AI Dating Trend: ప్రేమలో పడటానికి ఎదురుగా ఒక మనిషి ఉండక్కర్లేదు.. కేవలం ఒక యాప్ ఉంటే చాలు. వినడానికి వింతగా ఉన్నా, ఇప్పుడు అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఇదే హాట్ టాపిక్. ఒకప్పుడు సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో మాత్రమే చూసిన సీన్లు ఇప్పుడు ‘ఎవా ఏఐ కేఫ్’ (Eva AI Cafe) రూపంలో కళ్లముందు సాక్షాత్కరిస్తున్నాయి. అసలు ఏంటి కథ అనేది ఈస్టోరీలో తెలుసుకుందాం
READ ALSO: PM Modi: కొత్త పీఎంఓ ‘‘సేవా తీర్థ్’’ను ప్రారంభించిన ప్రధాని మోడీ..
‘ఎవా ఏఐ కేఫ్’..
న్యూయార్క్‌లోని ప్రసిద్ధ ‘హెల్స్ కిచెన్’ పరిసరాల్లో వ్యాలెంటైన్స్ డే సందర్భంగా ప్రారంభమైన ఈ పాప్-అప్ కేఫ్, ప్రపంచంలోనే సరికొత్త ప్రయోగానికి వేదికైంది. ఇక్కడ కాఫీ తాగడానికి వచ్చే కస్టమర్ల ముందు మనుషులు ఉండరు. బదులుగా వారి టేబుల్ మీద ఉన్న మొబైల్ స్టాండ్‌లో ఒక స్మార్ట్‌ఫోన్ ఉంటుంది. అందులో AI భాగస్వామి (AI Companion) ఉంటుంది. కస్టమర్లు తమ స్మార్ట్‌ఫోన్ వైపు చూస్తూ ముచ్చట్లు చెబుతూ కాఫీ తాగుతున్నారు.
ఎందుకు ప్రజలు ఈ వింత డేటింగ్ వైపు మొగ్గు చూపుతున్నారు? అనే ప్రశ్నకు వినియోగదారుల నుంచి ఆసక్తికర సమాధానాలు వస్తున్నాయి..
నో జడ్జిమెంట్: “నేను ఏం మాట్లాడినా అవతలి వ్యక్తి ఏమనుకుంటారో” అనే భయం ఇక్కడ ఉండదు. AI మీ మాటలను తీర్పు ఇవ్వకుండా వింటుంది.
తిరస్కరణ భయం లేదు: మనుషుల మధ్య డేటింగ్ అంటే రిజెక్షన్ లేదా ‘ఘోస్టింగ్’ వంటి భయాలు ఉంటాయి. కానీ AI ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది.
ఒత్తిడి లేకుండా, తమ మనసులోని భావాలను పంచుకోవడానికి ఇది ఒక సురక్షితమైన ప్రదేశంగా కొంతమంది భావిస్తున్నారు.
ఈ కేఫ్‌ను సందర్శించే వారిలో రెండు వర్గాల వాళ్లు ఉన్నారు. కొందరు మొదటి నుంచీ AI చాట్‌బాట్‌లతో పరిచయం ఉన్నవారు కాగా, మరికొందరు కేవలం క్యూరియాసిటీ కొద్దీ వచ్చే నెటిజన్లు. ఇక్కడ వినియోగదారులు తమకు నచ్చిన విధంగా AI భాగస్వామిని అక్కడికక్కడే క్రియేట్ చేసుకునే సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. దీనిపై నిపుణులు మాట్లాడుతూ.. టెక్నాలజీ ఒంటరితనాన్ని పోగొట్టడానికి ఒక సాధనంగా మారుతోంది. అయితే, ఇది మానవ సంబంధాలకు ప్రత్యామ్నాయం కాకూడదని అభిప్రాయపడ్డారు.
ఆందోళన కలిగిస్తున్న అంశాలు ఇవే..
ఈ ట్రెండ్ ఎంత సరదాగా అనిపిస్తున్నా, సామాజిక నిపుణులు కొన్ని హెచ్చరికలు చేస్తున్నారు. మనుషులు క్రమంగా నిజమైన భావోద్వేగాలకు దూరమై, మెషీన్లపై ఆధారపడటం వల్ల సామాజిక సంబంధాలు దెబ్బతినే ప్రమాదం ఉంటుందని ఆందోళన చెందుతున్నారు. న్యూయార్క్‌లోని ఈ పాప్-అప్ కేఫ్ ప్రస్తుతం కొన్ని రోజులు మాత్రమే అందుబాటులో ఉంది. కానీ ఇది సృష్టించిన చర్చ మాత్రం అంతర్జాతీయ స్థాయికి చేరింది.
