Site icon NTV Telugu

Story Board: దేశంలో పెరిగిపోతున్న రోడ్డు ప్రమాదాలు.. నిర్లక్ష్యంతో పోతున్న నిండు ప్రాణాలు

Sb

Sb

Story Board: వరుస రోడ్డు ప్రమాదాలు తెలుగు రాష్ట్రాలను భయపెడుతున్నాయి. ఒక విషాదం నుంచి తేరుకోక ముందే మరో ఘోరం వెంటాడుతోంది. దీంతో ఇంటి నుంచి బయట­కు వెళ్లిన వారు క్షేమంగా ఇంటికి వస్తా­రా అనే నమ్మకం లేని పరిస్థితులు కనిపిస్తున్నాయి.

Read Also: Cyber Crime : సైబర్ ముఠా రహస్యాలు వెలుగులోకి.. బిగ్‌ ఆపరేషన్‌..!

కర్నూలులో జరిగిన ఘోర విషాద ఘటన మర్చిపోక ముందే మరో ఘోర ఘటన తెలుగు ప్రజలను తీవ్ర శోకంలో ముంచేసింది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం 21 మంది చనిపోయారు. నెత్తుటి రహదారి అనే ముద్ర పడిన హైదరాబాద్ బీజాపూర్ జాతీయ రహదారి నంబర్ 163 పైనే ఈ ఘోర విషా­దం చోటు చేసుకోవడం స్థానిక ప్రజలకు ఆందోళన కలిగిస్తోంది. హైదరాబాద్ నుంచి కర్నాటకలోని బీజాపూర్ వరకు 365 కి.మీ ఉండే ఈ ఎన్‍హెచ్ 163 అంటేనే రక్తం మరిగిన రహదా­రి అనే పేరు పడిపోయింది. ఎక్కడ చూసినా గుంతలు, ఇరుకు రోడ్లు, మూల మలుపులతో ఆ రోడ్డుపై ప్రమాదాలతో ఈ రహదారి మృత్యువుకు కేరాఫ్ అడ్రస్ గా మారింది.

Read Also: SSMB 29 : ఫస్ట్ టైమ్ అలాంటి పని చేస్తున్న జక్కన్న.. మహేశ్ ఫ్యాన్స్ టెన్షన్

రెండు ఘటనల్లోనూ ఓవర్ స్పీడ్ ప్రధాన కారణంగా ఉంది. డ్రైవర్ల అతివేగంతో ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో అతివేగంతో జరిగే మరణాలు ఎక్కువగా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ నివేదిక ప్రకారం, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అంతటా హైవేలలో ప్రతి రోజూ సగటున 15 మంది అతివేగం కారణంగా మరణిస్తున్నారు. 2023లో మాత్రమే, రెండు రాష్ట్రాలలోని జాతీయ, రాష్ట్ర రహదారులపై 5,500 మంది అతివేగం సంబంధిత ప్రమాదాలలో ప్రాణాలు కోల్పోయారు. ఆందోళనకరమైన విషయం ఏంటంటే.. తెలుగు రాష్ట్రాల్లో జరిగే అన్ని రోడ్డు ప్రమాద మరణాలలో 30 శాతం కంటే ఎక్కువ అతివేగం కారణంగానే సంభవించాయి. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వల్ల జరుగుతున్న ప్రాణ నష్టానికి ఇది ఉదాహరణ. తెలంగాణలో 2020 నుంచి 2023 మధ్య అతివేగం వల్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 25,000 మందికి పైగా మరణించారు. అతివేగం వల్ల సంభవించే మరణాలలో రాష్ట్రం దేశంలో ఏడో స్థా­నం­లో ఉంది. గుజరా­త్, ఉత్తరప్రదేశ్, బీహార్, ఒడిశా వంటి పెద్ద రా­ష్ట్రాల కంటే ఇది ఎక్కువ. ఇటీవలి కాలంలో దేశంలో రోడ్డు ప్రమాదాలు పెరుగుతూనే ఉన్నాయి. వీటికి కారణాల్లో ప్రధానమైనవి అతి వేగం, మద్యం తాగి వాహనాలు నడపడం, రాంగ్ రూట్ డ్రైవింగ్ చేయడమే.

