200MP Zeiss టెలిఫొటో కెమెరా, 2K 144Hz డిస్‌ప్లే, 8,000mAh బ్యాటరీతో VIVO X500 Pro Max లాంచ్..!

  • ప్రీమియం ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ vivo X500 Pro Max అధికారికంగా లాంచ్
  • 6.85 అంగుళాల 2K AMOLED డిస్‌ప్లే, 1Hz నుంచి 144Hz వరకు అడాప్టివ్ రిఫ్రెష్ రేట్,
  • MediaTek Dimensity 9600 Pro ప్రాసెసర్, Mali-G2-Ultra-NX GPU
  • ప్రధాన ఆకర్షణగా 200MP Zeiss APO సూపర్ టెలిఫొటో కెమెరా, OIS, 3.5x ఆప్టికల్ జూమ్‌, 4x ఇన్-సెన్సార్ జూమ్ సపోర్ట్
  • వెనుక భాగంలో 50MP ప్రధాన కెమెరా, 50MP అల్ట్రా-వైడ్ కెమెరా ఉండగా.. సెల్ఫీల కోసం 50MP ఫ్రంట్ కెమెరా
  • 8,000mAh బ్యాటరీ, 90W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌, 40W వైర్‌లెస్ ఛార్జింగ్కు సపోర్ట్
  • IP68 + IP69 రేటింగ్‌లు..
Vivo X500 Pro Max

Vivo X500 Pro Max

VIVO X500 Pro Max: వివో నుండి ప్రీమియం ఫ్లాగ్‌షిప్ లైనప్‌లో వివో X500 ప్రో మాక్స్ (vivo X500 Pro Max)ను అధికారికంగా లాంచ్ చేసింది. ఈ మొబైల్ X500 Proతో పోలిస్తే మరింత పెద్ద డిస్‌ప్లే, భారీ 8,000mAh బ్యాటరీ, 200MP Zeiss APO సూపర్ టెలిఫొటో కెమెరా వంటి ప్రత్యేక ఫీచర్లతో లాంచ్ అయ్యింది.

2K 144Hz Zeiss డిస్‌ప్లే

ఈ కొత్త ఫ్లాగ్‌షిప్ మొబైల్ లో 6.85 అంగుళాల 2K AMOLED డిస్‌ప్లేను అందించారు. ఇది 3168×1440 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో వస్తుంది. 8T LTPO టెక్నాలజీతో రూపొందించిన ఈ డిస్‌ప్లే 1Hz నుంచి 144Hz వరకు అడాప్టివ్ రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది. Q11 లూమినెంట్ మెటీరియల్‌తో రూపొందించిన స్క్రీన్ 4,500 నిట్స్ వరకు పీక్ బ్రైట్‌నెస్‌, HDR10+, Dolby Visionకు సపోర్ట్ చేస్తుంది. హార్డ్‌వేర్ స్థాయిలో 1 నిట్ వరకు బ్రైట్‌నెస్‌ను తగ్గించుకోవచ్చు. ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన హై-సెన్సిటివిటీ ఆటోమేటిక్ బ్రైట్‌నెస్ అడ్జస్ట్‌మెంట్ అల్గారిథమ్‌ను కూడా ఇందులో అందించింది.

చిప్‌సెట్‌

పనితీరు కోసం ఈ కొత్త మొబైల్లో 2nm MediaTek Dimensity 9600 Pro ప్రాసెసర్‌ను ఉపయోగించారు. Mali-G2-Ultra-NX GPUతో ఇది పనిచేస్తుంది. 12GB, 16GB LPDDR5X Ultra RAMతో పాటు 256GB, 512GB, 1TB UFS 4.1 స్టోరేజ్ వేరియంట్లు ఉన్నాయి. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 17 ఆధారిత OriginOS 7పై పనిచేస్తుంది. వివో ఇమేజింగ్‌, ట్రాకింగ్ ఇంజిన్లతో కలిసి ప్రాసెసర్ అడ్వాన్స్‌డ్ కంప్యూటేషనల్ ఫొటోగ్రఫీ, మల్టీ-ఫ్రేమ్ ప్రాసెసింగ్‌ వంటి పనులను నిర్వహిస్తుంది.

200MP Zeiss APO టెలిఫొటో కెమెరా

వివో X500 ప్రో మాక్స్లో ప్రధాన ఆకర్షణ కెమెరా విభాగమే. ఇందులో 200MP Zeiss APO సూపర్ టెలిఫొటో కెమెరాను అందించారు. 1/1.4 అంగుళాల Blueprint × Samsung HP0 సెన్సార్‌తో ఈ కెమెరా పనిచేస్తుంది. OISతో పాటు 3.5x ఆప్టికల్ జూమ్‌కు సపోర్ట్ ఉంది. హార్డ్‌వేర్ స్థాయిలో 4x ఇన్-సెన్సార్ జూమ్‌ (ISZ)ను అందించారు. అలాగే 400mm సమానమైన Zeiss G2 అల్ట్రా టెలికన్వర్టర్‌కు సపోర్ట్ చేస్తుంది. వేగంగా కదిలే సబ్జెక్టులను క్యాప్చర్ చేయడానికి 60fps ఫ్రేమ్‌రేట్ పైప్‌లైన్‌, Blueprint హై-రిఫ్రెష్ ట్రాకింగ్ ఇంజిన్‌, NICE అల్గారిథమ్ ఇంజిన్‌ను ఉపయోగించారు. టెలిఫొటో ట్రాకింగ్ టెక్నాలజీని OTA అప్‌డేట్ ద్వారా అందించనున్నట్లు కంపెనీ తెలిపింది. దీంతో పాటు 50MP ప్రధాన కెమెరా, 50MP అల్ట్రా-వైడ్ కెమెరా, 50MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. ప్రధాన కెమెరాలో Blueprint 900 సెన్సార్‌, OIS, Zeiss T* కోటింగ్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి.

8,000mAh భారీ బ్యాటరీ

ఈ కొత్త స్మార్ట్ ఫోన్ లో ఏకంగా 8,000mAh బ్యాటరీని అందించారు. ఇది 90W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌, 40W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్ ఫీచర్ కూడా ఉంది. డస్ట్‌, వాటర్ రెసిస్టెన్స్ కోసం vivo X500 Pro Maxకు IP68, IP69 రేటింగ్‌లు ఉన్నాయి. ఇన్-డిస్‌ప్లే అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్‌, స్టీరియో స్పీకర్లు, Hi-Fi ఆడియో, NFC వంటి ఫీచర్లు ఉన్నాయి.

ధర

ఇది సన్నీ డే, సన్ సెట్ గ్లో, నైట్ ఫోటోగ్రఫీ, ఎర్త్ ఎకో వంటి 4 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. Creator’s Packageలో శాటిలైట్ కమ్యూనికేషన్ సదుపాయం కూడా ఉంటుంది. vivo X500 Pro Max అమ్మకాలు సెప్టెంబర్ 24 నుంచి ప్రారంభం కానున్నాయి. చైనాలో vivo X500 Pro Max ధరలు ఇలా ఉన్నాయి.

* 12GB + 256GB: 6,999 యువాన్‌ (సుమారు రూ.1,00,125).
* 12GB + 512GB: 7,999 యువాన్‌ (సుమారు రూ.1,14,430).
* 16GB + 512GB: 8,499 యువాన్‌ (సుమారు రూ.1,21,580).
* 12GB + 1TB: 8,999 యువాన్‌ (సుమారు రూ.1,28,735).
* 16GB + 1TB Creator’s Package: 12,999 యువాన్‌ (సుమారు రూ.1,85,975).