Bandar Apna Dost: ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వ్యూస్ సాధించిన యూట్యూబ్ ఛానల్ భారత్‌కు చెందినదేనని వెల్లడైంది. వీడియో ఎడిటింగ్ ప్లాట్‌ఫామ్ కాప్‌వింగ్ (Kapwing) నిర్వహించిన తాజా అధ్యయనంలో ఈ విషయం బయటపడింది. ప్రపంచంలోని వివిధ దేశాల్లో ట్రెండింగ్‌లో ఉన్న టాప్ 100 యూట్యూబ్ ఛానళ్లను పరిశీలించగా, పూర్తిగా ఏఐ (AI) సృష్టించిన వీడియోలపైనే ఆధారపడే వందలాది ఛానళ్లను గుర్తించింది. భారతీయ యూట్యూబ్ ఛానల్ “బందర్ అప్నా దోస్త్” ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. ఈ ఛానల్‌లో వాస్తవికంగా కనిపించే ఒక కోతిని ప్రధాన పాత్రగా చూపిస్తూ.. మానవుల్లా భావోద్వేగాలు, హాస్యం, డ్రామా కలగలిసిన కథలను ఏఐ యానిమేషన్ రూపంలో చూపిస్తారు. చిన్నచిన్న మార్పులతో ఒకే తరహా కథలు వందల వీడియోలుగా విడుదలవుతుంటాయి.
READ MORE: MSVG : గుంటూరులో మెగా సంబరాలు.. వెంకీ మామ, చిరు ఫ్యాన్స్ కు అదిరిపోయే ట్రీట్..!
2025 చివరి నాటికి, బందర్ అప్నా దోస్త్ ఛానల్‌కు మొత్తం 2.07 బిలియన్ వ్యూస్ వచ్చాయని, ప్రకటనల ద్వారా ఏటా సుమారు 4.25 మిలియన్ డాలర్ల ఆదాయం వస్తున్నట్లు అంచనా వేసింది. భారతీయ ప్రేక్షకులు ఈ తరహా కంటెంట్‌ను విపరీతంగా వీక్షించడంతో ఇలాంటి ఛానళ్లకు భారీ వ్యూస్ వస్తున్నాయి. అయితే, యూట్యూబ్‌లో ఏఐ వీడియోల పెరుగుదలపై విస్తృత చర్చ కూడా జరుగుతోంది. మానవ కంటెంట్ క్రియేటర్లు పలువురు, తక్కువ శ్రమతో తయారయ్యే ఏఐ స్పామ్ వీడియోలు నాణ్యమైన కంటెంట్‌ను నాశనం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆందోళన కాప్‌వింగ్ నివేదికలో కూడా స్పష్టంగా కనిపించింది. యూట్యూబ్‌లో ముఖ్యంగా షార్ట్స్ ఫీడ్‌లు, ట్రెండింగ్ విభాగాల్లో “AI స్లాప్” (తక్కువ శ్రమతో ఏఐ ద్వారా తయారై, వ్యూస్ కోసం మాత్రమే రూపొందించిన కంటెంట్) వేగంగా పెరుగుతోందని కాప్‌వింగ్ పేర్కొంది.
READ MORE: 2025 Crimes Rewind: గోల్డ్ స్మగ్లింగ్ దగ్గర నుంచి హనీమూన్ మర్డర్ వరకు..! ఈ ఏడాది క్రైమ్ సీన్స్ ఇవే!
