108MP+50MP సెల్ఫీ కెమెరా, 6000mAh బ్యాటరీతో రాబోతున్న HMD Vibe 2 Max..!

  • హెచ్‌ఎండీ వైబ్ 2 మ్యాక్స్‌కు సంబంధించిన స్పెసిఫికేషన్లు లీక్
  • 6.78 అంగుళాల ఎఫ్‌హెచ్‌డీ+ ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే
  • యూనిసాక్ T9100 ప్రాసెసర్
  • 108MP ప్రధాన కెమెరా + 8MP సెకండరీ కెమెరా, సెల్ఫీల కోసం 50MP ఫ్రంట్ కెమెరా
  • 6,000mAh బ్యాటరీ, 33W ఫాస్ట్ ఛార్జింగ్..
Ind Vs Wi

Ind Vs Wi

HMD Vibe 2 Max: స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో Vibe 2 సిరీస్‌ను మరింత పెంచేందుకు HMD భారీగా ప్లాన్ చేస్తుంది. తాజాగా HMD Vibe 2 Max పేరుతో మరో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చే అవకాశం ఉందని సమాచారం. లీకైన సమాచారం ప్రకారం.. ఈ ఫోన్‌కు సంబంధించిన రెండర్లు, కీలక స్పెసిఫికేషన్లను వెల్లడయ్యాయి. సెప్టెంబర్ చివరిలో భారత్‌లో విడుదలైన HMD Vibe 2 Pro 5G కంటే మెరుగైన మోడల్‌గా ఇది వచ్చే అవకాశం ఉంది.

లీకైన వివరాల ప్రకారం.. HMD Vibe 2 Maxలో 6.78 అంగుళాల FHD+ IPS LCD డిస్‌ప్లే ఉండనుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో పాటు గరిష్ఠంగా 1,500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను అందించనున్నట్లు సమాచారం. డిస్‌ప్లే పరిమాణం, రిఫ్రెష్ రేట్ పరంగా Vibe 2 Pro 5Gతో సమానంగా ఉండనున్నప్పటికీ, ఇతర విభాగాల్లో కీలక అప్‌గ్రేడ్స్ కనిపించనున్నాయి. ఇంకా ఇందులో 2.7GHz క్లాక్ స్పీడ్ కలిగిన Unisoc T9100 ప్రాసెసర్ ఉండనున్నట్లు లీక్ పేర్కొంది. దీనికి 8GB ర్యామ్, 256GB ఇంటర్నల్ స్టోరేజ్ జతకానున్నాయి. కెమెరా విభాగంలో వెనుక 108MP ప్రధాన కెమెరా, 8MP సెకండరీ కెమెరాతో డ్యూయల్ కెమెరా సెటప్ ఉండనున్నట్లు సమాచారం. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో ఏకంగా 50MP కెమెరా ఉండొచ్చని లీక్స్ చెబుతున్నాయి. బ్లాక్, రెడ్, గ్రీన్ కలర్ ఆప్షన్లలో రానుంది.

మరోవైపు Vibe 2 Pro 5Gలో MediaTek Dimensity 6300 ప్రాసెసర్‌తో గరిష్ఠంగా 8GB ర్యామ్, 128GB స్టోరేజ్ అందుబాటులో ఉంది. అంటే Max మోడల్‌లో స్టోరేజ్ రెట్టింపు కానుంది. అలాగే ఇందులో 64MP Sony IMX682 ప్రధాన కెమెరా, 2MP మాక్రో కెమెరా, 13MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. బ్యాటరీ విషయానికి వస్తే, ఇందులో 6,000mAh బ్యాటరీ, 33W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండనున్నట్లు సమాచారం. సాఫ్ట్‌వేర్ పరంగా ఆండ్రాయిడ్ 16తో వచ్చే అవకాశం ఉంది. అలాగే IP64 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్, Wi-Fi 6, 5G, NFC, Bluetooth 5.2, డ్యూయల్ స్పీకర్లు, సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్ వంటి ఫీచర్లు ఉండనున్నట్లు లీక్ పేర్కొంది. ఫోన్ వెనుక భాగంలో ఎగువ ఎడమవైపు రెక్టాంగ్యులర్ కెమెరా మాడ్యూల్ ఉండగా, అందులో రెండు కెమెరాలు, LED ఫ్లాష్ ఉన్నాయి.