HMD Asha 305: HMD Asha 305 విడుదల.. 2GB RAM, 16GB స్టోరేజ్, 4Gతో చౌకైన స్మార్ట్‌ఫోన్

  • HMD Asha 305 విడుదల
  • 2GB RAM, 16GB స్టోరేజ్
  • 5 అంగుళాల డిస్‌ప్లే
Hmd Asha 305

Hmd Asha 305

నోకియా ఆశా సిరీస్ ఒకప్పుడు బడ్జెట్ ఫోన్ మార్కెట్‌లో ఎంతో ప్రజాదరణ పొందింది. ఇప్పుడు ఆ పేరును మరోసారి మార్కెట్‌లోకి తీసుకొస్తూ HMD Asha 305ను విడుదల చేసింది. HMD Global రూపొందించిన ఈ కొత్త బేసిక్ స్మార్ట్‌ఫోన్‌లో 4G కనెక్టివిటీతో పాటు ఆధునిక ఫీచర్లను అందించారు. పాత Nokia Asha ఫోన్లతో పోలిస్తే కొత్త HMD Asha 305లో డిజైన్, ఆపరేటింగ్ సిస్టమ్, కెమెరా, కనెక్టివిటీ వంటి అంశాల్లో అనేక మార్పులు ఉన్నాయి. ప్రస్తుతం ఈ ఫోన్‌ను ఫిలిప్పీన్స్ మార్కెట్‌లో మాత్రమే విడుదల చేశారు.

HMD Asha 305 ధర ఎంత?

HMD Asha 305ను ఫిలిప్పీన్స్‌లో PHP 3,990 ధరకు విడుదల చేశారు. భారత కరెన్సీలో ఇది సుమారు రూ.6,225కు సమానం. ఈ ఫోన్ గ్రీన్, బ్లాక్ అనే రెండు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ప్రస్తుతం ఫిలిప్పీన్స్ మార్కెట్‌కే పరిమితమైనప్పటికీ, త్వరలో ఇతర మార్కెట్లలో కూడా విడుదలయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. బడ్జెట్ విభాగంలో ఈ ఫోన్ Infinix, itel, Tecno వంటి బ్రాండ్ల ఎంట్రీ-లెవల్ స్మార్ట్‌ఫోన్లకు పోటీగా నిలిచే అవకాశం ఉంది.

5 అంగుళాల డిస్‌ప్లే

HMD Asha 305లో 5-అంగుళాల LCD డిస్‌ప్లేను అందించారు. ఇది 480×854 పిక్సెల్స్ రిజల్యూషన్ ను కలిగి ఉంది. బడ్జెట్ ఫోన్ కావడంతో డిస్‌ప్లే స్పెసిఫికేషన్లు ప్రాథమిక స్థాయిలో ఉన్నప్పటికీ, కాల్స్, మెసేజింగ్, సోషల్ మీడియా, వీడియోలు వంటి సాధారణ అవసరాలకు సరిపడేలా ఉంది. పనితీరు కోసం ఈ ఫోన్‌లో Unisoc T137 చిప్‌సెట్ ను ఉపయోగించారు. దీనికి 2GB RAM, 16GB ఇంటర్నల్ స్టోరేజ్ జత చేశారు. స్టోరేజ్ తక్కువగా అనిపించినప్పటికీ, microSD కార్డ్ ద్వారా స్టోరేజ్‌ను మరింత విస్తరించుకునే అవకాశం ఉంది.

2MP కెమెరాలు

ఫోటోగ్రఫీ కోసం వెనుకవైపు LED ఫ్లాష్‌తో కూడిన 2MP కెమెరాను అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు కూడా 2MP కెమెరా ఉంది. బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌గా సాధారణ ఫోటోలు, వీడియో కాలింగ్ వంటి అవసరాలకు ఈ కెమెరాలు ఉపయోగపడేలా ఉన్నాయి.

Pulse OS ఆపరేటింగ్ సిస్టమ్

HMD Asha 305లో ప్రత్యేకంగా Pulse OSను అందించారు. ఇది AOSP Android ఆధారిత ఆపరేటింగ్ సిస్టమ్‌గా పేర్కొన్నారు. ఈ ఫోన్‌లో సోషల్ మీడియా, చాటింగ్ సహా 100కు పైగా యాప్‌లు ముందుగానే ఇన్‌స్టాల్ చేసి అందిస్తున్నారు. దీంతో వినియోగదారులు ప్రతి యాప్‌ను విడిగా డౌన్‌లోడ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. Facebook, Instagram, WhatsApp, TikTok వంటి ప్రముఖ యాప్‌ల Lite వెర్షన్లు కూడా ఇందులో ముందుగానే అందుబాటులో ఉంటాయి.

2,500mAh బ్యాటరీ

HMD Asha 305లో 2,500mAh రిమూవబుల్ బ్యాటరీను అందించారు. ఇది USB Type-C పోర్ట్ ద్వారా ఛార్జ్ అవుతుంది. రిమూవబుల్ బ్యాటరీ ఉండటం ఈ ఫోన్‌లో ప్రత్యేకమైన అంశంగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం చాలా స్మార్ట్‌ఫోన్లలో బ్యాటరీని తొలగించే అవకాశం ఉండదు.

డ్యూయల్ 4G సిమ్ సపోర్ట్

కనెక్టివిటీ పరంగా HMD Asha 305లో డ్యూయల్ 4G SIM సపోర్ట్ ఉంది. దీనితో పాటు:

Wi-Fi
Bluetooth
GPS
3.5mm హెడ్‌ఫోన్ జాక్
USB Type-C వంటి కనెక్టివిటీ ఆప్షన్లు ఉన్నాయి.

పాత Nokia Ashaతో పోలిస్తే ఏం మారింది?

పాత Nokia Asha ఫోన్లతో పోలిస్తే HMD Asha 305లో ప్రధానంగా 4G కనెక్టివిటీ, స్మార్ట్‌ఫోన్ తరహా ఆపరేటింగ్ సిస్టమ్, టచ్‌స్క్రీన్, సోషల్ మీడియా యాప్‌లు, Wi-Fi, GPS వంటి ఆధునిక ఫీచర్లు ఉన్నాయి. పాత Asha ఫోన్లు ప్రధానంగా ఫీచర్ ఫోన్ అనుభవాన్ని అందించగా, కొత్త HMD Asha 305 మాత్రం తక్కువ ధరలో ప్రాథమిక స్మార్ట్‌ఫోన్ అనుభవాన్ని అందించడంపై దృష్టి పెట్టింది.