iPhone 17e Launch: డైనమిక్ ఐలాండ్, సరికొత్త చిప్.. అతి తక్కువ ధరలో ‘ఐఫోన్ 17ఈ’!

  • 'యాపిల్' లవర్స్‌కు గుడ్ న్యూస్
  • ఫిబ్రవరి 19న ఐఫోన్ 17ఈ విడుదల
  • 17ఈలో డైనమిక్ ఐలాండ్, సరికొత్త చిప్
Iphone 17e Launch

Iphone 17e Launch

iPhone 17e Launch and Price: ప్రముఖ టెక్ దిగ్గజం ‘యాపిల్’ లవర్స్‌కు గుడ్ న్యూస్. ఐఫోన్ ప్రియులతో పాటు సామాన్యులు కూడా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం వచ్చేసింది. ఐఫోన్ 17ఈ (iPhone 17e) స్మార్ట్‌ఫోన్ లాంచ్ డేట్ ఖరారైంది. తాజా లీక్‌ల ప్రకారం.. ఫిబ్రవరి 19న అధికారికంగా ఈ ఫోన్ విడుదల కానుంది. ఈ కొత్త మోడల్‌లో పలు కీలక అప్‌గ్రేడ్స్ ఉండనున్నాయి. డైనమిక్ ఐలాండ్, సరికొత్త చిప్‌తో పాటు బడ్జెట్ ధరలో ఐఫోన్ 17ఈ అందుబాటులోకి రానుంది. ఈ స్మార్ట్‌ఫోన్ లీకైన ఫుల్ డీటెయిల్స్ ఏంటో ఓసారి చూద్దాం.

లీక్ అయిన సమాచారం ప్రకారం.. ఐఫోన్ 17ఈలో డైనమిక్ ఐలాండ్ ఫీచర్ అందుబాటులోకి రానుంది. ఇప్పటివరకు ప్రీమియం మోడళ్లకే పరిమితమైన ఈ ఫీచర్.. 17ఈకి రావడం విశేషం. అంటే ఇకపై పాత నాచ్ ఉండదు. ఇది పెద్ద మార్పుగా చెప్పుకోవచ్చు. అలాగే కొత్తతరం A19 Bionic చిప్ ఇందులో ఉండనుంది. A18 చిప్‌తో పోలిస్తే 5–10 శాతం వరకు వేగంగా పనిచేయనుంది. దాంతో ఫోన్ పనితీరు, పవర్ ఎఫిషియెన్సీ మరింత మెరుగుపడనున్నాయి.

ఐఫోన్ 17ఈ బ్యాటరీలో కూడా పెద్ద అప్‌గ్రేడ్ ఉండే అవకాశాలు ఉన్నాయి. MagSafe ఛార్జింగ్ 25W వరకు సపోర్ట్ చేయనుందని సమాచారం. అంతేకాదు నెట్‌వర్క్ పనితీరును మెరుగుపరచేందుకు యాపిల్ రూపొందించిన C1X మోడెం (2వ తరం), అలాగే కొత్తగా N1 వైర్‌లెస్ నెట్‌వర్క్ చిప్ కూడా ఇందులో అందించనున్నట్లు తెలుస్తోంది. దీంతో కనెక్టివిటీ మరింత స్టేబుల్‌గా, వేగంగా ఉండే అవకాశం ఉంది. అన్ని అప్‌గ్రేడ్స్ మధ్యలో ఒక చిన్న నిరాశ కూడా ఉంది.ఇందులో ఎప్పట్లాగే ఒక్క రియర్ కెమెరా మాత్రమే ఉండనుందని లీక్ స్పష్టం చేస్తోంది. మల్టీ కెమెరా సెటప్ ఆశించిన వారికి ఇది కొంత నిరుత్సాహం కలిగించే అంశమే. 48MP మెయిన్ కెమెరా ఉండనున్నట్లు లీకులు చెబుతున్నాయి.

Also Read: PAK vs NED: టీ20 వరల్డ్‌ కప్‌లో బోణీ కొట్టిన పాకిస్థాన్.. వణికించిన నెదర్లాండ్స్‌!

డిస్‌ప్లే విషయంలో కూడా యాపిల్ రాజీ పడడం లేదు. 6.1 అంగుళాల ఓఎల్‌ఈడీ డిస్‌ప్లేను ఇవ్వనున్నట్లు సమాచారం. బ్రైట్‌నెస్, కలర్ అవుట్‌పుట్ పరంగా ప్రీమియం ఐఫోన్లకు దగ్గరగా ఉండనుంది. ఈ ధర అమెరిలో 599 డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు రూ.60,000) వరకు ఉండొచ్చని అంచనా. మొత్తానికి ఫీచర్లు, పనితీరు పరంగాఐఫోన్ 17ఈ బడ్జెట్ కింగ్‌గా నిలవనుంది. ఫిబ్రవరి 19న జరిగే లాంచ్ ఈవెంట్‌లో యాపిల్ అధికారిక వివరాలను వెల్లడించనుంది. అప్పటివరకు ఈ లీక్‌లు యాపిల్ ఫ్యాన్స్‌లో ఆసక్తిని పెంచుతున్నాయి.