NTV Telugu Site icon

డబ్ల్యూటీసీ తొలిరోజు ఆటకు వరుణుడి గండం…

టెస్ట్ క్రికెట్ చరిత్రలో ”ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్” జరగడం ఇదే తొలిసారి. కాబట్టి అభిమానులతో పాటు క్రికెటర్లు కూడా ఎంతో ఆతృతతో ఎదురుచూస్తున్నారు. ఈరోజు భారత్-కివీస్ మధ్య ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. కానీ తొలి రోజు ఆటకు వరుణుడి గండం ఉన్నట్లు సమాచారం. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ఇంగ్లాండ్ లో సౌథాంప్టన్‌ వేదిక జరగనుంది. కానీ అక్కడ ప్రస్తుతం వర్షాలు పడుతున్నట్లు తెలుస్తుంది. దీంతో సిబ్బంది మైదానంలోని పిచ్‌ను కవర్లతో కప్పేశారు. అయితే ఈ మ్యాచ్ కు ఐసీసీ ఓ రిజర్వు డే ఉంచిన విషయం తెలిసిందే. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.