ప్లేను అందించారు. ఇది 120Hz వరకు రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తుంది. అలాగే అవుట్‌డోర్‌లో మెరుగైన విజిబిలిటీ కోసం 1,300 నిట్స్ వరకు బ్రైట్నెస్ అందిస్తుంది. TÜV Rheinland Low Blue Light సర్టిఫికేషన్ కూడా ఈ డిస్ప్లేకు ఉంది. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, ఈ ఫోన్లో 4nm టెక్నాలజీతో రూపొందించిన Qualcomm Snapdragon 4 Gen 2 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. దీనికి జతగా 6GB LPDDR4X RAM, 128GB UFS 2.2 ఇంటర్నల్ స్టోరేజ్ ఇచ్చారు. మైక్రో SD కార్డు ద్వారా స్టోరేజ్‌ను ఏకంగా 2TB వరకు పెంచుకోవచ్చు. అదనంగా 6GB వరకు వర్చువల్ RAM సపోర్ట్ కూడా ఉంది.
Vivo Y32 5G కెమెరా ఫీచర్లు
ఫోటోగ్రఫీ కోసం Vivo Y32 5G వెనుకవైపు డ్యూయల్ కెమెరా సెటప్‌ను అందించింది. ఇందులో 50MP మెయిన్ కెమెరాతో పాటు 2MP ఆక్సిలరీ సెన్సార్ ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 8MP ఫ్రంట్ కెమెరాను అమర్చారు. రోజువారీ ఫోటోగ్రఫీ, వీడియో కాలింగ్ అవసరాలకు ఈ కెమెరా ఉపయోగపడుతుంది.
8000mAh భారీ బ్యాటరీ.. 44W ఫాస్ట్ ఛార్జింగ్
ఈ స్మార్ట్‌ఫోన్‌లో ప్రధాన ఆకర్షణ 8,000mAh భారీ బ్యాటరీ. ఎక్కువసేపు ఫోన్ ఉపయోగించే వారికి ఈ బ్యాటరీ సామర్థ్యం ఉపయోగకరంగా ఉండే అవకాశం ఉంది. ఛార్జింగ్ విషయానికి వస్తే 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇచ్చారు. అంతేకాకుండా ఇతర పరికరాలకు ఛార్జింగ్ అందించేందుకు 7.5W రివర్స్ ఛార్జింగ్ సదుపాయం కూడా ఉంది. Vivo Y32 5Gలో బిల్డ్ క్వాలిటీకి కూడా కంపెనీ ప్రాధాన్యత ఇచ్చింది. ఈ ఫోన్‌కు IP68, IP69 రేటింగ్స్ అందించారు. అంతేకాకుండా MIL-STD-810H సర్టిఫికేషన్, SGS 5-Star Drop Resistance సర్టిఫికేషన్ కూడా ఉన్నాయి. ఇతర ఫీచర్ల విషయానికి వస్తే Android 16 ఆధారిత OriginOS 6 ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఈ ఫోన్ పనిచేస్తుంది. స్టీరియో స్పీకర్లు, సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, NFC, Wi-Fi 5, Bluetooth 5.1 వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.
ప్రస్తుతానికి Vivo Y32 5G స్మార్ట్‌ఫోన్‌ను 6GB RAM, 128GB స్టోరేజ్ వేరియంట్లో మాత్రమే లిస్ట్ చేశారు. Dawn Gold, Midnight Black అనే రెండు కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ అందుబాటులోకి రానుంది. అయితే కంపెనీ ఇప్పటివరకు ఈ ఫోన్ ధరను, సేల్ ప్రారంభ తేదీని అధికారికంగా వెల్లడించలేదు. ధర, అమ్మకాల వివరాలు ప్రకటించిన తర్వాతే ఈ ఫోన్ మార్కెట్లో ఏ ధర విభాగంలో పోటీ పడనుందో స్పష్టత వస్తుంది.

