డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, పెర్ఫార్మన్స్.. ఐఫోన్ నుంచి గెలాక్సీ వరకు.. బెస్ట్ Foldable Phones ఇవే..!

Best Foldable Phones

Best Foldable Phones

Best Foldable Phones: ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి గతంలో కంటే ఇప్పుడు అనేక కొత్త ఆప్షన్లు అందుబాటులోకి వచ్చాయి. ఒకప్పుడు ఈ విభాగంలో శాంసంగ్ గాలక్సీ Z ఫోల్డ్, Z ఫ్లిప్ సిరీస్‌లదే హవా ఉండగా.. ఇప్పుడు ఆపిల్, గూగుల్, హానర్ వంటి కంపెనీలు కూడా ప్రీమియం ఫోల్డబుల్ ఫోన్లతో పోటీని మరింత పెంచాయి. పెద్ద ఫోల్డింగ్ డిస్‌ప్లే, మల్టీటాస్కింగ్, కెమెరాలు, బ్యాటరీ లైఫ్, సాఫ్ట్‌వేర్ అనుభవం వంటి అంశాల్లో ఒక్కో ఫోన్ ఒక్కో ప్రత్యేకతను అందిస్తోంది. మరి వినియోగదారుల కొనుగోలుకు పరిగణించదగిన ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ల వివరాలను ఇక్కడ చూద్దాం.

Samsung Galaxy Z Fold 8 Ultra

ప్రీమియం బుక్ స్టైల్ ఫోల్డబుల్ కోరుకునే వారికి శాంసంగ్ Galaxy Z Fold 8 Ultra ప్రధాన ఆప్షన్లలో ఒకటిగా ఉంటుంది. ఇందులో 8 అంగుళాల మెయిన్ ఫోల్డబుల్ డిస్‌ప్లే, 6.5 అంగుళాల కవర్ స్క్రీన్ ఉన్నాయి. రెండు డిస్‌ప్లేలు 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తాయి. మెయిన్ స్క్రీన్ గరిష్ఠంగా 3,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. ఈ ఫోన్‌లో స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ఫర్ గాలక్సీ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. 12GB లేదా 16GB ర్యామ్‌తో పాటు గరిష్ఠంగా 1TB స్టోరేజ్ లభిస్తుంది. Android 17 ఆధారిత One UI 9తో పనిచేస్తుంది. కెమెరాల విషయానికి వస్తే 200MP మెయిన్ కెమెరా, 50MP అల్ట్రా-వైడ్, 3x జూమ్‌తో 10MP టెలిఫొటో కెమెరా ఉన్నాయి. రెండు డిస్‌ప్లేలపై 10MP సెల్ఫీ కెమెరాలు అందించారు. 5,000mAh బ్యాటరీతో వచ్చే ఈ ఫోన్ 45W వైర్డ్, 20W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.

Apple iPhone Duo

ఆపిల్ తన తొలి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ ఐఫోన్ డ్యూవోతో ఈ విభాగంలోకి అడుగుపెట్టింది. ఐఓఎస్ అనుభవాన్ని పెద్ద ఫోల్డింగ్ స్క్రీన్‌పై కోరుకునే యూజర్లను లక్ష్యంగా చేసుకుని దీన్ని తీసుకొచ్చింది. iPhone Duoలో 7.6 అంగుళాల ఫోల్డబుల్ OLED మెయిన్ డిస్‌ప్లే, 5.4 అంగుళాల ఔటర్ OLED డిస్‌ప్లే ఉన్నాయి. రెండూ 120Hz ProMotionతో పాటు 3,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌కు సపోర్ట్ చేస్తాయి. లోపలి స్క్రీన్‌పై గ్లేర్‌ను తగ్గించేందుకు నానో-టెక్స్చర్ ఫినిష్‌ను ఉపయోగించారు.

ఫ్రేమ్, హింజ్ కవర్‌లో గ్రేడ్-5 టైటానియం ఉపయోగించగా, ముందు, వెనుక భాగాల్లో Ceramic Shield రక్షణ ఉంది. IP68 రేటింగ్ కూడా లభిస్తుంది. ఫోన్ బరువు 254 గ్రాములు. ఫోల్డ్ చేసినప్పుడు 11.3mm, ఓపెన్ చేసినప్పుడు 5.2mm మందం ఉంటుంది. ఇందులో Face IDకు బదులుగా సైడ్ బటన్‌లో Touch ID అందించారు. ఫిజికల్ సిమ్ స్లాట్ లేకుండా పూర్తిగా eSIM ఆధారంగా పనిచేస్తుంది. ఆపిల్ పెన్సిల్ సపోర్ట్ కూడా తర్వాత అందుబాటులోకి రానుంది.

