రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో పాటు.!

Lava Bold N2 5g

Lava Bold N2 5g

Lava Bold N2 5G Launched: భారతీయ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ లావా ఇంటర్నేషనల్ (Lava International) తన బోల్డ్ సిరీస్‌లో కొత్త 5G స్మార్ట్‌ఫోన్ లావా బోల్డ్ N2 5Gను అధికారికంగా విడుదల చేసింది. తక్కువ ధరలో 5G అనుభవాన్ని కోరుకునే వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని ఈ ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ కొత్త స్మార్ట్ ఫోన్ 6.75 అంగుళాల HD+ LCD డిస్‌ప్లేను అందించారు. ఈ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేయడం వల్ల స్క్రోలింగ్, గేమింగ్ అనుభవం మరింత స్మూత్‌గా ఉంటుంది. నాచ్ డిజైన్‌తో వచ్చిన ఈ ఫోన్‌కు IP64 రేటింగ్ కూడా ఉంది. దీంతో దుమ్ము, నీటి చినుకుల నుంచి ప్రాథమిక రక్షణ లభిస్తుంది.

ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6nm టెక్నాలజీ ఆధారిత Unisoc T8200 ఆక్టా-కోర్ ప్రాసెసర్‌ను అమర్చారు. ఇది గరిష్టంగా 2.3GHz క్లాక్ స్పీడ్‌తో పనిచేస్తుంది. గ్రాఫిక్స్ కోసం Mali-G57 MC2 GPU అందించారు. లావా బోల్డ్ N2 5Gలో ప్రధాన ఆకర్షణగా 6000mAh భారీ బ్యాటరీ చెప్పవచ్చు. కంపెనీ తెలిపిన ప్రకారం ఒకసారి పూర్తి చార్జ్ చేస్తే 815 నిమిషాల వరకు యూట్యూబ్ వీడియో ప్లేబ్యాక్ అందించగలదు. అలాగే మొత్తం 743 నిమిషాల వరకు స్క్రీన్-ఆన్ టైమ్‌ను అందిస్తుందని పేర్కొంది. 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఇందులో ఉంది.

×
×
Ad

ఫోటోగ్రఫీ కోసం ఫోన్ వెనుక భాగంలో 13MP ప్రధాన కెమెరా అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 5MP ఫ్రంట్ కెమెరా ఉంది. ఫోన్‌లో 4GB LPDDR4x RAM, 64GB UFS 2.2 స్టోరేజ్ లభిస్తుంది. మైక్రో SD కార్డ్ ద్వారా 1TB వరకు స్టోరేజ్‌ను విస్తరించుకునే అవకాశం ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌తో వస్తోంది. భద్రత కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను అందించారు.

లావా బోల్డ్ N2 5G స్మార్ట్‌ఫోన్ రీగల్ గోల్డ్, బిలియనీర్ బ్లూ రంగుల్లో అందుబాటులోకి రానుంది. దీని ధర రూ.12,999గా నిర్ణయించారు. అయితే ప్రారంభ ఆఫర్ కింద రూ.11,999 ప్రత్యేక ధరకు జూన్ 9 నుంచి అమెజాన్‌లో అమ్మకాలు ప్రారంభమవుతాయి. అంతేకాకుండా, లావా తన ప్రత్యేక “Free Service @ Home” సేవను కూడా ఈ ఫోన్‌తో అందిస్తోంది. దీని ద్వారా వినియోగదారులు చిన్నపాటి సర్వీస్ లేదా టెక్నికల్ సమస్యల కోసం సర్వీస్ సెంటర్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇంటి వద్దే సహాయం పొందవచ్చు.