NTV Telugu Site icon

Battery Tips: ఈ ఐదు పనులు చేస్తే మీ ఫోన్ బ్యాటరీ లైఫ్ తగ్గిపోతుంది.. జరజాగ్రత్త!

Phone Battery

Phone Battery

These Habits Draining Your Smart phone Battery May Be Lead To Explosion also: స్మార్ట్‌ఫోన్‌లో బ్యాటరీ సామర్థ్యం ఎక్కువగా ఉన్నప్పటికీ, మీరు చేసే కొన్ని ఇబ్బందికర అంశాలు బ్యాటరీని త్వరగా పాడు చేస్తాయి. అవి చేయడం వలన ఫోన్ బ్యాటరీ కూడా పేలిపోవచ్చు. ఈరోజు మీరు స్మార్ట్‌ఫోన్ బ్యాటరీకి సంబంధించి కొన్ని చెడు అలవాట్లను వదులుకోవాలి.

ఫోన్‌ని ఐస్ లో ఉండకండి
ఫోన్ చాలా వేడిగా ఉన్నప్పుడు, కొన్నిసార్లు దానిని ఐస్‌లో లేదా ఫ్రిజ్‌లో ఉంచాలనే ఆలోచన మన మదిలో వస్తుంది. అయితే ఇది ఫోన్ బ్యాటరీకి హాని కలిగించవచ్చు.

అధికంగా ఛార్జ్ చేయడం

ఫోన్‌ను ఎక్కువసేపు ఛార్జ్ చేయడం వల్ల దాని బ్యాటరీపై ఒత్తిడి పడుతుంది. అందువల్ల, బ్యాటరీ ఛార్జ్ అయిన తర్వాత ఛార్జర్‌ను తీసివేయడం మంచిది. నిపుణులు కూడా బ్యాటరీని 100 శాతం ఛార్జ్ చేయకుండా 95 శాతం వరకు ఛార్జ్ చేయాలని సిఫార్సు చేస్తున్నారు. అదే సమయంలో, బ్యాటరీని పదేపదే ఛార్జింగ్ చేయడం కూడా నివారించాలి.

అధిక వేడి వచ్చేలా చేయకండి
అధిక వేడికి బ్యాటరీని బహిర్గతం చేయడం వలన దాని ఒత్తిడి పెరుగుతుంది. దాని జీవితకాలం తగ్గుతుంది. ఇది చాలా ప్రమాదకరమైనది, ఇది బ్యాటరీ మంటలకు కూడా కారణమవుతుంది. అదే సమయంలో, ఫాస్ట్ ఛార్జింగ్ సమయంలో, బ్యాటరీ వేడెక్కుతుంది, ఇది దాని జీవితకాలం తగ్గిస్తుంది.

హై వోల్టేజ్ ఛార్జర్ల వాడకం
ఫోన్‌ను త్వరగా ఛార్జ్ చేయడానికి, ఎక్కువ వోల్ట్ ఉన్న ఛార్జర్‌ని ఉపయోగించడం గురించి మనం తరచుగా ఆలోచిస్తాము. కానీ ఇది చాలా ప్రమాదకరమైనది కూడా కావచ్చు. ఇది బ్యాటరీపై ఒత్తిడిని కలిగిస్తుంది, నష్టాన్ని కలిగిస్తుంది. అందువల్ల, ఫోన్ కోసం రూపొందించిన ఛార్జర్లను మాత్రమే ఉపయోగించండి.

బ్యాటరీ 0% తర్వాత కూడా ఉపయోగించడం
బ్యాటరీ పూర్తిగా డ్రైన్ అయ్యేంత వరకు వాడడం వల్ల దాని జీవితకాలం తగ్గుతుంది. మీరు బ్యాటరీని 20-80% మధ్య ఉంచడం మంచిది. 0 శాతానికి చేరుకున్న తర్వాత చాలా మంది దీనిని పవర్ సేవింగ్ మోడ్‌లో ఉపయోగిస్తున్నారు అలా చేయకూడదు.