Site icon NTV Telugu

OPPO Find N6: 50MP+50MP+200MP కెమెరా, 6000mAh బ్యాటరీ.. భారీ ఫోల్డబుల్ డిస్‌ప్లేతో రానున్న ఒప్పో ఫోన్!

Oppo Find N6

Oppo Find N6

ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్‌లో ‘ఒప్పో’ మరోసారి సంచలనం సృష్టించేందుకు సిద్ధమవుతోంది. ఒప్పో ఫైండ్ ఎన్6 (OPPO Find N6) స్ప్రింగ్ ఫెస్టివల్ తర్వాత లాంచ్ అయ్యే అవకాశం ఉందని సమాచారం. ఒప్పో ఫ్లాగ్‌షిప్ సిరీస్‌లోని Find X9 Ultraతో కలిసి ఈ డివైస్‌ను విడుదల చేసే అవకాశాలు కూడా ఉన్నాయని టెక్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే PLP110 / PLP120 మోడల్ నంబర్లతో (స్టాండర్డ్ వెర్షన్, శాటిలైట్ కమ్యూనికేషన్ వెర్షన్) నెట్‌వర్క్ సర్టిఫికేషన్ పూర్తవ్వడంతో పాటు 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కూడా కన్ఫర్మ్ చేశారు.

OPPO Find N6 Display:
డిస్‌ప్లే విషయంలో ఒప్పో ఫైండ్ ఎన్6 ప్రీమియం అనుభవాన్ని అందించనుంది. ఇందులో 8.12 ఇంచెస్ 2K LTPO UTG ఇన్నర్ ఫోల్డబుల్ స్క్రీన్తో పాటు 6.62 అంగుళాల అవుటర్ డిస్‌ప్లేను ఇవ్వనున్నారు. పెద్ద స్క్రీన్‌పై మల్టీటాస్కింగ్, గేమింగ్, మీడియా వినియోగానికి బెస్ట్ ఆప్షన్‌గా మారనుంది.

OPPO Find N6 Processor:
ఈ ఫోన్‌లో తాజా Snapdragon 8 Elite Gen 5 ప్రాసెసర్ ఉండనుంది. ఫ్లాగ్‌షిప్ లెవల్ ఈ చిప్‌సెట్ హై ఎండ్ గేమింగ్, AI టాస్క్స్, హెవీ మల్టీటాస్కింగ్‌ను సులభంగా హ్యాండిల్ చేయగలదు. మెమరీ పరంగా 12GB RAM + 1TB స్టోరేజ్ లేదా 16GB RAM + 1TB స్టోరేజ్ ఆప్షన్లు వచ్చే అవకాశం ఉంది.

Also Read: Infinix Note 60 Pro Launch: ప్రీమియం డిస్‌ప్లే, పవర్‌ఫుల్ ప్రాసెసర్.. ఫ్లాగ్‌షిప్ ఫీచర్లతో కొత్త నోట్!

OPPO Find N6 Camera:
కెమెరా విభాగంలో ఒప్పో ఫైండ్ ఎన్6 అసలైన ఫ్లాగ్‌షిప్‌ను మరిపిస్తుంది. ముందు భాగంలో 20MP + 20MP డ్యుయల్ ఫ్రంట్ కెమెరాలు ఉండగా.. వెనుక భాగంలో 50MP + 50MP + 200MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ అందించనున్నారు. దీనికి తోడు 2MP మల్టీస్పెక్ట్రల్ సెన్సర్ ఉండటం ఫోటోగ్రఫీ, కలర్ అక్యురసీని మరింత మెరుగుపరుస్తుంది.

OPPO Find N6 Battery:
ఈ ఫోన్‌లో 6000mAh కెపాసిటీ బ్యాటరీ ఉండనుందని లీకులు చెబుతున్నాయి. 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండటం వల్ల తక్కువ సమయంలో ఛార్జ్ అయ్యే అవకాశం ఉంటుంది. సుమారు 225 గ్రాముల బరువుతో స్లిమ్ ఫోల్డబుల్‌గా రానుంది. Titanium, Deep Black, Golden Orange అనే ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్లు ఉండనున్నాయి. ప్రత్యేకంగా శాటిలైట్ కమ్యూనికేషన్ వెర్షన్, మ్యాగ్నెటిక్ యాక్సెసరీ ఎకోసిస్టమ్, అలాగే ఒప్పో ఫోల్డబుల్ ఫోన్లలో తొలిసారిగా AI స్టైలస్ సపోర్ట్ అందించనున్నట్లు సమాచారం.

Exit mobile version