IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP కెమెరా, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 లాంచ్..!

  • OPPO Find X10 గ్లోబల్ మార్కెట్లలో అధికారికంగా లాంచ్.
  • 200MP ప్రధాన కెమెరా, 200MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా., 50MP అల్ట్రా-వైడ్, 50MP సెల్ఫీ కెమెరాలు.
  • 8000mAh భారీ బ్యాటరీతో పాటు 80W వైర్డ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్.
  • IP66, IP68, IP69 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్స్.
Oppo Find X10

Oppo Find X10

OPPO Find X10 Launched: ఒప్పో (OPPO) Find X10ను గ్లోబల్ మార్కెట్లలో అధికారికంగా లాంచ్ చేసింది. హాసెల్‌బ్లాడ్ భాగస్వామ్యంతో రూపొందించిన ఈ ఫోన్‌లో కెమెరా, డిస్‌ప్లే, పనితీరు, బ్యాటరీపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. కొత్త ColorOS 17 ఆపరేటింగ్ సిస్టమ్‌తో వచ్చిన ఈ ఫోన్‌లో పలు AI ఫీచర్లు కూడా ఉన్నాయి.

8000mAh బ్యాటరీ

OPPO Find X10లో భారీ 8000mAh బ్యాటరీ ఉంది. 80W SuperVOOC వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ అందించారు. ఫోన్ IP66, IP68, IP69 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్‌లను కలిగి ఉంది. ఈ ఫోన్ Android 17 ఆధారిత ColorOS 17పై పనిచేస్తుంది. AI మైండ్ పైలట్ ద్వారా సహజ భాషలో ఫైల్స్, వెబ్ డేటా, ప్రొడక్టివిటీ పనులను నిర్వహించుకోవచ్చు. AI ఫోటో ఏజెంట్ ఫోటో ఎడిటింగ్‌లో సందర్భానుసార మార్పులు, ప్రాంప్ట్ ఆధారిత ఎడిటింగ్, స్టైల్ ట్రాన్స్‌ఫర్‌ను అందిస్తుంది. అలాగే AI కాల్ గార్డ్ ఇన్‌కమింగ్ కాల్స్‌ను విశ్లేషించి సింథటిక్ ఆడియో లేదా రియల్‌టైమ్ ఫేషియల్ మానిప్యులేషన్ ఆధారిత మోసాలను గుర్తించేందుకు ఉపయోగపడుతుంది.

200MP కెమెరా సెటప్

ఈ కొత్త మొబైల్ 200MP ప్రధాన కెమెరాను అందించారు. 1/1.4 అంగుళాల సెన్సార్, f/1.6 అపెర్చర్, OIS సపోర్ట్ ఉన్నాయి. దీనికి జతగా 50MP అల్ట్రా-వైడ్ కెమెరా, 200MP 2.8x పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా ఉన్నాయి. హాసెల్‌బ్లాడ్ పోర్ట్రెయిట్ ఫీచర్ కూడా అందించారు. ముందు భాగంలో 50MP సెల్ఫీ కెమెరా ఉంది. కెమెరా ప్రాసెసింగ్ కోసం OPPO లుమో ట్రూ ఇమేజ్ ఇంజిన్ ను ఉపయోగించింది. సహజమైన కాంట్రాస్ట్, చర్మ రంగులు, ఆప్టికల్ టెక్స్చర్‌ను మెరుగ్గా అందించేలా ఇమేజ్ ప్రాసెసింగ్‌ను రూపొందించినట్లు కంపెనీ తెలిపింది. హై-రిజల్యూషన్ ఫొటోల కోసం హస్సెల్ బ్లడ్ హై-రేస్ మోడ్ కూడా ఉంది. వీడియో పరంగా 4K 120fps, 8K 30fps రికార్డింగ్‌కు సపోర్ట్ ఉంది. Dolby Vision, ACES సర్టిఫైడ్ O-Log2, ఓపెన్ గేట్ కాప్చర్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. బ్లాక్ మ్యాజిక్ కెమెరా యాప్‌తో ఈ క్యాప్చర్ ప్రొఫైల్స్‌ను ఉపయోగించుకోవచ్చు.

144Hz డిస్‌ప్లే & ప్రాసెసర్‌

ఈ Find X10లో 6.59 అంగుళాల LTPO AMOLED డిస్‌ప్లే ఉంది. ఇది 2760×1256 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో, 1-120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్, గరిష్ఠంగా 144Hz రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేస్తుంది. 3,840Hz అల్ట్రా-హై ఫ్రీక్వెన్సీ PWM డిమ్మింగ్, Dolby Vision, 2,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫోన్‌లో 3nm టెక్నాలజీపై తయారైన MediaTek Dimensity 9600M ప్రాసెసర్‌ను ఉపయోగించారు. దీనికి ARM G1-Ultra GPU జతగా ఉంటుంది. 12GB LPDDR5X ర్యామ్‌తో 256GB, 512GB UFS 4.1 స్టోరేజ్ వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి.

ధర

ఒప్పో ఫైండ్ X10 Glacier Blue, Glow Coral, Mist Grey రంగుల్లో లభిస్తుంది. వీటి ధరల విషయానికి వస్తే.. 12GB + 256GB వేరియంట్ ధర €1,299 (సుమారు రూ.1,37,670) కాగా, 12GB + 512GB వేరియంట్ ధర €1,499 (సుమారు రూ.1,58,865)గా ఉంది. గ్లోబల్ మార్కెట్లలో అధికారిక ఒప్పో ఛానళ్లు, భాగస్వామ్య క్యారియర్లు, అధీకృత రిటైలర్ల ద్వారా అక్టోబర్ చివరి నుంచి విక్రయాలు ప్రారంభం కానున్నాయి.