సాధారణంగా టీవీ అంటే గోడకు కొంత దూరంగానో లేదా స్టాండ్‌పైనే ఉంటుంది. కానీ, ఎల్‌జీ (LG) మళ్లీ పరిచయం చేసిన ‘వాల్‌పేపర్ టీవీ’ని చూస్తే అది అసలు టీవీనా లేక ఏదైనా పెయింటింగా అనే సందేహం కలగక మానదు. 2020లో నిలిపివేసిన ఈ వినూత్న కాన్సెప్ట్‌ను, ఇప్పుడు మరింత శక్తివంతమైన టెక్నాలజీతో W6 OLED పేరుతో ఎల్‌జీ తిరిగి ప్రవేశపెట్టింది.
1. ఆకట్టుకునే స్లిమ్ డిజైన్ (Picture-Frame Effect)
- LG W6 టీవీ కేవలం 9 మిమీ మందంతో వస్తుంది. ఇది గోడకు ఎంత దగ్గరగా ఉంటుందంటే, గోడకు టీవీకి మధ్య అసలు గ్యాప్ ఉన్నట్లు కూడా అనిపించదు. దీనివల్ల గదిలో ఒక ఖరీదైన ‘పిక్చర్ ఫ్రేమ్’ ఉన్న అనుభూతి కలుగుతుంది. దీనికోసం ఎల్‌జీ ఒక ప్రత్యేకమైన ‘ఫ్లష్ మౌంటింగ్’ వ్యవస్థను అభివృద్ధి చేసింది.
2. విజువల్స్ అదిరిపోయేలా.. 4 రెట్లు ఎక్కువ బ్రైట్‌నెస్!
- పాత ఓఎల్ఈడీ టీవీలతో పోలిస్తే ఇది అత్యంత ప్రకాశవంతమైన చిత్రాలను అందిస్తుంది.
- Brightness Booster Ultra: సాధారణ ఓఎల్ఈడీ టీవీల కంటే ఇది నాలుగు రెట్లు ఎక్కువ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. దీనివల్ల పగటి వెలుతురులో కూడా టీవీలోని దృశ్యాలు ఎంతో స్పష్టంగా కనిపిస్తాయి.
- Hyper Radiant Colour: ఈ టెక్నాలజీ రంగులను మరింత సహజంగా, లోతుగా చూపిస్తుంది. సినిమా చూస్తున్నప్పుడు థియేటర్ ఎక్స్‌పీరియన్స్ మన ఇంట్లోనే కలుగుతుంది.
- రిఫ్లెక్షన్ ఫ్రీ కోటింగ్: టీవీ స్క్రీన్‌పై ఎలాంటి ప్రతిబింబాలు పడకుండా స్పెషల్ కోటింగ్ ఇచ్చారు. గదిలోని లైట్లు టీవీ స్క్రీన్‌పై కనిపించవు కాబట్టి వీక్షణ అద్భుతంగా ఉంటుంది.
3. వైర్ల గందరగోళం లేని ‘వైర్‌లెస్ బాక్స్’
- సాధారణంగా టీవీ వెనుక వైర్ల వల్ల గందరగోళంగా ఉంటుంది. కానీ LG W6లో ఆ సమస్య ఉండదు. దీనికి ఒక ప్రత్యేకమైన వైర్‌లెస్ కనెక్టివిటీ బాక్స్‌ను అందించారు.
- మీరు మీ సెట్ టాప్ బాక్స్, గేమింగ్ కన్సోల్ లేదా హోమ్ థియేటర్ వైర్లను ఈ బాక్స్‌కు కనెక్ట్ చేస్తే సరిపోతుంది.
- ఈ బాక్స్ టీవీకి 30 అడుగుల దూరంలో ఎక్కడైనా ఉండవచ్చు. బాక్స్ నుండి టీవీకి సమాచారం వైర్‌లెస్ పద్ధతిలో వెళ్తుంది. కేవలం టీవీకి పవర్ కనెక్షన్ మాత్రమే నేరుగా ఉంటుంది.
4. గేమర్ల కోసం ప్రత్యేక ఫీచర్లు
- హై-ఎండ్ గేమింగ్ ఇష్టపడే వారి కోసం ఎల్‌జీ ఇందులో టాప్ క్లాస్ ఫీచర్లను చేర్చింది.
- 165Hz రిఫ్రెష్ రేట్: వేగంగా కదిలే గేమ్స్ ఆడుతున్నప్పుడు ఎలాంటి లాగ్ ఉండదు.
- NVIDIA G-SYNC & AMD FreeSync: వీటి సపోర్ట్ వల్ల గేమింగ్ గ్రాఫిక్స్ అత్యుత్తమంగా ఉంటాయి.
- 0.1ms రెస్పాన్స్ టైమ్: బటన్ నొక్కగానే అతివేగంగా స్పందిస్తుంది, ఇది గేమర్లకు చాలా కీలకం.
5. సైజులు , స్మార్ట్ ఫీచర్లు
- ఈ టీవీ 77-అంగుళాలు , 83-అంగుళాల భారీ స్క్రీన్ పరిమాణాల్లో అందుబాటులో ఉంటుంది. ఇందులో ఏఐ (AI) ఆధారిత సాఫ్ట్‌వేర్ ఉండటం వల్ల, టీవీని వాడుకోనప్పుడు దానిపై రకరకాల డిజిటల్ వాల్‌పేపర్స్ లేదా మీ సొంత ఫోటోలను పెట్టుకోవచ్చు.
