Motorola Edge 70 Neo: స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో Motorola మరో కొత్త ఫోన్‌ను విడుదల చేసేందుకు సిద్ధమైంది. Motorola Edge 70 Neo పేరుతో కొత్త 5G స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో లాంచ్ చేయనుంది. నవంబర్ 24వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఈ ఫోన్ లాంచ్ కానుంది. ఇప్పటికే ఈ ఫోన్‌కు సంబంధించిన కీలక ఫీచర్లు టెక్ వర్గాల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. ముఖ్యంగా 7000mAh భారీ బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, Snapdragon ప్రాసెసర్, 50MP Sony కెమెరా వంటి ఫీచర్లు ఈ ఫోన్ ప్రత్యేకతగా నిలవనున్నాయి.
Motorola Edge 70 Neoలో 6.8 ఇంచుల 1.5K AMOLED డిస్ప్లేను అందించనున్నారు. ఇందులో 144Hz రిఫ్రెష్ రేట్ ఉండటం వల్ల స్క్రోలింగ్, గేమింగ్, వీడియోలు చూసే సమయంలో మెరుగైన అనుభవం లభించే అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ డిస్ప్లే గరిష్టంగా 5200 nits పీక్ బ్రైట్నెస్ను అందించనుంది. దీంతో ఎండలో కూడా స్క్రీన్‌ను స్పష్టంగా చూసేందుకు ఉపయోగపడుతుంది.
పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఈ స్మార్ట్‌ఫోన్‌లో Qualcomm Snapdragon 7s Gen 3 5G ప్రాసెసర్‌ను అందించనున్నారు. రోజువారీ వినియోగంతో పాటు మల్టీటాస్కింగ్, గేమింగ్ వంటి అవసరాలకు ఈ చిప్సెట్ ఉపయోగపడుతుంది. ఇందులో గరిష్టంగా 8GB LPDDR5X RAM అందించనున్నట్లు వెల్లడించారు. సాఫ్ట్వేర్ పరంగా Android 16 ఆధారిత Hello UIతో ఈ ఫోన్ పనిచేయనుంది.
కెమెరా విభాగంలో Motorola ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో 50MP Sony LYT-710 మెయిన్ రియర్ కెమెరాను అందించనున్నారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 32MP కెమెరా ఉంటుంది. మరో ప్రత్యేకత ఏమిటంటే.. ముందు, వెనుక రెండు కెమెరాల ద్వారా 4K వీడియో రికార్డింగ్ చేసుకునే సదుపాయం కల్పించనున్నారు. కంటెంట్ క్రియేటర్లు, వీడియోలు రూపొందించే వారికి ఈ ఫీచర్ ఉపయోగకరంగా ఉండవచ్చు. ఈ ఫోన్లో అత్యంత ఆకర్షణీయమైన ఫీచర్లలో 7000mAh బ్యాటరీ ఒకటి. సాధారణంగా చాలా స్మార్ట్ఫోన్లలో 5000mAh బ్యాటరీ అందిస్తుండగా, ఇందులో 7000mAh బ్యాటరీని అందించనున్నారు. అలాగే 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది. Motorola Edge 70 Neoలో IP64 రేటింగ్‌ను కూడా అందించనున్నారు.

