10,000 నిట్స్‌ బ్రైట్‌నెస్‌, 2K 165Hz డిస్‌ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!

  • ఐక్యూ 16లో అత్యాధునిక ‘సామ్సంగ్ ఎవరెస్ట్’ డిస్‌ప్లే
  • 2K రిజల్యూషన్‌, 165Hz రిఫ్రెష్‌ రేట్‌
  • ఏకంగా 10,000 నిట్స్‌ వరకు లోకల్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌
  • సామ్సంగ్‌ M16 లూమినసెంట్‌ మెటీరియల్‌ వినియోగం
  • 5,000Hz ఇన్‌స్టాంటేనియస్‌ టచ్‌ శాంప్లింగ్‌..
Iqoo 16

Iqoo 16

iQOO 16: స్మార్ట్‌ఫోన్‌ ప్రియులకు ఐక్యూ (iQOO) గుడ్‌న్యూస్‌ చెప్పింది. త్వరలో మార్కెట్‌లోకి రాబోతున్న iQOO 16 స్మార్ట్‌ఫోన్‌లో సామ్సంగ్ డిస్ప్లేతో కలిసి అభివృద్ధి చేసిన అత్యాధునిక డిస్‌ప్లేను అందిస్తున్నట్లు కంపెనీ అధికారికంగా వెల్లడించింది. ఈ డిస్‌ప్లేను ‘Samsung Everest’ పేరుతో పిలుస్తున్నారు. సెప్టెంబర్‌ చివర్లో iQOO 16 అధికారికంగా లాంచ్‌ కానుంది.

iQOO, Samsung డిస్ప్లే కలిసి నిర్వహించిన స్క్రీన్‌ టెక్నాలజీ కమ్యూనికేషన్‌ కాన్ఫరెన్స్‌లో ఈ వివరాలను ప్రకటించాయి. Samsung M16 లూమినసెంట్‌ మెటీరియల్‌ను ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్‌లో తొలిసారిగా iQOO 16లో ఉపయోగించనున్నారు. అంతేకాకుండా 2K రిజల్యూషన్‌తో పాటు 165Hz రిఫ్రెష్‌ రేట్‌ను అందించే ప్రపంచంలోనే తొలి మొబైల్‌ ప్యానెల్‌గా దీనిని కంపెనీ పేర్కొంది.

ఈ డిస్‌ప్లే 2K అల్ట్రా-హై రిజల్యూషన్‌తో 508 PPI పిక్సెల్‌ డెన్సిటీని కలిగి ఉంటుంది. 165Hz రిఫ్రెష్‌ రేట్‌ కారణంగా స్క్రోలింగ్‌, యానిమేషన్స్‌, గేమింగ్‌ వంటి సందర్భాల్లో మరింత స్మూత్‌ విజువల్స్‌ లభించనున్నాయి. వేగవంతమైన కంటెంట్‌లో మోషన్‌ బ్లర్‌ను తగ్గించేందుకు 100% ప్రారంభ ఫ్రేమ్‌ బ్రైట్‌నెస్‌ రేషియోను కూడా అందించారు.

బ్రైట్‌నెస్‌ విషయంలోనూ iQOO 16 పీక్స్ గా నిలబడనుంది. మాన్యువల్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌ 1,100 నిట్స్‌, గ్లోబల్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌ 2,800 నిట్స్‌గా ఉండగా.. లోకల్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌ ఏకంగా 10,000 నిట్స్‌ వరకు ఉంటుందని కంపెనీ తెలిపింది. అలాగే ట్రై-యాంబియంట్‌ లైట్‌ ఓమ్నిడైరెక్షనల్‌ సెన్సింగ్‌, యాంటీ-రిఫ్లెక్టివ్‌ హై-ట్రాన్స్‌మిటెన్స్‌ స్క్రీన్‌ ప్రొటెక్టర్‌ను అందిస్తున్నారు. కలర్‌ క్వాలిటీని మెరుగుపరిచేందుకు ప్రతి ప్యానెల్‌కు ప్రత్యేకంగా కలర్‌ కాలిబ్రేషన్‌ చేయనున్నారు. దీని వల్ల బ్రైట్‌నెస్‌ యూనిఫార్మిటీ 22%, కలర్‌ యూనిఫార్మిటీ 40% మెరుగుపడుతుందని కంపెనీ చెబుతోంది. 1.24x DCI-P3 కలర్‌ గ్యామట్‌, గేమింగ్‌ కలర్‌ గ్యామట్‌ ఎక్స్‌పాన్షన్‌, ఎండ్‌-టు-ఎండ్‌ ట్రూ కలర్‌ మ్యాపింగ్‌, డాల్బీ విజన్‌ సర్టిఫికేషన్‌ కూడా ఉన్నాయి.

గేమింగ్‌ కోసం టచ్‌ రెస్పాన్స్‌పైనా ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. iQOOకు చెందిన Q-Flex కంట్రోల్‌ టెక్నాలజీ గేమ్‌ ఇంజిన్‌ స్థాయిలో పనిచేస్తుంది. ఇది 500Hz మల్టీ-ఫింగర్‌ టచ్‌ శాంప్లింగ్‌, గరిష్ఠంగా 5,000Hz ఇన్‌స్టాంటేనియస్‌ టచ్‌ శాంప్లింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది. దీంతో గేమింగ్‌లో టచ్‌ లేటెన్సీని తగ్గించే అవకాశం ఉంది. పవర్‌ ఎఫిషియెన్సీ పరంగా కూడా ఈ ప్యానెల్‌లో కీలక మార్పులు చేశారు. 2K LEAD 2.0 డిస్‌ప్లే ఆర్కిటెక్చర్‌ను ఆండ్రాయిడ్‌లో తొలిసారిగా ఉపయోగిస్తున్నట్లు iQOO తెలిపింది. సాధారణ OLED ప్యానెళ్లతో పోలిస్తే 30%, సంప్రదాయ 1.5K డిస్‌ప్లేలతో పోలిస్తే 31% వరకు తక్కువ విద్యుత్‌ వినియోగం ఉంటుందని పేర్కొంది.

కళ్ల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని 3,300Hz హై-ఫ్రీక్వెన్సీ PWM డిమ్మింగ్‌, ఫుల్‌ బ్రైట్‌నెస్‌ DC డిమ్మింగ్‌ ఆప్షన్లను అందిస్తున్నారు. TÜV Rheinland Full Care Display, Non-Polarized Light సర్టిఫికేషన్లు కూడా ఈ డిస్‌ప్లేకు లభించాయి. సంబంధిత ల్యాబొరేటరీ పరీక్షల్లో కంటి ఎర్రదనం 50% మెరుగుదల, టియర్‌ ఫిల్మ్‌/కంటి తేమ 85% మెరుగుదల, సిలియరీ మసిల్‌ టెన్షన్‌ 51% తగ్గుదల నమోదైనట్లు కంపెనీ తెలిపింది.

iQOO 16ను సెప్టెంబర్‌ చివర్లో అధికారికంగా లాంచ్‌ చేయనున్నట్లు కంపెనీ ఇప్పటికే ధృవీకరించింది. ఫోన్‌ ప్రీ-బుకింగ్స్‌ కూడా ప్రారంభమయ్యాయి. లాంచ్‌ తేదీ దగ్గరపడే కొద్దీ iQOO 16కు సంబంధించిన ఇతర స్పెసిఫికేషన్లు, ధర, మార్కెట్‌ లభ్యతపై మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.