Infinix Hot 70 Pro 5G: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఇన్ఫినిక్స్ (Infinix) భారత్‌లో Infinix Hot 70 Pro 5G లాంచ్ తేదీని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఈ స్మార్ట్‌ఫోన్ సెప్టెంబర్ 4న మధ్యాహ్నం 12 గంటలకు భారత మార్కెట్లోకి రానుంది. ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఈ ఫోన్ అమ్మకాలు జరగనున్నాయి. కంపెనీ అధికారిక భారత వెబ్‌సైట్‌లో కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
భారత మార్కెట్‌లో ఈ మొబైల్ 4 విభిన్న కలర్ ఆప్షన్లలో తీసుకురానున్నారు. డైవ్ బ్లూ, మిరాజ్ గ్రీన్, సిల్క్ గ్లో పర్పుల్, థెర్మో ఆరంజ్ రంగుల్లో ఈ ఫోన్ లభించనుంది. ప్రతి వేరియంట్‌కు ప్రత్యేకమైన డిజైన్ ట్రీట్‌మెంట్‌ను అందించారు. థెర్మో ఆరంజ్ వేరియంట్ ఉష్ణోగ్రత మార్పులకు అనుగుణంగా రంగులో మార్పును చూపిస్తుంది. మిరాజ్ గ్రీన్ వేరియంట్ తక్కువ వెలుతురులో తన రూపాన్ని మార్చుకునేలా రూపొందించారు. ఇంకా సిల్క్ గ్లో పర్పుల్ వేరియంట్‌లో షిఫ్టింగ్ టెక్స్చర్ ఉంటుంది. అలాగే డైవ్ బ్లూ వేరియంట్ మ్యాట్ ఫినిష్‌తో వస్తుంది.
ఫ్లిప్‌కార్ట్‌లోని టీజర్ వివరాల ప్రకారం ఇందులో 6.76 అంగుళాల Full HD+ డిస్‌ప్లే ఉంటుంది. ఈ స్క్రీన్ 144Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేయనుంది. దీంతో స్క్రోలింగ్, గేమింగ్, వీడియో కంటెంట్ వంటి వాటిని మరింత స్మూత్‌గా ఆస్వాదించవచ్చు. ఈ ఫోన్ మందం కేవలం 7.85mmగా ఉండనుంది. స్లిమ్ డిజైన్‌ను ఫోన్‌లోని ప్రధాన ప్రత్యేకతల్లో ఒకటిగా కంపెనీ హైలైట్ చేస్తోంది.
కెమెరా విషయానికి వస్తే ఇందులో.. వెనుక Active Matrix Cube (AMC) అనే ప్రత్యేకమైన LED వ్యవస్థను అందించారు. ఇది నోటిఫికేషన్లు, వివిధ విజువల్ ఎఫెక్ట్స్‌ను చూపించేలా ఉంటుంది. వినియోగదారులు దీన్ని తమకు అనుగుణంగా కస్టమైజ్ చేసుకునే అవకాశం ఉండనుంది. భారత్‌లో విడుదలయ్యే మోడల్‌కు సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్లను ఇన్ఫినిక్స్ ఇంకా వెల్లడించలేదు. అయితే ఇప్పటికే కొన్ని గ్లోబల్ మార్కెట్లలో అందుబాటులో ఉన్న వెర్షన్ స్పెసిఫికేషన్లనే ఇండియన్ వేరియంట్‌లోనూ కొనసాగిస్తే.. MediaTek Dimensity 7100 5G చిప్‌సెట్ ఉండే అవకాశం ఉంది. అలాగే 8GB వరకు RAM, 256GB స్టోరేజ్ లభించే అవకాశం ఉంది. కెమెరా విభాగంలో 50MP మెయిన్ రియర్ కెమెరా, 8MP ఫ్రంట్ కెమెరా ఉండొచ్చని అంచనా. దుమ్ము, నీటి నుంచి రక్షణ కోసం IP68 రేటింగ్ కూడా లభించే అవకాశం ఉంది.
గ్లోబల్ మార్కెట్లలో Infinix Hot 70 Pro 5Gను 5,600mAh లేదా 6,000mAh బ్యాటరీ ఆప్షన్లతో విక్రయిస్తున్నారు. మార్కెట్‌ను బట్టి బ్యాటరీ సామర్థ్యంలో మార్పు ఉంటుంది. దీనికి 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. అయితే భారత వేరియంట్‌లో ఇదే బ్యాటరీ, ఛార్జింగ్ స్పెసిఫికేషన్లు ఉంటాయా లేదా అనేది లాంచ్ సమయంలో స్పష్టమవుతుంది. భారత మార్కెట్లో సెప్టెంబర్ 4న మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ కానుంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన ప్రత్యేక మైక్రోసైట్ కూడా అందుబాటులో ఉంది. ధర, పూర్తి స్పెసిఫికేషన్లు, ఇతర ఫీచర్లను కంపెనీ లాంచ్‌కు ముందు దశలవారీగా వెల్లడించనుంది.

