iPhone Air Discount: యాపిల్ అధీకృత ప్రీమియం రిసెల్లర్ అయిన iNvent భారతదేశంలో తన అతిపెద్ద అనుభవాత్మక (Experiential) స్టోర్‌ను ప్రారంభించింది. ఈ స్టోర్ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని, iPhone 17 సిరీస్‌పై ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. ఫ్లాట్ డిస్కౌంట్లు, బ్యాంక్ క్యాష్‌బ్యాక్‌లు, ఉచిత యాక్సెసరీలతో iPhone కొనుగోలుదారులకు ఇది మంచి అవకాశంగా మారింది. కాగా, గత సెప్టెంబర్‌లో భారత్‌లో విడుదలైన iPhone 17 సిరీస్లోని అన్ని మోడళ్లపై ఈ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో భాగంగా యాపిల్ తొలి అల్ట్రా-స్లిమ్ స్మార్ట్‌ఫోన్ అయిన iPhone Airపై భారీ డిస్కౌంట్ లభించనుంది.
Read Also: Sreeleela : తమిళంలో మరో సినిమాకు శ్రీలీల గ్రీన్ సిగ్నల్?
iPhone Airపై భారీ ఆఫర్..
* ప్రస్తుతం iPhone Air ధర రూ.1,19,900గా ఉంది. అయితే, iNvent స్టోర్‌లో కొనుగోలు చేస్తే రూ.24,000 డిస్కౌంట్ లభిస్తుంది. ఇందులో Axis, ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డులపై రూ.4,000 ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్ తో పాటు రూ.7,500 విలువైన ఉచిత యాక్సెసరీలు ఉన్నాయి. ఈ ఆఫర్లతో iPhone Airని కేవలం రూ.95,900కే పొందవచ్చు. అయితే, iPhone Air కొనుగోలు చేయాలనుకుంటున్న వారికి ఇది సరైన సమయంగా చెప్పొచ్చు.. దీని పనితీరు ఫ్లాగ్‌షిప్ కంటే ఎక్కువగా లైఫ్‌స్టైల్ ఫోన్ గా యాపిల్ రూపొందించింది.
iPhone Air ఫీచర్లు
* iPhone Airలో 6.5 అంగుళాల Super Retina XDR డిస్‌ప్లే, 120Hz ProMotion, Always-On డిస్‌ప్లే, Dynamic Island లాంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. స్లిమ్ టైటానియం బాడీతో ఇది చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. A19 Pro చిప్‌తో ఇది గేమింగ్‌కు సరిపోతుంది కానీ దీర్ఘకాలం ఉపయోగిస్తే కొంత హీట్ అవుతుంది. 3,149mAh బ్యాటరీ పరిమిత బ్యాకప్ ఇస్తుంది. 48MP సింగిల్ కెమెరా మంచి ఫోటోలు ఇస్తుంది.. కానీ అల్ట్రా-వైడ్, టెలిఫోటో లెన్స్‌లు ఇందులో లేవు. స్లిమ్ ఐఫోన్ కోరుకునేవారికి ఇది మంచి ఎంపిక అని చెప్పొచ్చు.
Read Also: The Paradise : ప్యారడైజ్’లో మరో సర్‌ప్రైజ్ పాత్ర..!
iPhone 17, iPhone 17 Proపై ఆఫర్లు
* iPhone 17: రూ.82,900 నుంచి రూ.74,900కే (రూ.8,000 డిస్కౌంట్- ఇందులో రూ.4,000 బ్యాంక్ ఆఫర్)
* iPhone 17 Pro: రూ.1,34,900 నుంచి రూ.1,23,900కే (రూ.4,000 బ్యాంక్ క్యాష్‌బ్యాక్) అయితే, ఈ రెండు ఫోన్లకు కూడా రూ.7,500 విలువైన ఉచిత యాక్సెసరీలు దొరుకుతాయి. కొత్తగా విడుదలైన సిరీస్ కావడంతో ఈ ఆఫర్లు వినియోగదారులకు మరింత ఆకర్షణీయంగా మారనున్నాయి.
ఇతర యాపిల్ ఉత్పత్తులపై డిస్కౌంట్లు
* MacBook Air M4: 20 శాతం డిస్కౌంట్ (రూ.10,000 క్యాష్‌బ్యాక్)
* విద్యార్థులకు 23 శాతం డిస్కౌంట్ + ఉచిత USB హబ్ (రూ.7,500)
* iPad A16: 7 శాతం డిస్కౌంట్, విద్యార్థులకు 10 శాతం డిస్కౌంట్ + రూ.3,000 క్యాష్‌బ్యాక్
* Apple Watch: 5 శాతం డిస్కౌంట్ + రూ.2,000 క్యాష్‌బ్యాక్ + ఉచిత బ్యాండ్ (రూ.1,500)
ఎక్కడ లభిస్తాయి ఈ ఆఫర్లు?
iPhone 17 సిరీస్ ఆఫర్లు దేశవ్యాప్తంగా అన్ని iNvent స్టోర్లలో అందుబాటులో ఉన్నాయి. కానీ, iPhone Airతో పాటు ఇతర ప్రీమియం ఆఫర్లు మాత్రం ఢిల్లీ పితాంపురాలోని iNvent స్టోర్‌లో మాత్రమే లభిస్తాయి. ప్రస్తుతం అధికారిక Apple Store, Amazon, Flipkart లాంటి ఈ-కామర్స్ ప్లాట్‌ఫాంలలో డిస్కౌంట్లు లేకపోవడంతో, ఈ iNvent స్టోర్ ఆఫర్లు వినియోగదారులకు మంచి అవకాశం. స్టోర్‌లో హ్యాండ్స్-ఆన్ డెమో జోన్లు, డేటా ట్రాన్స్‌ఫర్, యాక్టివేషన్, ఆఫ్టర్ సేల్స్ సపోర్ట్ లాంటి సేవలు కూడా అందుబాటులో ఉంటాయి.
