Site icon NTV Telugu

AI Impact on Jobs: ఆంత్రోపిక్ షాకింగ్ రిపోర్ట్.. కోడింగ్ నుంచి సేల్స్ వరకు ఈ టాప్ 10 కెరీర్లు ముగిసినట్టే..!

Ai Impact Jobs

Ai Impact Jobs

AI Impact on Jobs: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రోజు వారి జీవితంలో భాగమవుతోంది. ఏఐతో ఇప్పటికే అనేక రకాల ఉద్యోగాలు ప్రమాదంలో పడ్డాయి. కొంత మంది ఉద్యోగులు రోడ్డున పడ్డారు. కృత్రిమ మేధ (Artificial Intelligence – AI) భవిష్యత్తులో ఉద్యోగాల స్వరూపాన్ని గణనీయంగా మార్చబోతోందా? అనే చర్చకు ఇప్పుడు ఫుల్‌స్టాప్ పడింది. అసలు ప్రశ్నల్లా ఆ మార్పు ఎంత వేగంగా వస్తుందనేదే! తాజాగా ఓపెన్ ఏఐ అధినేత సామ్ ఆల్ట్‌మన్ మాటలు, ఆంత్రోపిక్ సంస్థ విడుదల చేసిన గణాంకాలు చూస్తుంటే.. మనం ఊహించిన దానికంటే ముందే ప్రపంచ పనితీరు సమూలంగా మారిపోనుందని అర్థమవుతోంది. ఏఐ ఇప్పుడు కేవలం మనుషులకు సాయం చేసే దశ నుంచి, స్వయంగా కొత్త శాస్త్రీయ జ్ఞానాన్ని కనిపెట్టే స్థాయికి, క్లిష్టమైన ఆర్థిక నిర్ణయాలు తీసుకునే సామర్థ్యానికి చేరుకుందని ఓపెన్ ఏఐ సీఈవో సామ్ ఆల్ట్ మన్ తెలిపారు. ముఖ్యంగా కోడింగ్ వంటి రంగాలు 2025 ఆరంభంతో పోలిస్తే ఇప్పుడు పూర్తిగా కొత్త రూపును సంతరించుకున్నాయని అభిప్రాయపడ్డారు. ఈ ప్రభావం వల్ల ఉద్యోగాలు రాత్రికి రాత్రే మాయమైపోతాయని అనుకోవడం లేదు.. కానీ.. పదే పదే చేసే పనులు (Repetitive tasks), ఒక పద్ధతి ప్రకారం సాగే పనులు (Structured tasks) ఇకపై పూర్తిగా మెషిన్ల వశం కాక తప్పదని హెచ్చరిస్తున్నారు. ఈ వాదనలను బలాన్ని చేకూరుస్తూ ‘ఆంత్రోపిక్’ సంస్థ ఒక ఆసక్తికరమైన జాబితాను బయటపెట్టింది. ఏఐ ప్రభావం అత్యధికంగా పడబోయే టాప్-10 వృత్తులపై క్లారిటీ ఇచ్చింది. ఈ పది రంగాలను ఏఐ శాసిస్తుందని ఎంత శాతం ఉద్యోగాలు బలి అవుతారు అనే వివరాలను పంచుకుంది.

READ MORE: Vaazha 2 : బడ్జెట్ రూ. 10 కోట్లు.. కలెక్షన్స్ రూ. 100 కోట్లు మలయాళంలో సెకండ్ హిట్ అందుకున్న సాహు గారపాటి

ఆంత్రోపిక్ సంస్థ చేసిన విశ్లేషణ ప్రకారం ఈ క్రింది 10 కెరీర్లు ఏఐ వల్ల ఎక్కువగా ప్రభావితం కానున్నాయి:

కంప్యూటర్ ప్రోగ్రామర్ (74.5%): కోడ్ రాయడం, మెయింటెనెన్స్ చేయడం ఇప్పుడు ఏఐ టూల్స్‌కు చాలా సులభంగా మారింది.
కస్టమర్ సర్వీస్ (70%+): ఫిర్యాదులు, ఆర్డర్ ప్రాసెసింగ్ వంటి పనులను చాట్‌బాట్‌లు సమర్థవంతంగా నిర్వహిస్తున్నాయి.
డేటా ఎంట్రీ (67.1%): ఈ రకమైన పనులను ఏఐ వేగంగా, తప్పులు లేకుండా చేస్తోంది.
మెడికల్ రికార్డ్ స్పెషలిస్ట్: రోగుల డేటాను క్రమబద్ధీకరించడంలో ఏఐ నైపుణ్యం సాధించింది.
మార్కెట్ రీసెర్చ్ అనలిస్ట్ (64.8%): డేటా విశ్లేషణ, నివేదికల తయారీ ఇప్పుడు ఆటోమేషన్ దిశగా సాగుతున్నాయి.
మార్కెటింగ్ స్పెషలిస్ట్: మార్కెటింగ్ క్యాంపెయిన్లు, డేటా హ్యాండ్లింగ్‌లో ఏఐ ప్రమేయం పెరిగింది.
హోల్‌సేల్ & మాన్యుఫ్యాక్చరింగ్ సేల్స్: ఆర్డర్ మేనేజ్‌మెంట్‌లో ఆటోమేషన్ టూల్స్ వినియోగం పెరుగుతోంది.
ఫైనాన్షియల్ అనలిస్ట్ (57%+): ఆర్థిక గణాంకాల విశ్లేషణలో ఏఐ ఇప్పుడు మనుషులకు గట్టి పోటీనిస్తోంది.
సాఫ్ట్‌వేర్ టెస్టర్ (52%): క్వాలిటీ అస్యూరెన్స్ పనులను ఇప్పుడు ఆటోమేటెడ్ టూల్స్ చూసుకుంటున్నాయి.
సైబర్ సెక్యూరిటీ & ఐటీ సపోర్ట్: ఇక్కడ ముప్పు కొంత తక్కువగా ఉన్నప్పటికీ, ఆటోమేషన్ ప్రభావం నెమ్మదిగా మొదలైంది.

 

Exit mobile version