హువావే తన సరికొత్త ట్యాబ్లెట్ మేట్‌ప్యాడ్ 12 X (Huawei MatePad 12 X)ను గ్లోబల్ మార్కెట్‌లో విడుదల చేసింది. గత నెలలో చైనాలో మేట్‌ప్యాడ్ ఎయిర్ 12 పేరుతో ఇది లాంచ్ అయ్యింది. ఈ ట్యాబ్లెట్ పూర్తి మెటల్ బాడీతో కేవలం 555 గ్రాముల బరువు, అలాగే కేవలం 5.9 మి.మీ. సన్నగా ఉంటుంది. ఇందులో 12 అంగుళాల 2.8K 144Hz LCD స్క్రీన్ ఉంది. దీనికి TÜV రైన్‌ల్యాండ్ లో బ్లూ లైట్ సర్టిఫికేషన్ లభించింది.
6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో బడ్జెట్ సెగ్మెంట్‌లో Redmi 15C 5G లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా!
ఈ కొత్త ట్యాబ్లెట్‌లో అల్ట్రా క్లియర్ పేపర్‌మ్యాట్ డిస్‌ప్లే ఉంది. ఇది హై ప్రెసిషన్ నానోస్కేల్ యాంటీ గ్లేర్ ఎచింగ్ టెక్నాలజీతో రూపొందించబడింది. ఇది స్క్రీన్ ఉపరితలంపై వెలుతురును 50% మేర తగ్గిస్తుంది. ఇది పేపర్ లాంటి టచ్ అనుభూతిని ఇస్తుందని కంపెనీ పేర్కొంది. అలాగే ఇది బయటి వాతావరణంలో ఉపయోగించడానికి అనువుగా ఉంటుందని హువావే తెలిపింది. ఈ ట్యాబ్లెట్ అడ్వాన్స్‌డ్ 3D హీట్ డిస్సిపేషన్ ఆర్కిటెక్చర్‌ను కలిగి ఉంది. అధిక ఉష్ణ వాహకత కలిగిన గ్రాఫైట్, ప్రత్యేక 3D వేపర్ ఛాంబర్ (VC) ఉపయోగించి వేడిని సమర్థవంతంగా స్క్రీన్, వెనుక షెల్‌కు పంపిస్తుంది. దీనివల్ల పనితీరు 27% పెరుగుతుందని కంపెనీ వెల్లడించింది.
X Account Hack: ఎవర్రా మీరంతా.. ఏకంగా డిప్యూటీ సీఎం ఎక్స్ అకౌంట్‌నే హ్యాక్ చేశారు!
హువావే మేట్‌ప్యాడ్ 12 X (2025) ఫీచర్లు:
స్క్రీన్: 12 అంగుళాల 2.8K (2800 × 1840 పిక్సెల్స్) 144Hz (VRR: 30Hz-144Hz) LCD స్క్రీన్, 1000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్.
ర్యామ్, స్టోరేజ్: 12GB ర్యామ్, 256GB స్టోరేజ్.
ఆపరేటింగ్ సిస్టమ్: హార్మొనీఓఎస్ 4.3.
కెమెరా: వెనుకవైపు 50MP HD కెమెరా (f/1.8 అపెర్చర్), ముందువైపు 8MP HD కెమెరా (f/2.2 అపెర్చర్).
కొలతలు, బరువు: 183 x 270 x 5.9 మి.మీ., బరువు 555 గ్రాములు.
కనెక్టివిటీ: Wi-Fi 7, బ్లూటూత్ 5.2, USB 3.1 GEN1తో టైప్-C పోర్ట్.
బ్యాటరీ: 10100mAh, 66W ఫాస్ట్ ఛార్జింగ్.
యాక్సెసరీస్: హువావే స్మార్ట్ మాగ్నెటిక్ కీబోర్డ్, M-పెన్సిల్ ప్రో.
రంగులు: గ్రీనరీ, వైట్
ధర: 12GB + 256GB మోడల్ ధర 649.99 యూరోలు (రూ. 67,265).
