Thomson 4K QLED Smart TVs: పండుగల సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని థామ్సన్ (Thomson) సంస్థ భారత మార్కెట్లో కొత్త స్మార్ట్ టీవీలను విడుదల చేసింది. 40 అంగుళాల నుంచి 65 అంగుళాల వరకు వివిధ స్క్రీన్ సైజుల్లో టీవీలను తీసుకొచ్చింది. వీటి ప్రారంభ ధర రూ.11,999గా ఉంది. కొత్త లైనప్‌లో 55 అంగుళాల Mini-QD 4K టీవీ, 65 అంగుళాల 4K QLED టీవీతో పాటు 40, 43 అంగుళాల Full HD స్మార్ట్ టీవీలు ఉన్నాయి. ఈ టీవీలు Flipkart Big Billion Sale 2026 సమయంలో కొనుగోలుకు అందుబాటులోకి రానున్నాయి.
థామ్సన్ 55 ఇంచుల Mini-QD 4K టీవీ ఫీచర్లు
థామ్సన్ కొత్తగా తీసుకొచ్చిన 55 అంగుళాల Mini-QD 4K టీవీలో 1.1 బిలియన్ రంగులకు సపోర్ట్ ఇచ్చే డిస్‌ప్లేను అందించారు. ఇది గరిష్ఠంగా 550 నిట్స్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. HDR10+, Dolby Vision వంటి ఫీచర్లు ఉన్నాయి. అలాగే 120Hz వరకు రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఆడియో విషయానికి వస్తే, ఇందులో నాలుగు స్పీకర్లతో కూడిన 80W స్టీరియో సౌండ్ సిస్టమ్‌ను అందించారు. Dolby Audio సపోర్ట్ కూడా ఉంది. ఈ టీవీ Google TV ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది. వాయిస్ కమాండ్ల కోసం Google Assistant, ఫోన్ నుంచి కంటెంట్ ప్రసారం చేసేందుకు Chromecast, AirPlay ఫీచర్లు ఉన్నాయి.
ధర: రూ.34,999.
థామ్సన్ 65 ఇంచుల 4K QLED టీవీ.. JioTele OS ప్రత్యేకతలు
ఈ లైనప్‌లో మరో ముఖ్యమైన మోడల్ 65 అంగుళాల Thomson JioTele OS TV. ఇందులో 4K QLED డిస్‌ప్లేను అందించారు. 1.1 బిలియన్ కలర్స్ కు సపోర్ట్‌తో పాటు బెజెల్-లెస్ డిజైన్, AirSlim డిజైన్, 450 నిట్స్ బ్రైట్‌నెస్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ టీవీ JioTele OSపై పనిచేస్తుంది. ఇందులో 300కు పైగా ఉచిత లైవ్ టీవీ ఛానళ్లు, 300కు పైగా JioGames అందుబాటులో ఉంటాయని కంపెనీ తెలిపింది. స్పోర్ట్స్ మోడ్ కూడా ఉంది. సౌండ్ కోసం 48W స్పీకర్లు ఇచ్చారు. కనెక్టివిటీ విషయానికి వస్తే డ్యూయల్-బ్యాండ్ Wi-Fi, Bluetooth 5.0 ఉన్నాయి. వాయిస్ కంట్రోల్‌తో కూడిన రిమోట్‌ను అందించారు. మూడు HDMI పోర్టులు, రెండు USB పోర్టులు కూడా ఉన్నాయి.
ధర: రూ.42,999.
రూ.11,999 నుంచే Full HD స్మార్ట్ టీవీలు
బడ్జెట్ వినియోగదారుల కోసం థామ్సన్ 40, 43 అంగుళాల Full HD స్మార్ట్ టీవీలను కూడా పరిచయం చేసింది. వీటిలో FHD LED డిస్‌ప్లే, A+ గ్రేడ్ ప్యానెల్, 300 నిట్స్ బ్రైట్‌నెస్, 178 డిగ్రీల వ్యూయింగ్ యాంగిల్ ఉన్నాయి. రెండు మోడళ్లలోనూ 36W స్టీరియో సౌండ్ సపోర్ట్ ఉంది. HDMI, USB, VGA, AV పోర్టులతో పాటు చైల్డ్ లాక్ వంటి ఫీచర్లు అందించారు.
ధరల వివరాలు ఇలా ఉన్నాయి
40 అంగుళాల Full HD TV: రూ.11,999
43 అంగుళాల Full HD TV: రూ.13,999
55 అంగుళాల Mini-QD 4K TV: రూ.34,999
65 అంగుళాల 4K QLED JioTele OS TV: రూ.42,999
Flipkart Big Billion Sale 2026లో కొనుగోలు చేసే అవకాశం