Honor Magic V6

భారీ బ్యాటరీ కావాలనుకునే ఫోల్డబుల్ ఫోన్ యూజర్లకు Honor Magic V6 బెస్ట్ ఆప్షన్. గ్లోబల్ వేరియంట్‌లో ఏకంగా 6,660mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీ అందించారు. ఇది 80W వైర్డ్, 66W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్‌లో Snapdragon 8 Elite Gen 5 ప్రాసెసర్‌తో పాటు 16GB ర్యామ్ ఉంది. 7.95 అంగుళాల మెయిన్ డిస్‌ప్లే, సుమారు 6.5 అంగుళాల కవర్ స్క్రీన్‌ను అందించారు. ఆండ్రాయిడ్ 16 ఆధారిత MagicOS 10పై పనిచేస్తుంది. డ్యూరబిలిటీ విషయంలో IP68, IP69 రేటింగ్స్ ఉన్నాయి. హింజ్‌ను 5 లక్షల ఫోల్డ్స్ వరకు పరీక్షించినట్లు కంపెనీ చెబుతోంది. కెమెరా విభాగంలో 50MP మెయిన్, 50MP అల్ట్రా-వైడ్, 3x ఆప్టికల్ జూమ్‌తో 64MP పెరిస్కోప్ టెలిఫొటో కెమెరాలు ఉన్నాయి. రెండు డిస్‌ప్లేలపై 20MP సెల్ఫీ కెమెరాలను అందించారు.

Google Pixel 11 Pro Fold

గూగుల్ సాఫ్ట్‌వేర్ అనుభవం, ఎక్కువ కాలం అప్‌డేట్స్ కోరుకునే వారికి గూగుల్ పిక్సెల్ 11 ప్రో ఫోల్డ్ మరో ప్రీమియం ఆప్షన్. ఇందులో టెన్సర్ G6 చిప్‌తో పాటు అన్ని వేరియంట్లలో 16GB ర్యామ్ లభిస్తుంది. ఆండ్రాయిడ్ 17తో వచ్చే ఈ ఫోన్‌కు ఏడు సంవత్సరాల పాటు ఓఎస్ అప్‌డేట్స్, సెక్యూరిటీ అప్‌డేట్స్, పిక్సెల్ డ్రాప్స్ అందిస్తామని గూగుల్ తెలిపింది. ఇందులో 8 అంగుళాల మెయిన్ ఫోల్డబుల్ డిస్‌ప్లే, 6.5 అంగుళాల కవర్ స్క్రీన్ ఉన్నాయి. రెండు స్క్రీన్లు గరిష్ఠంగా 3,600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ అందిస్తాయి. 4,806mAh బ్యాటరీతో వచ్చే ఈ ఫోన్ 30W వైర్డ్ ఛార్జింగ్, గరిష్ఠంగా 25W Qi2.2 మాగ్నెటిక్ వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. కెమెరాల విషయానికి వస్తే 48MP మెయిన్, 10.5MP అల్ట్రా-వైడ్, 5x ఆప్టికల్ జూమ్‌తో 10.8MP టెలిఫొటో కెమెరా ఉన్నాయి.

Samsung Galaxy Z Flip 8

పెద్ద టాబ్లెట్ తరహా ఫోల్డబుల్ అవసరం లేకుండా కాంపాక్ట్ ఫోన్ కావాలనుకునే వారికి Samsung Galaxy Z Flip 8 మంచి ప్రత్యామ్నాయం. ఫోన్‌ను మధ్యలో మడిచి చిన్న సైజులో తీసుకెళ్లగలగడం దీని ప్రధాన ఆకర్షణ. ఇందులో 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.9 అంగుళాల మెయిన్ డిస్‌ప్లే, 4.1 అంగుళాల కవర్ స్క్రీన్ ఉన్నాయి. ఫోన్ బరువు 180 గ్రాములు. ఓపెన్ చేసినప్పుడు మందం 6.1mm మాత్రమే. Armor Aluminum ఫ్రేమ్‌తో పాటు IP48 రేటింగ్ ఉంది. 4,300mAh బ్యాటరీ 25W వైర్డ్, 15W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. వెనుక భాగంలో 50MP మెయిన్ కెమెరా, 12MP అల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నాయి. మార్కెట్‌ను బట్టి Snapdragon 8 Elite Gen 5 for Galaxy లేదా Exynos 2600 ప్రాసెసర్‌తో ఈ ఫోన్ లభిస్తుంది. Android 17 ఆధారిత One UI 9తో పనిచేస్తుంది.

ఏ ఫోల్డబుల్ ఫోన్ ఎవరికి?

పెద్ద స్క్రీన్, మల్టీటాస్కింగ్, శక్తివంతమైన కెమెరాలు కావాలంటే Galaxy Z Fold 8 Ultra బెస్ట్ ఛాయస్. ఐఓఎస్ ఎకోసిస్టమ్‌లోనే ఫోల్డబుల్ అనుభవం కోరుకునేవారు ఐఫోన్ ను పరిశీలించవచ్చు. భారీ బ్యాటరీకి ప్రాధాన్యం ఇచ్చేవారికి హానర్ మ్యాజిక్ V6, గూగుల్ సాఫ్ట్‌వేర్‌తో దీర్ఘకాల అప్‌డేట్స్ కోరుకునేవారికి పిక్సెల్ 11 ప్రో ఫోల్డ్ ఉపయోగకరమైన ఎంపికలు. కాంపాక్ట్ ఫోల్డబుల్ కావాలంటే గాలక్సీ Z ఫ్లిప్ 8 ప్రత్యేకంగా నిలుస్తుంది.