ఈరోజుల్లో ప్రతి ఒక్కరి చేతుల్లో స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. ఇక సోషల్ మీడియాను కూడా ఎక్కువగా వాడుతుంటారు. ఉదయం నిద్ర లేచిన దగ్గర్నుంచి.. రాత్రి పడుకునేంత వరకు స్మార్ట్‌ఫోన్ అనేది మన లైఫ్‌లో ఒక భాగమైపోయింది. ఇదిలా ఉండగా.. స్మార్ట్‌ఫోన్ మన పనుల్ని ఎంతలా సులభతరం చేసిందో.. మరోవైపు అది అంతే ప్రమాదకరంగా మారుతోంది. కొంతమంది ఏకంగా ఫోన్లను సిస్టం గా వాడుతారు. వాళ్లంతా ఫోన్లో కీబోర్డును ఇంస్టాల్ చేసుకొని వాడుతారు. అదే పెద్ద ప్రమాదాన్ని తెచ్చి పెడుతుందని టెక్ నిపుణులు చెబుతున్నారు..
స్మార్ట్ ఫోన్లో అన్ని రకాల యాప్ లు అందుబాటులోకి వచ్చాయి. అందుకే ఎక్కువ మంది ఈ ఫోన్లే ముఖ్యమైన సమాచారాన్ని భద్రంగా పెడతారు.. అయితే ప్రముఖ మొబైల్ కంపెనికి సంబందించిన ఓ షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది.. కీబోర్డుల ద్వారా ముఖ్యమైన సమాచారాన్ని చోరీ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. కీబోర్డ్ వాడేవారు ఆన్లైన్ లావాదేవీలను చేసినప్పుడు పాస్వర్డ్ లాగిన్ చేసినప్పుడు ఆ డీటెయిల్స్ సేవ్ అవుతాయి..
కీబోర్డులను ఏవి పడితే అవి డౌన్ లోడ్ చేయడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.. కొన్ని కీ బోర్డు యాప్ లను ఉపయోగిస్తున్నప్పుడు మీరు ఏదైనా వస్తువులను తీసుకునేందుకు ఆన్‌లైన్ డెలివరీ, హోమ్ డెలివరీ లేదా ఫుడ్ డెలివరీ వంటి వాటి కోసం కొన్ని యాప్స్ వాడుతుంటాం. వీటిని వాడే సమయంలో కొన్ని సందర్భాల్లో పాస్ వర్డ్స్ అవసరం పడి నెట్ బ్యాంకింగ్ వాడటం వంటివి చేస్తుంటారు.. ఆ సమయంలో ఆ డేటా సేవ్ అవుతుంది .. అది ప్రమాదాలకు దారి తీస్తుంది. అందుకే డేటాను ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తుండాలి.. కీస్ట్రోక్ డేటాను స్టోర్ చేయని కీబోర్డ్ యాప్స్ ఉపయోగించాలని టెక్ నిపుణులు చెబుతున్నారు..