Site icon NTV Telugu

అప్‌డేటెడ్ స్పెసిఫికేషన్లతో రాబోతున్న Poco F8 Pro, Poco F8 Ultra ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్లు.. లాంచ్ ఎప్పుడంటే..?

Poco F8 Pro, Poco F8 Ultra

Poco F8 Pro, Poco F8 Ultra

Poco F8 Pro, Poco F8 Ultra: పోకో (Poco) నెక్స్ట్ గ్లోబల్ లాంచ్ ఈవెంట్‌ను నవంబర్ 26న బాలిలో నిర్వహించడానికి సిద్ధమైంది. ఈ ఈవెంట్‌లో కంపెనీ తన F-సిరీస్‌ కొత్త మోడళ్లను విడుదల చేయనుంది. ప్రస్తుతం అందిన సమాచారం మేరకు.. రాబోయే ఈవెంట్ లో Poco F8 Pro, Poco F8 Ultra మోడళ్లు లాంచ్ కానున్నాయి. అయితే F8 సిరీస్‌లో మొత్తం మూడు ఫోన్‌లు (F8, F8 Pro, F8 Ultra) ఉన్నప్పటికీ.. Poco F8 మోడల్ ఈ ఈవెంట్‌లో విడుదల కాకపోవచ్చు. కేవలం ఈ లాంచ్ ప్రధానంగా హై-ఎండ్ మోడళ్లపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది.

Saudi Bus Accident: సౌదీ రోడ్డు ప్రమాదం.. రెండు కుటుంబాలకు చెందిన 15 మంది హైదరాబాదీలు మృతి..

ఈ ఫోన్లు చైనాలో విడుదలైన Redmi K90, K90 Pro Max మోడళ్ల రీబ్రాండెడ్ వెర్షన్లు కావచ్చని కొన్ని నివేదికలు సూచిస్తున్నాయి. డిజైన్, అంతర్గత హార్డ్‌వేర్ విషయంలో ఇవి Redmi మోడళ్లను పోలి ఉండే అవకాశం ఉండనున్నట్లు సమాచారం. అయితే రెడీమి మోడళ్ల కంటే పోకో ఫోన్‌లలో బ్యాటరీ సామర్థ్యం కొద్దిగా తక్కువగా ఉండవచ్చని లీక్‌లు చెబుతున్నాయి. పోకో F8 Pro లో 6.59 అంగుళాల OLED ప్యానెల్ ఉండవచ్చు. ఇక Poco F8 Ultra లో 6.9 అంగుళాల డిస్‌ప్లేను అందించే అవకాశం ఉంది. ఈ రెండు ఫోన్‌లలో 1.5K రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌ను ఆశించవచ్చు. సాఫ్ట్‌వేర్ పరంగా ఈ ఫోన్‌లు ఆండ్రాయిడ్ 16 ఆధారిత HyperOS 3 తో పనిచేసే అవకాశం ఉంది.

Amla Benefits vs Risk: ఉసిరి వల్ల అనారోగ్య సమస్యలు..! ఈ సూపర్ ఫుడ్ ఎప్పుడు తినకూడదు..

అలాగే Poco F8 Proలో Snapdragon 8 Elite చిప్‌సెట్ ఉండవచ్చు. ఇక Poco F8 Ultra లో మరింత మెరుగైన Snapdragon 8 Elite Gen 5 ప్లాట్‌ఫారమ్‌ను ఉపయోగించవచ్చు. ఈ రెండు ఫోన్‌లలో ముందు భాగంలో 20MP సెల్ఫీ కెమెరా ఉండే అవకాశం ఉంది. ఇక వెనుక కెమెరాల విషయానికి వస్తే.. Poco F8 Pro లో OIS తో కూడిన 50MP ప్రధాన సెన్సార్, 8MP అల్ట్రా వైడ్, 2x జూమ్‌తో కూడిన 50MP టెలిఫోటో సెన్సార్ ఉండవచ్చు. అలాగే Poco F8 Ultraలో ప్రధాన, అల్ట్రా వైడ్, పెరిస్కోప్ టెలిఫోటో సెటప్ కోసం మూడు వేర్వేరు 50MP సెన్సార్లతో రావచ్చు. అల్ట్రా మోడల్‌లో రేర్ స్పీకర్ కూడా ఉండవచ్చని కొన్ని లీక్‌లు సూచిస్తున్నాయి. ఛార్జింగ్ విషయానికి వస్తే ఈ రెండు ఫోన్‌లు 100W వైర్డు ఛార్జింగ్‌కు మద్దతు ఇవ్వవచ్చు. అలాగే Ultra మోడల్‌లో అదనంగా 50W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉండవచ్చు.

Exit mobile version