ప్రీమియం డిజైన్‌తో పాటు శక్తివంతమైన పనితీరును కోరుకునే వినియోగదారుల కోసం vivo V40e 5G ఒక ఆకర్షణీయమైన ఎంపికగా నిలుస్తోంది. స్లిమ్ 3D కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, MediaTek Dimensity 7300 ప్రాసెసర్, 50MP Sony OIS కెమెరా, 80W ఫాస్ట్ ఛార్జింగ్ వంటి ఫీచర్లతో ఈ ఫోన్ మిడ్-ప్రీమియం సెగ్మెంట్‌లో మంచి పోటీ ఇస్తోంది.
ప్రీమియం డిజైన్, కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే
vivo V40e 5Gలో 6.77 అంగుళాల FHD+ AMOLED 3D Curved Display అందించారు. 120Hz రిఫ్రెష్ రేట్‌తో స్క్రోలింగ్, గేమింగ్, వీడియో స్ట్రీమింగ్ మరింత స్మూత్‌గా ఉంటుంది. అల్ట్రా-స్లిమ్ డిజైన్, Royal Bronze, Mint Green కలర్ ఆప్షన్లు ఫోన్‌కు ప్రీమియం లుక్‌ను ఇస్తాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లో MediaTek Dimensity 7300 ఆక్టా-కోర్ ప్రాసెసర్, 8GB RAM, 128GB/256GB స్టోరేజ్ ఉన్నాయి. రోజువారీ మల్టీటాస్కింగ్, సోషల్ మీడియా, గేమింగ్, వీడియో ఎడిటింగ్ వంటి పనులను సులభంగా నిర్వహించగలదు.
కెమెరా ఫీచర్లు
ఫోటోగ్రఫీ కోసం ఫోన్‌లో 50MP Sony IMX882 OIS మెయిన్ కెమెరాతో పాటు 8MP అల్ట్రా-వైడ్ కెమెరా అందించారు. సెల్ఫీల కోసం 50MP Eye AF ఫ్రంట్ కెమెరా ఉంది. AI Portrait Suite, AI Eraser, AI Photo Enhancer, Aura Light Portrait, 4K వీడియో రికార్డింగ్ వంటి ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.
భారీ బ్యాటరీ, సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్
vivo V40e 5Gలో 5,500mAh బ్యాటరీను అందించారు. దీనికి 80W FlashCharge సపోర్ట్ ఉండటంతో తక్కువ సమయంలోనే ఫోన్ వేగంగా ఛార్జ్ అవుతుంది. దీర్ఘకాలిక బ్యాటరీ బ్యాకప్ కోరుకునే వారికి ఇది మంచి ఎంపిక.
ధర, లభ్యత
vivo V40e 5G భారత మార్కెట్లో 8GB + 128GB, 8GB + 256GB వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఫ్లిప్ కార్ట్ లో 8GB + 128GB వేరియంట్ రూ. 24,999కి అందుబాటులో ఉంది. బ్యాంక్ ఆఫర్స్ తో మరింత తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు.

