AI ఫీచర్లు, Intel Core Ultra ప్రాసెసర్లతో Dell XPS 13, Dell 14S, Dell 16S, Alienware 15 ల్యాప్‌టాప్‌లు లాంచ్..!

Dell

Dell

Dell XPS 13, Dell 14S, Dell 16S, Alienware 15: డెల్ (Dell) భారత మార్కెట్లో కొత్త ప్రీమియం ల్యాప్‌టాప్ పోర్ట్‌ఫోలియోను మరింత పెంచింది. కంపెనీ Dell XPS 13, Dell 14S, Dell 16S, Alienware 15 ల్యాప్‌టాప్‌ లను అధికారికంగా విడుదల చేసింది. AI ఆధారిత పనితీరు, అత్యాధునిక Intel Core Ultra ప్రాసెసర్లు, OLED డిస్‌ప్లేలు, Wi-Fi 7 కనెక్టివిటీ వంటి ప్రీమియం ఫీచర్లతో ఈ ల్యాప్‌టాప్‌లు అందుబాటులోకి వచ్చాయి.

Dell XPS 13:

13.4 అంగుళాల 2.5K InfinityEdge టచ్ డిస్‌ప్లే, 30Hz నుంచి 120Hz వరకు వేరియబుల్ రిఫ్రెష్ రేట్, 500 నిట్స్ బ్రైట్‌నెస్, 100% DCI-P3 కలర్ గామట్‌ను అందించారు. Intel Core Series 3 ప్రాసెసర్‌తో పాటు తర్వాత Intel Core Ultra Series 3 వేరియంట్ కూడా రానుంది. గరిష్టంగా 32GB LPDDR5X RAM, 1TB SSD స్టోరేజ్, Wi-Fi 7, Bluetooth 6.0, Dolby Atmos క్వాడ్ స్పీకర్లు, 52Wh బ్యాటరీతో 17 గంటల వరకు స్ట్రీమింగ్ బ్యాటరీ లైఫ్‌ను కంపెనీ ప్రకటించింది. దీని ప్రారంభ ధర రూ.79,990గా నిర్ణయించారు.

Dell 14S, Dell 16S:

ఈ ల్యాప్‌టాప్‌లు Intel Core Ultra Series 3 లేదా AMD Ryzen AI 400 Series ప్రాసెసర్లతో అందుబాటులోకి వచ్చాయి. AI పనుల కోసం 50 TOPS వరకు NPU పనితీరును అందిస్తాయి. Dell 14Sలో FHD+ OLED డిస్‌ప్లే, Dell 16Sలో 2.8K OLED టచ్ డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, Dolby Vision, 100% DCI-P3 కలర్ గామట్ ఉన్నాయి. Dell 14S ప్రారంభ ధర రూ.1,19,990 కాగా, Dell 16S ధర రూ.2,29,990 నుంచి మొదలవుతాయి.

Alienware 15:

గేమింగ్ ప్రియుల కోసం ఈ ల్యాప్‌టాప్‌ ను విడుదల చేసింది. ఇందులో Intel Core 7 (Series 2) 240H ప్రాసెసర్, NVIDIA GeForce RTX 5060 GPU, 15.3 అంగుళాల WUXGA 165Hz డిస్‌ప్లే, అడ్వాన్స్‌డ్ థర్మల్ కూలింగ్ సిస్టమ్ ఉన్నాయి. USB-C, HDMI 2.1, RJ45 Ethernet వంటి పలు కనెక్టివిటీ పోర్ట్‌లను అందించారు. ఈ ల్యాప్‌టాప్ ప్రారంభ ధర రూ.1,28,990గా ఉన్నాయి.

కొత్త ల్యాప్‌టాప్‌లపై డెల్ పలు లాంచ్ ఆఫర్లను కూడా ప్రకటించింది. XPS 13, Dell 14S, Dell 16S కొనుగోలుపై రూ.5,000 వరకు క్యాష్‌బ్యాక్, జీరో డౌన్ పేమెంట్ ఫైనాన్స్, ఏడాది పాటు McAfee సెక్యూరిటీ సబ్‌స్క్రిప్షన్ అందిస్తున్నారు. Alienware 15పై ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులతో 10% వరకు (గరిష్టంగా రూ.10,000) క్యాష్‌బ్యాక్ తోపాటు 12, 24 నెలల నో-కాస్ట్ EMIతో పాటు Alienware 25 320Hz Gaming Monitorను ప్రత్యేక ధర రూ.9,999కు కొనుగోలు చేసే అవకాశం కల్పించారు.