Site icon NTV Telugu

27 గంటల బ్యాటరీ లైఫ్‌, IP54 రేటింగ్తో Google Pixel Buds 2a లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా!

Google Pixel Buds 2a

Google Pixel Buds 2a

Google Pixel Buds 2a: తాజగా గూగుల్ నిర్వహించిన Made by Google 2025 ఈవెంట్‌లో గూగుల్ తన పిక్సెల్ 10 సిరీస్ స్మార్ట్‌ఫోన్లు, పిక్సెల్ వాచ్ 4తో పాటు, కొత్తగా గూగుల్ పిక్సెల్ బడ్స్ 2aను కూడా మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ ట్రూలీ వైర్‌లెస్ స్టీరియో (TWS) హెడ్‌సెట్ ఒకసారి ఛార్జ్ చేసిన తర్వాత ఛార్జింగ్ కేస్‌తో కలిపి గరిష్టంగా 27 గంటల బ్యాటరీ లైఫ్ అందిస్తుందని కంపెనీ పేర్కొంది. ఇందులో యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) టెక్నాలజీతో పాటు సైలెంట్ సీల్ 1.5 అనే ప్రత్యేక ఫీచర్ ఉంది. ఇది వినియోగదారుడి చెవులకు సౌకర్యవంతంగా సరిపోయేలా ఆటోమేటిక్‌గా అడ్జస్ట్ అవుతుంది. ఇదే ఫీచర్ ప్రస్తుతం పిక్సెల్ బడ్స్ ప్రో 2లో కూడా ఉంది.

ధర, లభ్యత:
గూగుల్ పిక్సెల్ బడ్స్ 2a ధర భారతదేశంలో రూ.12,999గా నిర్ణయించారు. ఇవి హేజల్, ఐరిస్ కలర్ ఆప్షన్లలో అందుబాటులోకి వచ్చాయి. భారత్‌లో ఇవి ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. అలాగే, పిక్సెల్ బడ్స్ ప్రో 2ను రూ.22,900 ధరతో విక్రయిస్తున్నారు. ఇవి ఇప్పటికే హేజల్, పియోనీ, పోర్సిలైన్, వింటర్‌గ్రీన్ కలర్స్‌లో లభ్యమయ్యాయి. ఇప్పుడు కొత్తగా మూన్‌స్టోన్ షేడ్లో కూడా అందుబాటులోకి వచ్చాయి. త్వరలో ఇవి అడాప్టివ్ ఆడియో సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ సపోర్ట్‌ను పొందనున్నాయి.

40 గంటల బ్యాటరీ లైఫ్, IP68 సర్టిఫికేషన్, AI ఆధారిత Google Pixel Watch 4 లాంచ్..!

ఫీచర్లు:
కొత్త పిక్సెల్ బడ్స్ 2aలో 11mm డైనమిక్ డ్రైవర్స్, గూగుల్ స్వయంగా రూపొందించిన టెన్సర్ A1 చిప్ ను ఉపయోగించారు. ఇవి అడాప్టివ్ ANC, ట్రాన్స్‌పరెన్సీ మోడ్, అలాగే సైలెంట్ సీల్ 1.5 ఫీచర్‌ను సపోర్ట్ చేస్తాయి. వినియోగదారులకు ఇన్-ఇయర్ ప్రెజర్ రిలీఫ్ కూడా అందిస్తాయి. ఇక ఇందులో కనెక్టివిటీ సంబంధించిన వివరాలను చూస్తే.. బ్లూటూత్ 5.4 సపోర్ట్, డ్యుయల్ మైక్రోఫోన్స్, స్పష్టమైన కాల్స్ కోసం విండ్బ్లాక్ మెష్ కవర్లు, IR ప్రాక్సిమిటీ సెన్సార్ (ఇన్-ఇయర్ డిటెక్షన్), కెపాసిటివ్ టచ్ కంట్రోల్స్, మాగ్నెటిక్ ఛార్జింగ్ కేస్ (హాల్ సెన్సార్, USB Type-C పోర్ట్‌తో) వస్తుంది.

బ్యాటరీ లైఫ్:
బ్యాటరీ లైఫ్ పరంగా గూగుల్ పిక్సెల్ బడ్స్ 2a మంచి పనితీరు అందిస్తాయి. ఛార్జింగ్ కేస్‌తో కలిపి ANC ఆఫ్‌లో గరిష్టంగా 27 గంటల వరకు మ్యూజిక్ వినిపిస్తాయి. ANC ఆన్‌లో అయితే సుమారు 20 గంటలు పనిచేస్తాయి.ఇవి ఒకసారి పూర్తి ఛార్జ్ చేసినప్పుడు ANC ఆన్‌లో 7 గంటలు, ANC ఆఫ్‌లో 10 గంటలు ఉపయోగించుకోవచ్చు.

Jio Recharge: యూజర్లకు ‘జియో’ మరో షాక్.. రూ.799 ప్లాన్‌కూ చరమగీతం!

డిజైన్, డ్యూరబిలిటీ:
డిజైన్ అండ్ డ్యూరబిలిటీ విషయానికి వస్తే.. ఈ బడ్స్‌కి IP54 రేటింగ్ ఉండటంతో డస్ట్ మరియు స్ప్లాష్ రెసిస్టెన్స్ కలిగి ఉంటాయి. కేస్‌కి మాత్రం IPX4 రేటింగ్ ఉండటం వల్ల స్ప్లాష్ ప్రూఫ్ రక్షణ లభిస్తుంది. ఒక్కో ఇయర్‌బడ్ బరువు కేవలం 4.7 గ్రాములు మాత్రమే ఉండగా, మొత్తం కేస్‌తో కలిపి బరువు 47.6 గ్రాములుగా ఉంది.

Exit mobile version