‘సీతారామం’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయింది మృణాల్ ఠాకూర్. ఆ సినిమాలో దుల్కర్ సల్మాన్ సరసన సీత పాత్రలో నటించి తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకుంది మృణాల్. ఆ చిత్ర విజయంతో తెలుగులో వరుసగా హాయ్ నాన్న, ది ఫ్యామిలీ స్టార్ వంటి చిత్రాలలో నటించి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయింది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఇటీవల వచ్చిన కల్కి సినిమాలో అతిథి పాత్రలో కనిపించింది.. ఇది ఇలా ఉంటే ఈ భామ హిందీ చిత్రాలలో…
టాలీవుడ్ చరిత్రలో గొప్ప గొప్ప చిత్రాలను తెరకెక్కించిన దర్శకుల్లో కోడి రామకృష్ణ ఒకరు. తెలుగు చిత్ర సీమ గురువుగారు అంటూ పిలుచుకునే దర్శకరత్న దాసరి నారాయణరావు శిష్యుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు కోడి రామకృష్ణ. విజయవంతమైన చిత్రాలను రూపొందిస్తూ ఒక్కో సినిమాకు ఒక్కో మెట్టుకు ఎక్కుతూ శతాధిక దర్శకుడిగా పేరు తెచ్చుకుని గురువుకి తగ్గ శిష్యుడిగా పేరు సంపాదించుకున్నారు. ప్రతాప్ ఆర్ట్ ప్రొడక్షన్స్ అధినేత కె.రాఘవ నిర్మాతగా రూపొందించిన తొలి చిత్రం ‘ఇంట్లో రామయ్య వీధిలో…
మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం ‘విశ్వంభర’. బింబిసారతో సూపర్ హిట్ కొట్టిన డైరెక్టర్ వశిష్ట చిరు చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. మెగాస్టార్ కు జోడిగా అందాల భామ త్రిష నటిస్తోంది. సోషియో ఫాంటసీ నేపథ్యంలో రానున్న ఈ చిత్రాన్నియువి క్రియేషన్స్ అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తుంది. ప్రస్తుతం ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. మ్యూజిక్ సిట్టింగ్స్ ఇటీవల ప్రారంభించారు ఆస్కార్ విన్నర్ MM కీరవాణి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్ చిత్రంపై మరిన్ని అంచనాలు…
టాలివుడ్ లో ఈ ఏడాది విడుదలై అత్యధిక గ్రాస్ కలెక్ట్ చేసిన చిత్రాలలో హనుమాన్ ముందు వరుసలో ఉంటుంది. తేజ సజ్జా హీరోగా, విలక్షణ దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రాన్ని ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి నిర్మించాడు. చిన్న చిత్రంగా విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని నమోదు చేసింది. ఇప్పుడు ఈ చిత్రానికి కొనసాగింపుగా జై…
ఈ ఏడాది సంక్రాంతికి విడులైన సినిమాలలో హనుమాన్ ఒకటి. తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రాన్ని ప్రైమ్ షో ఎంటెర్టైనమెంట్స్ బైనర్ పై నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మించారు. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా బాషలలో విడుదలయిన ఈ చిత్రం అన్ని భాషలలోను సూపర్ హిట్ సాధించి 2024 సంక్రాతి హిట్ గా నిలిచింది. చిన్న సినిమాగా విడుదలై సంచలన విజయం సాధించింది హనుమాన్. ప్రపంచ వ్యాప్తంగా ఎవరు…
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహించిన చిత్రం రాయన్. ధనుష్ కెరీర్ లో 50వ చిత్రంగా రాయన్ రానుంది. టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ ఈ చిత్రంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. SJ సూర్య ప్రతి కథానాయకుడిగా నటిస్తున్నాడు. ఇప్పటికి విడుదలైన ఈ చిత్ర టీజర్, సాంగ్స్ ప్రేక్షకుల్లో విశేష స్పందన దక్కిచుకుంది. కాగా రాయన్ తెలుగులో విడుదల కానున్న నేపథ్యంలో టాలీవుడ్ లో ప్రమోషన్స్ స్పీడ్ పెంచాడు ధనుష్. ఇందులో…
తెలుగు సినిమా ఇప్పుడు వరల్డ్ సినిమాగా మారిపోయింది. బాహుబలి నుండి తెలుగు సినిమాలను నిర్మించే విధానం, సినిమా స్టాండర్డ్స్ మొత్తం మారిపోయాయి. థియేట్రికల్ రైట్స్ తో పాటు ఓటీటీ వంటి సంస్థలు రావడంతో నిర్మాతలకు వాటి రూపంలో ఆదాయం రావడం మొదలైంది. కోవిడ్ కారణంగా, చిన్న,పెద్ద అని తేడా లేకుండా ఇబ్బడి ముబ్బడిగా సినిమాలు తీసి ఓటీటీలకు సేల్ చేసి సొమ్ము చేసుకున్నారు. కానీ పోస్ట్ కొవిడ్ తర్వాత పరిస్థితులు పూర్తిగా మారాయి. నేడు ఓటీటీ సంస్థలు…
నేచురల్ స్టార్ నాని హీరోగా, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వచ్చిన దసరా ఘన విజయం సాధించింది. తెలంగాణా నేపథ్యంలో సాగే కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం నాని కెరీర్ లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. పక్కా మాస్ మసాలా ఫార్ములాతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల. శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి దసరా చిత్రాన్ని దాదాపు రూ .75 కోట్లతో నిర్మించాడు. ఏడాది తర్వాత దసరా కు సిక్వెల్…
హీరో కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “క”. సుజీత్ – సందీప్ అనే ఇద్దరు నూతన దర్శకులు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. హిట్లు లేక సతమతమవుతున్న కిరణ్ ‘క’ సినిమాపై ఎన్నో అంచనాలు పెట్టుకొన్నాడు. ఈ సారి రొటీన్ మాస్ కథలు కాకుండా సాలిడ్ సబ్జెక్టుతో వస్తున్నాడు. ఇటీవల ఈ చిత్రం నుండి విడుదలైన టీజర్ మంచి ఫీడ్ బ్యాక్ దక్కించుకుంది. దీంతో ఈ చిత్ర థియేట్రికల్ రైట్స్ కోసం పోటీ నెలకొంది.…