TECNO POVA Curve 2 5G Launch: టెక్నో (TECNO) కంపెనీ నుండి ‘పోవా కర్వ్’ (POVA Curve) సిరీస్‌లో భాగంగా సరికొత్త టెక్నో పోవా కర్వ్ 2 5G (TECNO POVA Curve 2 5G) స్మార్ట్‌ఫోన్ ను భారత మార్కెట్లో నేడు (ఫిబ్రవరి 13, 2026) అధికారికంగా విడుదల చేసింది. ఈ మొబైల్ అద్భుతమైన 3D కర్వ్డ్ డిస్‌ప్లే, ఏకంగా 8000mAh భారీ బ్యాటరీతో వినియోగదారులను ఆకట్టుకోనుంది. మరి ఈ ఫోన్ వివరాలని ఒకసారి చూసేద్దామా..
Thailand GL Series: థాయిలాండ్ ‘గర్ల్స్ లవ్’ విప్లవం.. ప్రపంచ ఫ్యాన్ కల్చర్‌కు కొత్త నిర్వచనం
డిజైన్ & డిస్‌ప్లే:
ఈ ఫోన్ ‘స్టార్‌షిప్ ఇన్‌స్పైర్డ్’ (Starship Inspired) డిజైన్‌తో చాలా ఫ్యూచరిస్టిక్‌గా కనిపిస్తుంది. వెనుక భాగంలో వినూత్నమైన త్రిభుజాకార (Triangular) కెమెరా మాడ్యూల్‌ను అందించారు.
డిస్‌ప్లే: 6.78 అంగుళాల 1.5K 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్.
రిఫ్రెష్ రేట్: 144Hz రిఫ్రెష్ రేట్ మరియు 4500 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్.
రక్షణ: కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ మరియు SGS 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్.
పర్ఫార్మెన్స్ & సాఫ్ట్‌వేర్:
ప్రాసెసర్: మీడియాటెక్ డైమెన్సిటీ 7100 (MediaTek Dimensity 7100 6nm) చిప్‌సెట్.
ర్యామ్/స్టోరేజ్: 8GB RAM (మరో 8GB వర్చువల్ ర్యామ్ సదుపాయం), 128GB/256GB స్టోరేజ్.
OS: ఆండ్రాయిడ్ 16 ఆధారిత HiOS 16 పై పనిచేస్తుంది.
ప్రత్యేక చిప్స్: మెరుగైన సిగ్నల్ కోసం G1 చిప్, వైఫై బలం పెంచడానికి SE1 చిప్ ఉన్నాయి.
Massive Sinkhole: బిజీబిజీగా మెట్రో పనులు.. సడన్ గా బయటపడ్డ భారీ సింక్‌హోల్.! వీడియో వైరల్..
బ్యాటరీ & కెమెరా:
బ్యాటరీ: ఈ ఫోన్ లో ప్రధానంగా చెప్పుకొనేది దీని బ్యాటరీ. కేవలం 7.42mm మందం ఉన్న బాడీలో 8000mAh భారీ బ్యాటరీని అమర్చడం విశేషం. దీనికి 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లభిస్తుంది.
వెనుక కెమెరా: 50MP ప్రధాన కెమెరా + 2MP మాక్రో సెన్సార్ (2K వీడియో రికార్డింగ్ సపోర్ట్).
ముందు కెమెరా: 13MP సెల్ఫీ కెమెరా.
ధర & లాంచ్ ఆఫర్:
TECNO POVA Curve 2 5G మిస్టిక్ పర్పుల్, స్టోర్మ్ టైటానియం, మెల్టింగ్ సిల్వర్ అనే మూడు ఆకర్షణీయమైన రంగుల్లో లభిస్తుంది. 8GB + 128GB వేరియంట్ రూ. 27,999కు లభిస్తుండగా.. 8GB + 256GB వేరియంట్ రూ. 29,999కు లభిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఫిబ్రవరి 20వ తేదీ నుండి ఫ్లిప్కార్ట్ లో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. లాంచ్ ఆఫర్ కింద బ్యాంక్ కార్డులపై రూ. 1,500 ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్, రూ. 3,000 వరకు EMI ఆఫర్లు లభిస్తాయి.
