HONOR WIN: గేమింగ్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో హానర్ మూడు కొత్త ఫోన్లను విడుదల చేసింది. చైనాలోని హాంగ్జౌలో నిర్వహించిన ‘HONOR WIN Gaming Universe Carnival’ ఈవెంట్లో HONOR WIN 2, HONOR WIN RT2, HONOR WIN Turbo2 మోడళ్లను పరిచయం చేసింది. అధిక రిఫ్రెష్ రేట్ డిస్ప్లే, భారీ బ్యాటరీలు, శక్తివంతమైన ప్రాసెసర్లు, ప్రత్యేక కూలింగ్ సిస్టమ్ వీటి ప్రధాన ప్రత్యేకతలు.
HONOR WIN 2 ఈ సిరీస్‌లో ఫ్లాగ్షిప్ మోడల్. ఇందులో 2nm Snapdragon 8 Elite Extreme Gen 6 చిప్‌సెట్‌ను అందించారు. ఇది 5.01GHz వరకు క్లాక్ స్పీడ్‌తో పనిచేస్తుంది. LPDDR5X Ultra RAM, UFS 4.1 స్టోరేజ్‌తో వస్తుంది. కంపెనీ ల్యాబ్ పరీక్షల ప్రకారం AnTuTuలో 57,02,964 స్కోర్ సాధించింది. AI ఆధారిత గ్రాఫిక్స్ రెండరింగ్, రే ట్రేసింగ్ కోసం Honor Phantom Engineను అందించారు. అలాగే WIN RT2లో Snapdragon 8 Elite ప్రాసెసర్, LPDDR5X RAM, UFS 4.1 స్టోరేజ్ ఉన్నాయి. దీర్ఘకాలిక గేమింగ్ సమయంలో 2K 185Hz ఫ్రేమ్ రేట్‌ను స్థిరంగా అందించేందుకు ప్రత్యేక AI రెండరింగ్ టెక్నాలజీని ఉపయోగించారు. ఇక WIN Turbo2లో Snapdragon 8s Gen 4 చిప్సెట్తో పాటు E2 ఎనర్జీ మేనేజ్మెంట్ చిప్ ఉంది. ఇందులో ఫ్యాన్‌లెస్ కూలింగ్ సిస్టమ్‌ను అందించారు.
ఈ మూడు ఫోన్లలోనూ 2K 185Hz Oasis డిస్ప్లే టెక్నాలజీ ఉంది. 40కి పైగా గేమ్స్‌లో హై ఫ్రేమ్ రేట్‌కు సపోర్ట్ చేస్తుంది. WIN Display చిప్, 5,920Hz PWM డిమ్మింగ్, 5,000Hz ఇన్స్టంట్ టచ్ శాంప్లింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. Turbo2 డిస్ప్లే గరిష్ఠంగా 10,000 నిట్స్ బ్రైట్నెస్ను, కనిష్టంగా 1 నిట్ వరకు డిమ్మింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. గేమింగ్ సమయంలో ఫోన్ వేడెక్కకుండా WIN 2, WIN RT2లో Dongfeng Twin Star Turbine Cooling Systemను అందించారు. ఇందులో డ్యూయల్ ఫ్యాన్లు నిమిషానికి 1.19 CFM వరకు గాలిని ప్రసారం చేస్తాయి. సాధారణ సింగిల్ ఫ్యాన్ కూలింగ్‌తో పోలిస్తే హీట్ డిసిపేషన్ 150 శాతం మెరుగ్గా ఉంటుందని హానర్ చెబుతోంది.
బ్యాటరీ విషయంలోనూ ఈ ఫోన్లు ప్రత్యేకంగా నిలుస్తాయి. WIN 2లో 10,100mAh బ్యాటరీతో పాటు 100W వైర్డ్, 80W వైర్లెస్ ఛార్జింగ్ ఉంది. WIN RT2, WIN Turbo2లో ఏకంగా 12,070mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీలను అమర్చారు. Turbo2లో 90W ఫాస్ట్ ఛార్జింగ్, 27W రివర్స్ వైర్డ్ ఛార్జింగ్, బైపాస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి. కెమెరాల విషయానికి వస్తే.. WIN 2, WIN RT2లో 200MP ప్రధాన కెమెరాలు, 12MP అల్ట్రా-వైడ్ కెమెరాలు, 50MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. WIN Turbo2లో 50MP Sony మెయిన్ కెమెరా, 12MP అల్ట్రా-వైడ్, 50MP సెల్ఫీ కెమెరా ఇచ్చారు.
డిజైన్ పరంగా WIN 2, WIN RT2లో మెటల్ ఫ్రేమ్, 0.93mm సిమెట్రికల్ బెజెల్స్, వెనుక భాగంలో ‘WIN Energy Ring’ లైటింగ్ ఉన్నాయి. మూడు మోడళ్లూ IP68, IP69, IP69K రేటింగ్‌లతో దుమ్ము, నీరు, అధిక ఒత్తిడి నీటి జెట్ల నుంచి రక్షణను అందిస్తాయి. MagicOS 11తో పనిచేస్తాయి. ధర విషయానికి వస్తే.. HONOR WIN Turbo2 ధర 3,199 యువాన్ల నుంచి (సుమారు రూ.45,309) ప్రారంభమవుతుంది. WIN RT2 ధర 4,199 యువాన్ల నుంచి (సుమారు రూ.59,375), WIN 2 ధర 5,499 యువాన్ల నుంచి (సుమారు రూ.77,760) మొదలవుతుంది. గరిష్ఠంగా WIN 2 16GB + 1TB వేరియంట్ ధర 7,999 యువాన్లు (సుమారు రూ.1,13,110)గా ఉంది. ఈ మూడు ఫోన్లు ప్రస్తుతం చైనాలో అమ్మకానికి అందుబాటులో ఉన్నాయి.

