ప్రముఖ టెక్నాలజీ సంస్థ డెల్ (Dell) భారత మార్కెట్లో కొత్త Alienware 15 గేమింగ్ ల్యాప్‌టాప్‌ను విడుదల చేసింది. అత్యుత్తమ గేమింగ్ అనుభవాన్ని అందించేందుకు రూపొందించిన ఈ ల్యాప్‌టాప్‌లో AMD Ryzen ప్రాసెసర్లు, NVIDIA GeForce RTX 4050 GPU, 165Hz డిస్‌ప్లే, అలాగే ప్రత్యేక Alienware Cryo-Tech కూలింగ్ సిస్టమ్ వంటి అధునాతన ఫీచర్లను అందించారు.
Dell Alienware 15 ధర
భారత్‌లో Alienware 15 ప్రారంభ ధర రూ.1,15,990గా నిర్ణయించారు. ఈ ల్యాప్‌టాప్ Nova Black కలర్‌లో అందుబాటులో ఉంది. వినియోగదారులు డెల్ అధికారిక వెబ్‌సైట్, డెల్ ఎక్స్‌క్లూజివ్ స్టోర్లు, అలాగే Amazon, Flipkart వంటి ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ప్రీ-ఆర్డర్ చేసుకోవచ్చు. అంతేకాకుండా, ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులతో కొనుగోలు చేస్తే 10 శాతం వరకు (గరిష్టంగా రూ.10,000) క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను కూడా కంపెనీ ప్రకటించింది.
డిస్‌ప్లే
Alienware 15లో 15.3-అంగుళాల WUXGA (1920×1200 పిక్సెల్స్) డిస్‌ప్లేను అందించారు. 165Hz రిఫ్రెష్ రేట్, 300 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్, స్మూత్ గేమింగ్ అనుభవం.
ప్రాసెసర్, GPU
ఈ గేమింగ్ ల్యాప్‌టాప్‌లో.. AMD Ryzen 5 220, AMD Ryzen 7 260 ప్రాసెసర్ ఆప్షన్లు ఉన్నాయి.
గ్రాఫిక్స్ కోసం:
NVIDIA GeForce RTX 3050 Laptop GPU
NVIDIA GeForce RTX 4050 Laptop GPU ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే Intel Core 5 210H, Intel Core 7 240H వేరియంట్లను ఈ నెలాఖరులో విడుదల చేయనున్నట్లు కంపెనీ తెలిపింది.
కూలింగ్, స్టెల్త్ మోడ్
గేమింగ్ సమయంలో ల్యాప్‌టాప్ వేడెక్కకుండా ఉండేందుకు Alienware Cryo-Tech Cooling Systemను అందించారు. అదనంగా Stealth Mode ఫీచర్ ద్వారా వినియోగదారులు Performance Mode నుంచి Quiet Modeకు మారి ఫ్యాన్ శబ్దాన్ని తగ్గించుకోవచ్చు.
కనెక్టివిటీ
Wi-Fi
Bluetooth
HDMI
1 USB Type-C పోర్ట్
2 USB Type-A పోర్టులు
3.5mm హెడ్‌సెట్ జాక్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి.
బ్యాటరీ, ఇతర ఫీచర్లు
ఈ ల్యాప్‌టాప్‌లో కాన్ఫిగరేషన్‌ను బట్టి 54Wh లేదా 70Wh బ్యాటరీ అందుబాటులో ఉంటుంది.
ExpressCharge
ExpressCharge Boost
720p HD వెబ్‌క్యామ్
డ్యూయల్ మైక్రోఫోన్లు
మల్టీటచ్ టచ్‌ప్యాడ్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.
పరిమాణం, బరువు
కొలతలు: 349.5 × 250.3 × 20.7 మి.మీ.
బరువు: సుమారు 2.25 కిలోలు

