Site icon NTV Telugu

TikTok India: టిక్‌టాక్ భారత్‌కి తిరిగి వస్తుందా? క్లారిటీ ఇదే..

Tiktok

Tiktok

ఐదు సంవత్సరాల క్రితం భారతదేశంలో నిషేధించబడిన చైనా షార్ట్-వీడియో యాప్ టిక్‌టాక్ మరోసారి వార్తల్లో నిలిచింది. కొంతమంది వినియోగదారులు టిక్‌టాక్ వెబ్‌సైట్‌ను యాక్సెస్ చేయగలిగామని చెబుతున్నారు. దీంతో యాప్ తిరిగి భారత్‌లోకి అడుగుపెడుతుందని ఊహాగానాలు సోషల్ మీడియాలో తీవ్రమయ్యాయి. అయితే, టిక్‌టాక్ యాప్ ఇప్పటికీ గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ యాప్ స్టోర్‌లలో అందుబాటులో లేదు. టిక్‌టాక్ మాతృ సంస్థ బైట్‌డాన్స్ భారత్‌కి తిరిగి రావడం గురించి ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.

READ MORE: Kunamneni Sambhasiva Rao : సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా మరోసారి కూనంనేని

మరి టిక్‌టాక్ వెబ్‌సైట్ కథ ఏమిటి?
కొంతమంది వినియోగదారులు తాము టిక్‌టాక్ వెబ్‌సైట్‌ను ఓపెన్ చేశామని చెబుతున్నారు. దీంతో ఓ జాతీయ మీడియా సంస్థ ఈ టిక్‌టాక్ వెబ్‌సైట్‌ను ఓపెన్ చేసింది. హోమ్‌పేజీ ఓపెన్ అయినట్లు గమనించారు. కానీ.. హోం పేజీ తరువాత మిగతా భాగం ఓపెన్ కావడం లేదు. ఇది భారత్‌లో ఇంకా తన సేవలను ప్రారంభించలేదని స్పష్టం చేస్తుంది.

READ MORE: Off The Record : కాళేశ్వరంపై బీఆర్ఎస్ డబుల్ గేమ్? రాజకీయంగా ఒక మాట.. కోర్టులో ఒక మాట?

కాగా.. జూన్ 2020లో భారత ప్రభుత్వం టిక్‌టాక్‌తో సహా 59 చైనీస్ యాప్‌లను నిషేధించింది. వీటిలో షేర్‌ఇట్, మి వీడియో కాల్, క్లబ్ ఫ్యాక్టరీ, కామ్ స్కానర్ వంటి యాప్‌లు కూడా ఉన్నాయి. ఈ యాప్‌లు జాతీయ భద్రత, సార్వభౌమత్వానికి ముప్పుగా ప్రభుత్వం అభివర్ణించింది. ఈ యాప్‌లు ‘భారతదేశ సార్వభౌమాధికారం, సమగ్రత, రక్షణ, భద్రత, ప్రజా క్రమానికి హానికరమైన’ కార్యకలాపాలలో పాల్గొన్నాయని ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (మెయిటీ) తన ప్రకటనలో పేర్కొంది. గల్వాన్ లోయలో భారత్- చైనా మధ్య ఉద్రిక్తతలు గరిష్ట స్థాయికి చేరుకున్న సమయంలో ఈ యాప్‌లను నిషేధించారు.

Exit mobile version