Vivo T4 Ultra Price: రిపబ్లిక్ డే సందర్భంగా ప్రముఖ ఈ-కామర్స్ సంస్థలు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ భారీ ఆఫర్లతో ప్రత్యేక సేల్స్‌ను స్టార్ట్ చేయబోతున్నాయి. ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సేల్ జనవరి 17వ తేదీ నంచి ప్రారంభం కానుండగా, అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ జనవరి 16 నుంచి స్టార్ట్ చేయనుంది. ఇప్పటికే బ్యాంక్ కార్డులపై డీల్స్‌కు సంబంధించిన వివరాలను ఈ సంస్థలు వెల్లడించాయి. కాగా, ఈ సేల్స్‌లో భాగంగా ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్స్‌పై భారీ డిస్కౌంట్స్ ప్రకటించాయి. ఇందులో భాగంగా వివో T4 అల్ట్రా స్మార్ట్‌ఫోన్‌ను సగం ధరకే లభించే ఛాన్స్ ఉంది.
Read Also: Constable: గుర్తు తెలియని వాహనం ఢీకొని కానిస్టేబుల్ మృతి..
రూ.18,999కే వివో T4 అల్ట్రా?
అయితే, ప్రస్తుతం రూ.35,999 ప్రారంభ ధరలో ఉన్న వివో T4 అల్ట్రా స్మార్ట్‌ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్ గ్రేట్ ఇండియన్ సేల్ 2026లో కేవలం రూ.18,999కే కొనుగోలు చేయవచ్చు. కానీ, ఈ ధర నేరుగా బ్యాంక్ ఆఫర్ ద్వారా మాత్రమే లభిస్తుందా లేదా ఎక్స్చేంజ్ ఆఫర్‌తో ఉంటుందా అనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు.
ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్ ధరలు..
* 8GB RAM + 256GB స్టోరేజ్- రూ.35,999
* 12GB RAM + 256GB స్టోరేజ్- రూ.37,999
* 12GB RAM + 512GB స్టోరేజ్- రూ.39,999
Read Also: Toxic : టాక్సిక్’ టీజర్‌పై మహిళా కమిషన్ ఫైర్.. యశ్ సినిమాకు పెద్ద షాక్!
ఈ స్మార్ట్‌ఫోన్ వేరియంట్లు..
* ఫీనిక్స్ గోల్డ్
* మీటియర్ గ్రే కలర్
క్వాడ్ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే
* వివో T4 అల్ట్రా 6.67 అంగుళాల
1.5K క్వాడ్ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే
* 120Hz రిఫ్రెష్ రేట్,
* 5000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్,
* 300Hz టచ్ శాంప్లింగ్ రేట్
* HDR10+ సపోర్ట్
శక్తివంతమైన మీడియాటెక్ ప్రాసెసర్
* 4nm ఆధారిత ఆక్టా కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ
* 9300+ SoC ప్రాసెసర్
* 12GB వరకు LPDDR5X ర్యామ్,
* 512GB వరకు UFS 3.1 స్టోరేజ్
* ఆండ్రాయిడ్ 15 ఆధారిత Funtouch OS 15పై పని చేయనుంది..
* ఈ ఫోన్‌కు 2 ఆండ్రాయిడ్ అప్‌డేట్స్, 3 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్స్ లభిస్తాయని వివో సంస్థ తెలిపింది.
కెమెరా సెటప్
* ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది..
* 50MP సోనీ IMX921 ప్రైమరీ కెమెరా (OIS సపోర్ట్)
* 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్
* 50MP సోనీ IMX882 పెరిస్కోప్ లెన్స్ (3x ఆప్టికల్ జూమ్, 10x టెలిఫోటో మ్యాక్రో జూమ్, 100x డిజిటల్ జూమ్, OIS & EIS సపోర్ట్)
* సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32MP ఫ్రంట్ కెమెరా
* AI Note Assist, AI Erase, AI కాల్ ట్రాన్స్‌లేషన్, AI ట్రాన్స్‌క్రిప్ట్ అసిస్ట్ వంటి ఆధునిక AI ఫీచర్లు
ఛార్జింగ్ అండ్ బ్యాటరీ
* వివో T4 అల్ట్రా 5500mAh బ్యాటరీ
* 90W ఫాస్ట్ ఛార్జింగ్‌కి సపోర్ట్
* కనెక్టివిటీ పరంగా 5G, 4G, వైఫై, బ్లూటూత్, USB టైప్-C పోర్ట్
* IP64 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్
* భద్రత కోసం ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సర్
అయితే, రిపబ్లిక్ డే సేల్‌లో వివో T4 అల్ట్రా స్మార్ట్‌ఫోన్‌పై వస్తున్న ఈ భారీ డిస్కౌంట్ మిడ్-రేంజ్ ప్రీమియం ఫోన్ కొనాలనుకునే వారికి మంచి ఛాన్స్ ఉంది. అధికారిక ఆఫర్ వివరాలు వెల్లడి అయ్యాక ధరలు, బ్యాంక్ డీల్స్‌పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