Read Also: 300 Flights Delayed: సాంకేతిక లోపంతో నిలిచిపోయిన 300 విమానాలు.. ఎక్కడో తెలుసా..?

రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం దేశంలో రోడ్డు ప్రమాద మరణాలు 2017లో 1.48 లక్షల నుంచి 2023 వచ్చే సరికి 1.68 లక్షలకు పెరిగాయి. ఇందులో దా­దా­పు 70 శాతం మరణాలు అతి వేగం వల్లే జరుగుతున్నాయి. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రా­ల్లో ఇటువంటి ఉల్లంఘనల కారణంగా ప్రమాదాలు పెరిగాయి. తెలంగాణలో ఎన్ హెచ్163 పై జరుగుతున్న వరుస ప్రమాదాలు తీవ్ర కలవరపాటుకు గురి చేస్తున్నాయి. ఈ రహదారిపై జరిగిన ప్రమదాల్లో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. నిత్యం ప్రాణాలను బలి తీసుకుంటున్న ఈ 163 జాతీయ రహదారి తెలుగు ప్రజల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. చేవెళ్ల మండలం మీర్జాగూడ బస్సు ప్రమాదానికి ఎన్ హెచ్ 163 రహదారి దుస్థితే కారణం అని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇలాంటి రోడ్డు విషయంలో అడుగడుగునా అలస­త్వం, నిర్లక్ష్యం ఉందనే విమర్శలు వస్తున్నాయి. ఈ రోడ్డునని విస్తరించేందుకు 2018లో కేంద్రం నిర్ణయించింది. దాంతో అప్పటి వరకు ఆర్‌అండ్‌బీ అధికారుల ఆధీనంలో ఉన్న ఈ రోడ్డు హైవేగా ప్రకటించడంతో ఆర్‌అం­డ్‌బీ అధకారులు పక్కకు తప్పుకున్నారు.

తెలంగాణలో రోడ్డు ప్రమాదాలు ఏటేటా పెరిగిపోతున్నాయి. వేలాది మంది ప్రాణాలు గాలిలో కలసిపోతున్నాయి. గత 11 ఏళ్లలో రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల్లో మరణించినవారి సంఖ్య 86 వేలకు పైనే. రోడ్డు ప్రమాదాల్లో మరణాలు సంభవించినపుడు.. అక్కడ ప్రమాదం ఎందుకు జరిగింది? మరణం సంభవించడానికి కారణాలేమిటి? రోడ్డు నిర్మాణ లోపాలు ఉన్నాయా? అతి వేగమా? మరేదైనా కారణముందా అని గుర్తించాల్సిన వ్యవస్థలు నిర్వీర్యమవడమే దీనికి కారణమనే విమర్శలు వస్తున్నాయి. తెలంగాణలో రోడ్డు భద్రత, ప్రమాదాల నివారణ కోసం పోలీసుశాఖలో అదనపు డీజీ స్థాయి అధికారికి రోడ్‌సేఫ్టీ విభాగం బాధ్యతలు అప్పగిస్తుంటారు. ప్రత్యేకంగా రోడ్‌ సేఫ్టీ అథారిటీకి చైర్మన్‌ కూడా ఉంటారు. అది డీజీపీ స్థాయి పోస్టు. అసలు చాలా ఏళ్లపాటు ఈ పోస్టు ఖాళీగానే ఉంది. 2020లో మహేందర్‌రెడ్డి డీజీపీగా ఉన్న సమయంలో రోడ్డు ప్రమాదాల విశ్లేషణ చేపట్టారు. ఆ తర్వా త ఆ దిశగా పోలీసు బాసులెవరూ దృష్టిపెట్టలేదు. ఇటీవల డీజీపీగా బాధ్యతలు చేపట్టిన శివధర్‌రెడ్డి తొలిసారి పోలీసు ఉన్నతాధికారులు, యూనిట్‌ ఆఫీసర్లను ఉద్దేశించి మాట్లాడుతూ.. తెలంగాణలో ఏటా రోడ్డు ప్రమాదాల్లో ఆరేడువేల మంది వరకు మరణిస్తుండటం బాధాకరమని చెప్పారు. రోడ్డు ప్రమాదంలో మరణం సంభవించిన ప్రతిచోటా నిశిత విశ్లేషణ చేసి మరో ప్రమాదం జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కానీ పైస్థాయి అధికారుల సీరియస్‌నెస్‌ను కింది స్థాయిలో అందిపుచ్చుకోకపోవడంతో.. రోడ్డుప్రమాదాలు నిత్యకృత్యంగా మారిపోయాయి.

తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఈ ఏడాది సెప్టెంబరు నెలాఖరు వరకు 2,66,650 ప్రమాదాలు జరగ్గా.. 86,186 మంది మరణించారు. పోలీసుశాఖ జరిపిన విశ్లేషణలో.. 85శాతం ప్రమాదాలు మితిమీరిన వేగంతో, 4శాతం ప్రమాదాలు మద్యం మత్తుతో, మిగతావి వివిధ కారణాలతో జరిగినట్టు తేలింది. మితిమీరిన వేగంతో జరిగిన ఘటనల్లోనే 77శాతం మరణాలు నమోదవుతున్నాయి. ఇక రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్న వారిలో.. పాదచారులు 18శాతం, ద్విచక్ర వాహనదారులు 52శాతం, ఆటోల్లో ప్రయాణిస్తున్నవారు 6 శాతం, కార్లలో ప్రయాణిస్తున్న వారు 12శాతం, ట్రక్కులు, లారీల్లోని వారు 8శాతం, బస్సుల్లో ప్రయాణిస్తున్నవారు 4శాతం వరకు ఉంటున్నారు.

ఆస్ట్రేలియా, చైనా సహా ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో కూడా గరిష్టంగా గంటకు 110-120 కిలోమీటర్ల మధ్య వేగ పరిమితులు ఉన్నా యి. కొన్ని ప్రత్యేమైన హైవేలపై మాత్రం కొంత ఎక్కువ వేగాన్ని అనుమతిస్తారు. ఇలా సౌదీ, కజకిస్థాన్‌లలో గంటకు 140 కి.మీ, అమెరికాలో 137 కి.మీ.గరిష్ఠ వేగానికి అనుమతి ఉంది. ఇక ప్రపంచంలోనే అత్యధికంగా చెక్‌రిపబ్లిక్‌లోని టబోర్‌-సెస్కే హైవే, స్పెయిన్‌లో మ్యాకనెట్‌ డీ లాసెల్వా- ఎల్‌ వెండ్రెల్‌ హైవేలలో 150 కిలోమీటర్ల గరిష్ట వేగానికి అనుమతి ఉంది. అవి అత్యంత భద్రతా ప్రమాణాలతో నిర్మించిన రహదారులు. కానీ మన దేశంలో వేగ నియంత్రణ గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు.

హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌ నుంచి విజయవాడ ఇబ్రహీంపట్నం మధ్య దూరం 250 కి.మీ… ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సులు 3 గంటల్లో ఆ దూరాన్ని అధిగమిస్తాయి. అంటే ఆ బస్సులు ఎంత వేగంతో దూసుకెళుతున్నాయో అర్థమవుతుంది. ఈ హైవేలో రెండు చోట్ల స్పీడ్‌గన్‌లు ఉండగా, బస్సు డ్రైవర్లు ఆ ప్రాంతాల దగ్గరకు వచ్చేసరికి వేగం తగ్గిస్తున్నారు. నిజానికి మన హైవేలలో చాలా వరకు బస్సులైతే గంటకు 80 కి.మీ. వేగంతో, కార్ల వంటివి అయితే 100కి.మీ. వేగంలోపే ప్రయాణించేలా డిజైన్‌ చేసినవి. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. హైవేలపై వేగం గంటకు 90 కి.మీ. మించకూడదు. తెలంగాణలో అయితే 80కి.మీ. వేగం దాటకూడదు. కానీ ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సులను 120 కి.మీ.కుపైగా వేగంతో నడుపుతున్నారు. దీనితో ఏ చిన్న తేడా వచ్చినా క్షణాల్లోపే వాహనంపై డ్రైవర్‌ నియంత్రణ కోల్పోతారు. తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో అంతర్రాష్ట్ర సర్వీసుల్లో నడిచే రాజధాని, సూపర్‌ లగ్జరీ బస్సులకు 80కి.మీ, రాష్ట్రంలోపల తిరిగే సర్వీసులకు 75కి.మీ. వేగపరిమితి పాటిస్తున్నాయి.

Exit mobile version