Sony BRAVIA 7 II RGB Mini LED 4K TVs Launched: ప్రముఖ ఎలక్ట్రానిక్స్ సంస్థ సోనీ (Sony) భారత మార్కెట్లో తన కొత్త BRAVIA 7 II టీవీ సిరీస్‌ను అధికారికంగా విడుదల చేసింది. ఈ కొత్త సిరీస్‌లో True RGB టెక్నాలజీతో కూడిన Mini LED డిస్‌ప్లేను అందించారు. ఈ సిరీస్‌లో 55, 65, 75, 85 అంగుళాల మోడల్స్‌ను విడుదల చేసింది. అలాగే 98 అంగుళాల భారీ మోడల్‌ను జూలై 2026లో విడుదల చేయనుంది.
BRAVIA 7 II టీవీల్లో RGB బ్యాక్ లైట్ మాస్టర్ డ్రైవ్ ప్రో టెక్నాలజీని ఉపయోగించారు. ఇది రెడ్, గ్రీన్, బ్లూ LEDలను విడివిడిగా నియంత్రించడం ద్వారా మరింత ఖచ్చితమైన రంగులను చూపిస్తుంది. దీంతో సాధారణ Mini LED టీవీలతో పోలిస్తే మెరుగైన కాంట్రాస్ట్, తగ్గిన బ్లూమింగ్ ఎఫెక్ట్ & నేచురల్ కలర్స్ లభిస్తాయి. అలాగే RGB Triluminos Max & లుమినన్స్ బూస్టర్ ఫీచర్లు ఎక్కువ బ్రైట్‌నెస్‌తో పాటు అనేక కలర్ వాల్యూమ్‌ను అందిస్తాయి. స్మూత్ కలర్ గ్రేడేషన్ టెక్నాలజీ కారణంగా డార్క్, బ్రైట్ సీన్ల మధ్య సాఫ్ట్ ట్రాన్సిషన్స్ కనిపిస్తాయి. 65 అంగుళాలు పైబడిన మోడల్స్‌లో X-Wide Angle Pro ఫీచర్ కూడా ఉంది. ఇది సైడ్ యాంగిల్ నుంచి చూసినా రంగులను స్థిరంగా ఉంచుతుంది.
ఈ టీవీలకు కాగ్నిటివ్ ప్రాసెసర్ XR ప్రాసెసర్ కు శక్తినిస్తోంది. ఇది మానవ కళ్లకు అనుగుణంగా విజువల్స్‌ను ప్రాసెస్ చేస్తుంది. ఇందులో XR కాంట్రాస్ట్ బూస్టర్, XR క్లియర్ ఇమేజ్, XR మోషన్ క్లారిటీ వంటి ఫీచర్లు ఉండటం వల్ల క్లియర్ విజువల్స్ అనుభవం లభిస్తుంది. HDR పరంగా డాల్బీ విజన్, HDR10, HLG, IMAX Enhanced సపోర్ట్‌ను అందించింది.
ఆడియో విభాగంలో డాల్బీ ఆటమ్స్, DTS, 3D సరౌండ్ అప్ స్కేలింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. వాయిస్ జూమ్ 3 టెక్నాలజీ AI సహాయంతో డైలాగ్ క్లారిటీని మెరుగుపరుస్తుంది. 65 అంగుళాలు పైబడిన మోడల్స్‌లో Acoustic మల్టీ-ఆడియో+ సిస్టమ్ కూడా అందుబాటులో ఉంది. గేమింగ్ ప్రేమికుల కోసం HDMI 2.1 ద్వారా 4K 120fps సపోర్ట్, VRR, ALLM, డాల్బీ విజన్ గేమింగ్ ఫీచర్లను అందించారు. PS5 యూజర్లకు ఆటో HDR టోన్ మాపింగ్, ఆటో జినరే పిక్చర్ మోడ్, PS రిమోట్ ప్లే వంటి ప్రత్యేక ఫీచర్లు కూడా ఉన్నాయి.
ఈ టీవీలు గూగుల్ టీవీ ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తాయి. 4 లక్షలకు పైగా సినిమాలు, షోలు, యాప్స్ మరియు గేమ్స్‌కు యాక్సెస్ లభిస్తుంది. Google Assistant, Chromecast, Apple AirPlay 2, ఆపిల్ హోంకిట్, అలెక్స సపోర్ట్ కూడా అందుబాటులో ఉన్నాయి. ధరల విషయానికి వస్తే 55 అంగుళాల మోడల్ ధర రూ. 3,59,900 కాగా, ప్రత్యేక ఆఫర్‌లో రూ. 2,21,990కు లభిస్తుంది. 65 అంగుళాల మోడల్ ధర రూ. 4,39,900 కాగా, బెస్ట్ బై ధర రూ. 2,74,990గా నిర్ణయించారు. మిగతా మోడల్స్ ధరలను త్వరలో ప్రకటించనున్నారు.
